top of page
Original.png

రావి చెట్టు! - వేపచెట్టు!

#KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు, రావిచెట్టువేపచెట్టు

Ravi Chettu Vepa Chettu - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao Published In manatelugukathalu.com On 18/01/2026

రావి చెట్టు - వేపచెట్టు - తెలుగు కథ

రచన: కర్లపాలెం హనుమంతరావు

పెద్ద చెట్ల పైన చిన్న చెట్లు పెరగడం గమనించే ఉంటారు. పక్షులు అక్కడా ఇక్కడా ఏరి తెచ్చిన చెట్ల విత్తనాలను వేరే చెట్టుపై వేస్తుంటాయి. ఆ విత్తనాలు క్రమంగా ఆ పెద్ద చెట్టు మీదే చిన్న మొక్కలా ఎదుగుతాయి. అట్లాంటి చిన్న మొక్కలు ఎప్పుడూ చిన్న మొక్కలుగానే మిగిలిపోతాయి. పెద్దచెట్టుకు పోటీగా ఎదగలేవు.


ఒక పక్షి ముక్కుతో ఓ వేప గింజను తీసుకెళ్ళి రావి చెట్టు మీద వేసిపోయింది. ఆ గింజ అక్కడే రావి చెట్టు నీడలో మొక్కలా ఎదగసాగింది. కానీ ఆ మొక్క ఎదుగుదల అంతంత మాత్రంగానే ఉండేది. రావి చెట్టు మీద ఆధారపడి పెరగటమే అందుకు కారణం. 


తన లోపాన్ని రావి చెట్టు మీద వేసేసింది వేప చెట్టు. రావి చెట్టుతో అది కోపంగా అంది “నువ్వేమో ఆకాశం ఎత్తుకు ఎదుగుతున్నావ్! నీ దగ్గరే ఉండే నన్ను మాత్రం ఎంతకీ ఎదగనీయటం లేదు!“


అందుకు సమాధానంగా రావిచెట్టు అందీ, "మిత్రమా, నువ్వు నా అంత ఎదగటం కుదరని పని. నామీద ఆధారపడటమే అందుకు కారణం. నీకు అంతగా పెరగాలని ఉంటే విత్తుగా ఉన్నప్పుడే నా మీద పడకుండా ఉండాల్సింది. పరాయివాళ్ళ మీద ఆధారపడి జీవించేవాళ్ళకు నీకు వచ్చిన కష్టాల వంటివి రాక తప్పదు! అవి వచ్చినప్పుడు మాకులాగా తట్టుకోవటమూ కష్టమే.”


రావి చెట్టు అన్నట్లుగానే ఒక రోజు బలమైన తుఫానుగాలి వీచింది. ఆ పెనుగాలి ధాటికి తట్టుకుని రావిచెట్టు నిలబడింది. కాని, దాని మీద ఆధారపడి ఎదిగే వేప మొక్క మాత్రం నేలకు వాలిపోయింది.


పరాయి వారి మీద పడి బతికెయ్యాలననుకునే బలహీనులకు వేప చెట్టుకు పట్టిన దుర్గతి పట్టక తప్పదు. నిటారుగా నిలబడాలంటే సొంత కాళ్ళమీద ఆధారపడడం ఒక్కటే మార్గం! 

 ***

కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page