సంక్రాంతికి ఏమి చేయాలి - చేయకూడదు
- P. V. Padmavathi Madhu Nivrithi

- Jan 14
- 5 min read
#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #TeluguArticle #SankranthikiEmiCheyaliCheyakudadu, #సంక్రాంతికిఏమిచేయాలిచేయకూడదు

Sankranthiki Emi Cheyali Cheyakudadu - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published in manatelugukathalu.com on 14/01/2026
సంక్రాంతికి ఏమి చేయాలి - చేయకూడదు - తెలుగు వ్యాసం
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
---------------- పరిచయం:- ---------------
అన్నీ మంచిలతో ...
ప్రతి రోజు పండుగే లా ఉండాలి ప్రపంచం లో ప్రజలందరికి. అదియే నిజమైన మానవత్వం - అసలైన పండుగ వాతవర్ణం. ప్రపంచం స్వర్గం లా మారిపోతుంది ... ఒక్క క్షణంలో.
సంక్రాంతి రైతుల పండుగ మరియూ సూర్యారాధన పండుగ.
----------------------------------------------------------------
1) సంక్రాంతికి ఏమి చేయాలి?
I) ఉదయం తొందరగా లేచి, పెందలాడే స్నానం చేసి భక్తి తో సూర్యారాధన - ఇతర దేవుళ్ళను కొలవటం ... అయినంత
పేదలకు దానధర్మాలు - సహాయం చేయడం ...
... కొత్త పంటలతో "శాకాహారం" - "ఆరోగ్యకరమైన" (తక్కువ మోతాదులో నూనె - ఉప్పు - చక్కెర - కారం - కొవ్వు - కొలెస్ట్రాల్) వంటలు చేసి తినడం ... పిండివంటలు వండుకోవడం ... ఇంటిని అలంకరించుకోవడం.... పత్తి - దారం తో పతంగులు ఎగురవేయడం (పక్షులకు - వాటి గూళ్లకు దూరంగా)
ii) "ఆత్మీయతలు - ఆప్యాయతలు - అనురాగాలు - అనుబంధాలు" పంచడం
iii) మంచి మాటలు చేతలు ఆచరణ ... సంతోష పూరిత నిర్వహణ... ఆనంద-దాయక పరిష్కారాల తీరు.... నిర్మాణాత్మక తీరు ... మంచి ఆరోగ్యం - ఆరోగ్యకరమైన ఆలోచనలు- శాంతి సౌభాగ్య పురోగతి - ప్రగతి ఐశ్వర్యాలు ఆయుష్షు సంపద ... ... వ్యాపింప చేయాలి.
iv) కొత్త బట్టలు ధరించడం (కొత్తవి కొనే స్తోమత లేకుంటే శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించడం).
V) పెద్దలను గౌరవించడం
vi) కుటుంబ సభ్యులతో - స్నేహితులతో - దగ్గర వారితో మరియు శ్రేయోభిలాషులతో .... ... ఆప్యాయంగా సమయం గడపడం
--------X ----X---X -----------------
2) సంక్రాంతికి ఏమి చేయకూడదు?
I)
మాంజ తో (చైనా మాంజ తో) పతoగులు ఎగుర వేయకూడదు [ఇది మానవులతో సహా ఇతరులను (పక్షులు, జంతువులను) గాయపరచగలదు].
ii)
మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదు ... మద్యపానం - ధూమపానం (పొగాకు) చేయకూడదు
... చెట్లు నరకకూడదు (ప్రకృతికి హాని చేయ్యొద్దు) ... ఇతరులను దూషించకూడదు ... స్నానం + పూజ చేయకుండా తినకూడదు
iii) ఇతరులతో విధ్వంసం - యుద్ధం - గొడవలు - వాదనలు చేయకూడదు
-------------X X X-------------------
3)
సంక్రాంతి హిందువుల పండుగ. (12- 13-14 జనవరి): పరిచయం
*(సం + క్రాంతి) 'సం' అంటే 'మిక్కిలి', 'క్రాంతి' అంటే 'మార్పు' లేదా 'అభ్యుదయం'.
ఈ పండుగ నాలుగు (4) రోజులు జరుపుకుంటారు.
i) భోగి,
ii) మకర సంక్రాంతి (పెద్ద సంక్రాంతి),
(పొంగల్ చేసుకుని తినడం).
iii) కనుమ,
iv) నాలుగో రోజు ముక్కనుమ (బొమ్మల పండుగ)
చలి కాలం ముగిసి, వెచ్చని (వేసవి కాలం) రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది, ప్రకృతికి, కొత్త పంటకు కృతజ్ఞతలు చెప్పే పండుగ
సంక్రాంతి. ఇది రైతుల పండుగ
------------------------------------------
4) సంక్రాంతి పండుగ వివరణ
సంక్రాంతి పండుగ 4 రోజుల వేడుక :-
I) భోగి
* పాత వస్తువులను భోగి మంటలలో వేసి, గత ఏడాదిలోని కష్టాలను అంతం చేయడం సూచిస్తుంది.
* పిల్లల తలపై భోగి పళ్లు వేస్తారు. అలా చేస్తే దేవుడు చల్లగా దీవిస్తాడని హిందువులు నమ్ముతారు. (శుభప్రారంభం సూచిస్తుంది - శుభం కలుగుతుంది అని నమ్ముతారు).
--------------------
ii) మకర సంక్రాంతి
*సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పండుగ, ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం, పంటల కోత ముగింపును సూచిస్తుంది. ఇది వ్యవసాయ సంస్కృతికి, ప్రకృతికి. - సూర్య భగవానుడికి ... కృతజ్ఞతలు తెలిపే వేడుక రోజు.
*ఇంటి ముందు సూర్య-రథం ముగ్గు (లు) వేస్తారు.
*ఈ రెండవ రోజున పొంగల్ వండుతారు,
(దీనిని "థాయ్ పొంగల్" లేదా "సూర్య పొంగల్" అని పిలుస్తారు, ఇక్కడ బియ్యం - పాలు - బెల్లం - మట్టి కుండలో ఉడకబెట్టడం జరుగుతుంది, ఇది సమృద్ధి మరియు నైవేద్యాన్ని సూచిస్తుంది).
-----------------------------------
iii) కనుమ:
*పశువుల పండుగ. (రైతులు తమ పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వాటిని అలంకరించి పూజిస్తారు - తిప్పుతారు).
-------------------------
Iv) ముక్కనుమ:
* ఇది బొమ్మల పండుగ. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టి, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
--------------X X X ----------------------
5) తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ....
*సంక్రాంతిని ... i) భోగి, ii) సంక్రాంతి, iii) కనుమ అని మూడు రోజులు జరుపుకుంటారు.
*ఈ పండుగ సమయంలో (ప్రత్యేకంగా రెండవ రోజు) తీపి పొంగలి (బెల్లంతో చేసేది) మరియు ఖారా పొంగలి (మిరియాలు, జీలకర్ర, అల్లంతో చేసేది) వంటకాలను తప్పనిసరిగా చేస్తారు (రెండవ రోజున)... కుటుంబ సభ్యులు తింటారు ... "ఆప్యాయతలు - అనురాగాలు - అనుబంధాలు" పంచుకుంటూ
---------X X X --------------------
6) "పొంగల్" తినే పదార్థము
I) "పొంగల్" అంటే తమిళంలో "పొంగడం" లేదా "ఉప్పొంగడం" అని అర్థం,
Ii) ఇది కొత్త పంట ధాన్యాలతో వండిన వంటకం ఉప్పొంగి పొర్లుతున్నట్లుగా ఉంటుంది.
(ఇక్కడ బియ్యం - పాలు - బెల్లం - మట్టి కుండలో ఉడకబెట్టడం జరుగుతుంది, ఇది సమృద్ధి మరియు నైవేద్యాన్ని సూచిస్తుంది).
Iii) ఇది సూర్య భగవానుడికి, పంటల దేవతలకు కృతజ్ఞతలు చెప్పే పండుగ, దీనిని "మకర సంక్రాంతి" రోజున జరుపుకుంటారు.
------------------ వ్యాసo సమాప్తం ---------------------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).




Comments