సంక్రాంతి పండుగ
- Gadwala Somanna
- Jan 14
- 1 min read
Updated: Jan 21
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #SankranthiPanduga, #సంక్రాంతిపండుగ

Sankranthi Panduga - New Telugu Poem Written By - Gadwala Somanna
Published In manatelugukathalu.com On 14/01/2025
సంక్రాంతి పండుగ - తెలుగు కవిత
రచన: గద్వాల సోమన్న
ఎన్నెన్నో సరదాలు
మిన్నంటిన సంబరాలు
సంక్రాంతి తెచ్చిందోయ్!
సందడే చేసిందోయ్!
కొత్త ధాన్యాలతో
కోడి పందాలతో
ఇంటింటా సంక్రాంతి
కొత్త అల్లుళ్ళతో
ముంగిట ముగ్గులతో
ఇంద్రధనుస్సు రంగులతో
అవనిలో సంక్రాంతి
అడుగిడెను కొత్త శోభతో
కొంటె మరదళ్ళతో
చిలిపి చిలిపి పనులతో
మహిలో మధుమాసము
మదిలో ఆనందము
మూడు రోజుల పండుగ
ముచ్చటైన పండుగ
సంస్కృతికి నిలయము
భారతీయుల పండుగ
-గద్వాల సోమన్న
Comments