top of page
Original_edited.jpg

రెఫ్యూజీ క్యాంప్

  • Writer: Sivajyothi
    Sivajyothi
  • May 19, 2024
  • 3 min read

ree

 'Refugee Camp' - New Telugu Story Written By Sivajyothi

Published In manatelugukathalu.com On 19/05/2024

'రెఫ్యూజీ క్యాంప్' తెలుగు కథ

రచన: శివ జ్యోతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జనం గుంపులుగా ఓ క్యాంపులో కనిపిస్తున్నారు. ఒక ఆఫీసరు వచ్చి వారి వివరాలు తీసుకెళ్తున్నారు. రెఫ్యూజీలు తమ బాధని వారితో చెప్తూ ఏడుస్తున్నారు. మీడియా వారు వీరి కథలను వింటూ ఏది హృదయ విదారకంగా ఉందోనని విచారిస్తూ అంచనా వేస్తున్నారు. ఈ కథ బావుంటుంది, ఈ కథలో బలం లేదు అని అంటూ ముగింపుకొస్తున్నారు. అసలే చలికాలం, పైగా సముద్రతీరం.. ఆ క్యాంపులో చిన్నపిల్లలు చలికి వనికి పోతున్నారు. వారికి ఎవరైనా బ్లాంకెట్స్ ఇవ్వకపోతారా అని గాలి చూపులు చూస్తున్నారు. 


చలి గాలి వారిని సూదుల్లా పొడుస్తున్నా కూడా వారు ఈపాటికి ఇంట్లో ఉంటే స్కూల్ కి వెళ్లి వచ్చే వాళ్ళము, టీవీ చూసే వాళ్ళము, అమ్మ చేతి డిన్నర్ తింటూ ఆట్లాడుకునే వాళ్ళము అని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది పిల్లలకి ఇంట్లో ఎందుకు లేమో, ఇలా ఒకచోట ఎందుకు నించున్నాము, ఎందుకు ఆటలాడలేకపోతున్నాము, అన్నీ అమరిన జీవితం ఒక్కసారిగా ఇలా ఎందుకు కుప్ప కూలింది అని పసివయసుకు అర్థం కాక తర్జనభర్జనలవుతున్నారు. చలికి ఆకలికి తట్టుకోలేని ముద్దు కూనలు వారి తల్లిని అమ్మ ఆకలేస్తుంది, చలేస్తోంది. అన్నం పెట్టమ్మా, నీళ్లు కావాలమ్మా బెడ్ షీట్ ఇవ్వమ్మా అంటూ గోల చేస్తున్నారు. 


వారి అవసరాలు తీర్చలేని తల్లిదండ్రులు వారి అచేతనానికి గుండెల అవిసిపోయేలా గొల్లుమంటున్నారు. రాత్రయింది. వయసులో ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులు ఏం జరుగుతుందోనని గుండెలు చేత్తో పట్టుకొని భయం భయంగా ఇక్కడ నుంచి బయటకు వెళ్లలేము. ఇక్కడే ఉంటే ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ, బాధపడుతున్నారు. నిద్రకు దూరమై వారి పిల్లలని గుండెలకి హత్తుకుని కాపాడుకుంటున్నారు. ఇంకొందరు తమ ఒంటి పైనున్న బంగారం ఇస్తామని తమకు దారి చూపాలని ఆఫీసర్లను వేడుకుంటున్నారు. 


ఒక ధార్మిక సంస్థ చిన్న పిల్లలకు గర్భవతులకు కాస్త తిండి పంచుతూ ఉంటే 14 సంవత్సరాలు పైబడిన పిల్లలు తాము ఎందుకు ఎదిగాము అని చిన్న పిల్లలుగా ఉండుంటే తమకు భోజనం దొరికేదని ఆలోచిస్తున్నారు. ఏడుస్తూ ఉన్నారు. గర్భవతులైన కొందరు తల్లులు తమ ఆహారం లో నుంచి కొంత ఆ పిల్లలకి పెట్టారు. క్యాంపు బయట చలిలో నుంచొని కొంతమంది తమ పేరు రిజిస్టర్ చేయకపోతారా తమను కూడా క్యాంపులోకి తీసుకోకపోతారా అని గంటలు గంటలు వానలో, వరుసలో నిలబడి ఎదురుచూస్తూ ఉన్నారు. కొంతమంది ఆఫీసర్ల దళారులు ఎదిగిన ఆడపిల్లల తల్లిదండ్రుల వద్దకు వచ్చి తమ పిల్లలని ఆఫీసర్ల వద్దకు పంపితే వారికి త్వరగా నివాసం ఏర్పాటు చేస్తామని రాయబారం చేస్తున్నారు. 


ఒప్పుకున్న కొందరు, ఒప్పుకోలేని కొందరు తమ తమ కారణాలకు, పరిస్థితులకు ఏడుస్తూ ఉన్నారు. వారి దేశానికి వారు ఎందుకు అవసరం లేకుండా పోయారు అని ఇంక కొందరు ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తున్న యువకులని ఒక తీవ్రవాద సంస్థ రెచ్చగొట్టి తమతో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని కష్టాలకు ఓర్చి అందులో ఎంతమంది బయటపడి బ్రతికి బట్ట కడతారు, ఎంతమంది ప్రలోభాలకు లొంగి పతనమవుతారు, ఇంకెంతమంది మానప్రాణాలను కోల్పోతారు అని విధి కూడా ఆలోచించే పరిస్థితిలో వారున్నారు. 


ఎవరు రాశారు వీరి రాతను ?ఎవరు కాపాడేరు వీరి భవితను? కాలమా లేనిది నీకు కనికర మా? వీరు కూడా రక్తం, మాంసం, నీతి, న్యాయం, బాధ, భయం, ఆనందం, ఆశ్చర్యం అన్నీ ఉన్న మామూలు మనుషులే. ఆకాశం చూపని భేదం భూమాత వీరిపై ఎందుకు చూపుతోంది? మనలా వారు ఎందుకు మన లేక పోతున్నారు ? ఇది ఎవరి తప్పు? వారిదా, దేశానిదా, ప్రభుత్వాన్నిదా, అధికారాన్దా, ఆలోచనదా, ఏదీకాక ఆ దైవానిదా ?


వారు రిఫ్యుజీలు అనే పేరున కాక ఈ దేశ ప్రజలు అనే స్థాయికి ఎదగాలని కోరుకుందాం. అందాక చిన్నదో పెద్దదో ఆ సమయంలో వారికి తిండి, బట్ట, నీరు అందించిన వారు దైవమై నిలుస్తారు. సాయం చిన్నదైనా ఇచ్చిన కంబలి ఒక్కటైనా పెట్టిన అన్నం పట్టడైన ఓ ప్రాణం వాటి తోటి నిలవక పోతుందా ?ఆ నిలిచిన ప్రాణం జన్మంతా నిన్ను మరచిపోతుందా? ఆ ప్రాణం నీదై ఆజన్మాంతం నిలవదా?

***

శివ జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



ree

రచయిత్రి పరిచయం:

నా పేరు శివ జ్యోతి . నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. నాకు రచనలపై ఉన్న ఆసక్తితో కథలు రాయడం కవితలు రాయటం మొదలు పెట్టాను . నాకు సమాజంలో జరిగే అన్యాయాలను ఆసక్తికరంగా రాయడం అంటే ఇష్టము. నా రచనలు పాఠకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page