అమ్మ - అప్పు
- Kotha Viritha

- 2 hours ago
- 2 min read

Amma Appu - Telugu Inspirational Article | Kotha Viritha
అమ్మ - అప్పు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 25/08/2026
అమ్మ ఇంట్లో ఒక మనిషి కాదు… అందరి జ్ఞాపకాల బ్యాంక్. ఎవరికేం కావాలి, ఏది ఎక్కడుంది, ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ బిల్లు ఎప్పుడు కట్టాలి, ఎవరి పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది… కుటుంబంలోని ఎన్నో విషయాలు ఆమె మనసులోనే దాచబడి ఉంటాయి. మనం మర్చిపోయినా అమ్మ గుర్తుపెట్టుకుంటుంది. మన అవసరాల కోసం ఆమె జ్ఞాపకశక్తిని, సమయాన్ని, శక్తిని ప్రతిరోజూ తెలియకుండానే అప్పుగా తీసుకుంటుంటాం. కానీ ఆ అప్పుకు ధర కట్టలేం… ఎందుకంటే దాని వెనుక ఉన్నది ప్రేమ, బాధ్యత, త్యాగం.
అమ్మ ఇంట్లో ఒక మనిషి కాదు… అందరి జ్ఞాపకాల బ్యాంక్. ఎవరికి ఏం కావాలి, ఎక్కడుంది, ఎప్పుడు చేయాలి అన్నీ ఆమెకే గుర్తుండాలి. పిల్లల స్కూల్ టైమింగ్స్, ఇంట్లో సరుకులు, సామాన్లు, ఖర్చుల వరకు ఆమె మెదడు అనే క్యాలెండర్ లో ఫీడ్ అయి ఉంటాయి.
ఇంట్లో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే“అమ్మా, అది ఎక్కడుంది?”ఎవరు మర్చిపోయినా పర్లేదు, అమ్మ మాత్రం మర్చిపోవడానికి "వీల్లేదు".
పుట్టినరోజులు, బిల్లులు, పండుగలు, అపాయింట్‌మెంట్లు అన్నీ ఆమె మదిలోనే ఉంటాయి.
కుటుంబం సజావుగా నడవడానికి ఆమె మెదడు రోజంతా పనిచేస్తూనే ఉంటుంది. మన అవసరాల కోసం ఆమె జ్ఞాపకశక్తిని మనం ప్రతిరోజూ అప్పుగా తీసుకుంటూనే ఉంటాం.
“అమ్మకు అన్నీ గుర్తుంటాయి” అని అనుకోవడం కూడా ఒక అలవాటైపోతుంది. కానీ ఆ మెదడుకూ అలసట ఉంటుంది… ఆ మనసుకూ విశ్రాంతి కావాలి. అమ్మ మన సమస్యలన్నింటికీ పరిష్కారం వెతుకుతుంది.
మన చిన్న చిన్న విషయాలనూ తన పెద్ద బాధ్యతలుగా మోస్తుంది.
మనకు తెలియకుండానే ఆమె సమయాన్ని, శక్తిని, ఆలోచనలను అప్పుగా తీసుకుంటాం. అది కేవలం అప్పు కాదు… ప్రేమతో తీసుకున్న అప్పు.
కానీ నిజం ఏమిటంటే, అమ్మ మెదడును అప్పుగా తీసుకుని, ఎప్పటికీ అసలు కాదుకదా… వడ్డీ కూడా కట్టలేం మనం. ఎందుకంటే ఆమె మన కోసం ఖర్చు చేసిన ఆలోచనలకు ధర ఉండదు. ఆమె గుర్తుపెట్టుకున్న ప్రతి విషయం వెనుక ఒక త్యాగం ఉంటుంది.
అందుకే ఆమెను మరింత ఉపయోగించుకోవడం కాదు… ఆమె భారాన్ని కొంచెం తగ్గించాలి.
అందరి జీవితాలను గుర్తుపెట్టుకునే అమ్మ జీవితాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






Really super...
Nice 👌
Good
Excellent 👌 👌 👌