top of page

సరి అయిన నిర్ణయం


'Sari Ayina Nirnayam' New Telugu Story


Written By A. Annapurna


(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

''అమూల్యకి 15 ఏళ్ళు కదా… శారీ ఫంక్షన్ చేద్దాం. మన బంధువులను తెలిసిన వారిని పిలుద్దాం. వాళ్ళని చూసి ఎంతకాలం అయిందో!” అంటూ కోడలు ఇందుమతికి చెప్పింది సుగాత్రి.


''చాలులెండి! మీకు ఇప్పుడు సడన్గా బంధువులు, తెలిసినవారు గుర్తుకు వచ్చి వాళ్ళని చూడాలి అనిపించి మనింట్లో ఫంక్షన్ చేయాలా!


ఆరోజుల్లోనే మీరు గవర్నమెంట్ ఆఫీసులో వుద్యోగం చేసి మహిళా విప్లవం తెచ్చారు. కానీ మీలో ఆశయాలు ఏవీ నాకు కనిపించడం లేదు. ''అంది ఇందు.


''ఏమో నోయ్.... బహుశా నా ఏజ్ ప్రభావం కావచ్చు. ఒకప్పుడు అందరిని దూరం పెట్టిన నేను ఇప్పుడు వాళ్ళను కావాలి అనుకుంటున్నాను. అప్పుడు తీరిక లేని లైఫ్. "


''ఇన్నాళ్లు దూరంగా వున్నవారు ఇప్పుడు మాత్రం మీరు కోరుకుంటే వస్తారా! అది అలా ఉంచండి. ఇప్పుడు ఈ ఖర్చు అవసరమా? మీ గ్రాండ్ డాటర్ అస్సలు ఒప్పుకోదు. అమ్మూ కి చిన్నప్పటి నుంచి మోడరన్ డ్రెస్సులే అలవాటు. మీకు తెలుసును. అసలు మీరే నేర్పారు. మరిచిపోయారా?


''ఏమైనా అడిగితే ఏదో ఒకటి చెప్పి నన్ను మాటాడకుండా చేస్తావు. నీ చరణ దాసుడు ఉన్నాడే.. వాడు పెళ్లి కాకముందు మాత్రమే మై సన్. నువ్వు కనిపించగానే నీ లవ్వులో పడి ఆ ప్రబుద్దుడు నా మాట వినడం మానేసాడు. ఏమి చేయను.. నిన్ను దేబిరించాల్సి వస్తోంది. నీ ఇష్టం. ఇంటి పెత్తనం అంతా నీదేగా!” అంది సుగాత్రి.


''సరే ఆలోచిస్తాను. బట్ నాట్ ష్యోర్.!” అంది ఇందు.


ఏదో ఆవిడ సరదా.. తీర్చినా మానినా తనే. చరణ్ ఒక్కడే కొడుకు ఆవిడకి. చరణ్ కి ఇలాంటివి ఇష్టం లేదు.


అస్సలు పట్టించుకోడు. అంత తీరికా లేదు. అతడికి బంధువులు ఎవరూ తెలియదు. చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూలు చదువు.


ఒకరోజు అత్తగారి బంధువులు, తెలిసినవారు వెదికి లిస్ట్ తయారు చేసింది. అంట కలిపి 500 మంది వున్నారు. ఇలా కాదని మరో లిస్ట్ తయారు చేసి సగానికి తగ్గించి లెక్క కడితే ఖర్చు చాలా ఎక్కువ ఐనది. అదీ తగ్గించగా 150 కి లిమిట్ చేసి, సుగాత్రికి చెప్పింది.


''నో ఇందూ. మూడు వందలమంది కూడా లేకపోతే సందడి ఉండదు. ఖర్చు గురించి ఆలోచిస్తున్నావా? ఆ ముచ్చట నాది. ''


''నో మదర్ ఇన్ లా! తీరి కూర్చుని 5 లక్షలు ఖర్చు పెడతారా... నేను ఒప్పుకోను. అసలు అమ్మూ పెళ్లి కూడా సింపుల్గా చేస్తాను. మీరేమో సరదాకి 5 లక్షలు ఖర్చు చేయడం దండుగ. సారీ మిమ్మల్ని సపోర్ట్ చేయను. '' ఇందూ స్పష్టంగా చెప్పింది.


సుగాత్రి మొహం ముడుచుకుంటే.... ''ఒక ఐడియా చెబుతాను. మీ యంగ్ ఏజ్ నాటి ఫంక్షన్స్. వెడ్డింగ్. మీరు మామగారు వెళ్లిన ట్రిప్ వీడియోలు.. బోలెడు వున్నాయి. దుమ్ము దులిపినట్టు ఉంటుంది, మీ మిత్ర సపరివారాన్ని చూసినట్టు ఉంటుంది.


వాళ్ళు ఇప్పుడేమో సీనియర్ సిటిజన్స్. గుర్తు పట్టడం కూడా కష్టం. కొందరు అనారోగ్యం వలన పిలిచినా రారు. తీరా వచ్చిన వారిని చూసి 'అయ్యో నేను కూడా వాళ్ళ లాగే అయిపోయాను ' అని బెంగ పడతారు.


అదే ఆనాటి జ్ఞాపకాల్లో యంగ్ గా వున్నవారిని చూస్తే మీరుకూడా వయసు మర్చి పోయి ఎంజాయ్ చేస్తారు. ఓకేనా?'' అని అత్తగారి వయసును గుర్తు చేసింది కోడలు.


నిజానికి సుగాత్రి బంధువులు ఎవరూలేరు. అందరూ ఇందూ తరపు వాళ్ళే.


‘అవునుకదా.. వయసు వచ్చింది. సీనియర్ సిటిజెన్ అని అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు?’ అని సుగాత్రి లొంగి పోయిన్ది.


''నువ్వు వెరీ స్మార్ట్ ఇందూ! తెలివితేటల్లో నిన్ను మించిన వాళ్ళు లేరు'' అని డాటర్ ఇన్ లా మాట అంగీకరించింది.


కొద్ది రోజుల తర్వాత ''అత్తమ్మ ఈ రోజు మామగారి బర్త్ డే కదా! మనం ఒక ప్లేసుకి వెడదాం పదండి…” అంది ఇందు.


అప్పుడప్పుడు ఇందు సుగాత్రి ఒట్టినే ఆలా లాంగ్ డ్రైవ్ వెడుతుంటారు సరదాకి. సుగాత్రికి ఆలా వెళ్లడం ఇష్టం.


‘వెన్నెల కిరణం’ అనే ఒక విల్లా ముందు కారు ఆపింది ఇందు.


''ఇదెవరి హవుస్?” అడిగింది సుగాత్రి.


''హవుస్ కం హాస్పటల్. మా ఫ్రెండ్ సులోచన డాక్టర్గా ఇక్కడి ఆర్ఫాన్ టీనేజ్ పిల్లలకి హెల్ప్ చేస్తుంది. ఎంత కాలంగానో రమ్మని అడుగుతోంది. పదండి లోనికి!” అని డోర్ బెల్ బజర్ చేసింది.


ఆయా వచ్చి తలుపు తీసి హాల్లోకి తీసుకు వెళ్ళింది. “కూర్చోండి. ఇప్పుడే డాక్టర్ వస్తారు. '' అంటూ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చింది.


''నమస్తే ఆంటీ!” అని సుగాత్రిని, “ఇన్నాళ్ళకి తీరిక ఐనాదా మహారాణీ.... ఎలాగైతేనేం వచ్చావ్ '' అంటూ

ఇందు ని పలకరించింది సులోచన.


''మిమ్మల్ని ఇదే చూడటం సులోచనా... మా ఇందూ ఎప్పుడూ చెప్పనేలేదు. నాకు డాక్టర్ ఫ్రెండ్ ఉందని!” అంది సుగాత్రి.


''మదర్ ఇన్ లా, చెబితే ఎదో ఒక జబ్బు ఉందని అనుమానించి తీసుకెళ్ళు అంటారు. మా సులోచనకి అసలే తీరిక ఉండదు....! చాలా మంచిపని చేస్తున్నావ్ సులోచనా! అమ్మాయిలకు రక్షణ కరువు అవుతోంది. నీలాంటి వారి సహాయమే వారికీ మంచి భవిష్యత్తు ఇస్తుంది'' అని మెచ్చుకుంది.


''రండి. ఈరోజు ఆదివారం కనుక అందరూ ఇంట్లోనే వున్నారు” అంటూ మొత్తం నాలుగు అంతస్తుల ఆ ఇంటిని చూపించి అక్కడి అమ్మాయిలను పరిచయం చేసింది.


రూముకి ఇద్దరు వుంటారు. ఒక ఫ్లోర్ సులోచన కుటుంబం వుంటారు. మిగిలిన రూములు అమ్మయిలకే. చాలా సదుపాయంగా వుంది. వాళ్ళని పలకరించి చదువు గురించి అడిగింది సుగాత్రి.


''సులోచనా! ఇంతవరకు ఇలాంటి సర్వీస్ ఎవరూ చేయలేదు. ఐ ప్రౌ డాఫ్ యు! ఇదిగో నావంతుగా మా అమ్మ గారి పేరున 5 లక్షలు ఇస్తున్నాను'' అంటూ చెక్ రాసి ఇచ్చింది ఇందుమతి.


''థాంక్స్ ఇందూ! ఈ పక్కనే ఖాళీ ల్యాండ్ వుంది. దీన్ని దాతలు ఇచ్చారు. ఇక్కడ స్పోర్ట్స్, జిమ్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. సమయానికి ఇచ్చావు.” అంది సుహాసిని కృతజ్ఞత తెలియ చేస్తూ.


ఇంటికి తిరిగి వచ్చాక సుగాత్రి ఆ అమ్మాయిల గురించే ఆలోచించింది.


సుగాత్రి అనాధగా పెరిగింది. తల్లి పురిటి బిడ్డను చర్చి దగ్గిర విడిచి వెళ్ళిపోతే నన్స్ పెంచి పెద్దచేసి చదివించారు. లండన్ నుంచి వచ్చిన రాబర్ట్ సుగాత్రిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.


కుటుంబాన్ని ఇండియాలో ఉంచి వెళ్ళివస్తూ విమాన ప్రమాదంలో మరణించాడు.


అతను చనిపోయేనాటికి చరణ్ పసివాడు. తండ్రి తెలియదు. రాబర్ట్స్ సుగాత్రిని హిందువుగానే భావించి

ఆమెకు నచ్చిన మతాన్ని పాటించమన్నాడు తప్ప తన మతంలోకి మారమని నిర్బంధించలేదు. అంతటి గొప్ప మనసు అతడిది.


అతడి తరుపున వచ్చిన డబ్బుతో సుగాత్రికి బాగానే గడిచింది. చర్చి ఫాదర్ ‘మళ్లీ పెళ్లిచేసుకో’ అని ఎంత చెప్పినా సుగాత్రి ఇష్టపడలేదు.


తనతోబాటే పెరిగిన ఆర్ఫాన్ అమ్మయిలు ఏమి కోలుపోతారో తెలుసు. అదృష్టవశాత్తు రాబర్ట్ పెళ్లి చేసుకోవడం వలన నా జీవితం బాగా గడిచింది. కానీ రాబర్ట్ లేని లోటు అమ్మ నాన్నలు లేని లోటు ఎన్నటికీ తీరదు..... అని ఆమెకు బాధగా ఉండేది.


అంతులేని సంపద వుంది. దాన్ని సద్వినియోగం చేయాలి ఇకనుంచి.... అని నిర్ణఇంచుకుంది. మరునాడే ఇందూకి చెప్పింది.


''ప్రతి ఏడూ నేనుకూడా డా. సులోచనకు డొనేషన్ ఇస్తాను. రాబర్ట్స్ బర్తడే ఇకనుంచి ఆ అమ్మయిలతోనే జరుపుకుందాం. అంతేకాదు, సులోచనతో బాటు నేను కూడా అక్కడ పనిచేస్తాను'' అంది.


''మంచి ఆలోచన మీది. అలాగే చేయండి'' అంటూ మెచ్చుకుంది ఇందూ.


డా. సులోచన కొత్తగా కట్టిన బిల్డింగ్ కి రాబర్ట్స్ పేరు పెట్టింది.... కృతజ్ఞతగా.


''థాంక్స్ సులోచనా, ఈ మా సంపద అంతా అంకుల్ వల్ల వచ్చింది. ఆయన పేరు పెట్టడం సరి ఐనది!”

అన్నారు సుగాత్రి, ఇందూ సంతోషంగా!


సంపద ఉండగానే సరిపోదు. దాన్ని సక్రమంగా వినియోగించడమే వారి ఆదర్శం, ఒక ప్రయోజనం కూడా!


***

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.



నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)







48 views0 comments
bottom of page