top of page
Original.png

సైనికుడా! నీకు సలాం!

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #SainikudaNikuSalam, #సైనికుడానీకుసలాం, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 74


Sainikuda Niku Salam - Somanna Gari Kavithalu Part 74 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 09/05/2025

సైనికుడా! నీకు సలాం! - సోమన్న గారి కవితలు పార్ట్ 74 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


సైనికుడా! నీకు సలాం!

----------------------------------------

ఉన్న ఊరు, కన్నవారు

అందరిని వదిలిపెట్టి

త్యాగాన్ని నింపుకున్న

సైనికుడా! నీకు సలాం!


దేశ రక్షణ కొరకు

నీ ప్రాణాన్ని కడకు

పణంగా పెట్టుకునే

సైనికుడా! నీకు సలాం!


దేశమే ముఖ్యంగా

రక్షణే ధ్యేయంగా

సాగిపోయే సైనికా!

నీకు పాదాభివందనం


మీరే గనుక లేకుంటే

కాపలా కాయకుంటే

మాకు నిదుర ఉండునా!

త్యాగమూర్తీ! సైనికా!!


నీ త్యాగం చూశాక!

నా ప్రాణం సైనికా!

నేను సైతం అంటుంది

నీకు మద్దతునిస్తుంది

ree














నెమలమ్మ పాఠాలు

----------------------------------------

వదరుబోతుల కోతలు

గుంట నక్కల కూతలు

కొరగానివి చూడగా

సోమరి పగటి కలలు


అర్ధం లేని చేతలు

అనవసరపు మాటలు

చేతకానితనానికి

నిలువెత్తు సూచికలు


పసి పిల్లలు పువ్వులు

వెలుగులు చిరునవ్వులు

గాయపరచ కూడదు

వెన్నలాంటి మనసులు


త్యాగమయులు సైనికులు

దేశానికి రక్షకులు

దేనికైనా సిద్ధం

ఇస్తారు ప్రాణాలు


ఇంటిలోని వనితలు

క్రొవ్వొత్తుల కాంతులు

త్యాగానికి గురుతులు

అసమానం సేవలు


కన్నవారు గృహంలో

మిన్న వారు ప్రేమలో

వారుంటే గృహములు

కోకొల్లలు శుభములు

ree









మాతృభూమి గొప్పది

----------------------------------------

సృష్టిలో అన్నింటి

కంటే కడు గొప్పది

మాతృభూమి నేస్తం!

మరువకు ఈ సత్యం!


తల్లి మోసేది నిన్ను

నవ మాసాలు నిజం!

జన్మభూమి మోస్తుంది

తనలో కలిసే వరకు!


మాతృభూమి కోసం

బ్రతకాలోయ్! అనిశం

యేరులై పారాలి

గుండెల్లో పౌరుషం


మాతృభూమి ఋణమును

తీర్చాలోయ్! తప్పక

దేశమాత త్యాగమును

స్మరించుకోవాలి మానక

ree













జాగ్రత్త! నోటి మాట!

----------------------------------------

నలుగురికి మంచిగా

చెవులకూ ఇంపుగా

ఉండాలి నోటి మాట!

ఆదర్శ బాటగా


బడుగులకు కోటగా

వారి పాలిట తోటగా

ఉండాలి నోటి మాట!

కదిలించే పాటగా


కొండలా నిలకడగా

పువ్వులోని తావిగా

ఉండాలి నోటి మాట!

నాసికలో శ్వాసగా


ఇతరులకు చెరుపుగా

బాధ పెట్టు కురుపుగా

ఉండొద్దు నోటి మాట!

గాయపరచు కత్తిగా


నియంత్రించాలి నోరు

మాన్పాలి దాని హోరు

ఆచితూచి అడుగేసి

జనుల క్షేమం కోరు


నోటి మాట ముఖ్యం

జారిపోతే నష్టం

ఎముక లేని నాలుక

అన్నింటికి కీలకం

ree






అమ్మ ఇంట సర్వస్వం!

----------------------------------------

అమ్మ ప్రేమకు లేదు

సరైన కొలమానం

వట్టి మాటలు కాదు

అక్షరాలది నిజం!


ఎవరెస్టు శిఖరంలా

అమ్మలోని త్యాగం

సువిశాల గగనంలా

ఆమెకుంది సహనం


ఇంటిలోన దీపం

కంటిలోన రూపం

అమ్మ కదా దేవత

ఆమెకుంది బాధ్యత


ఆమె లేని సదనం

శిథిలమైన భవనం

తలపించు శ్మశానం

విలపించు కుటుంబం


-గద్వాల సోమన్న


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page