top of page

సయాటికా (బ్యాక్ పెయిన్)


'Sciatica (Back Pain)' New Telugu Article


Written By A. Annapurna


రచన: ఏ. అన్నపూర్ణ


స్త్రీ -పురుషులు, చిన్న- పెద్ద అనే తేడా లేని యమబాధ పెట్టే ఈ సయాటికా చాలా మందికి అనుభవం వుండే ఉంటుంది.


ఎక్కువగా నడిచినా కూర్చున్నా విడవని మహమ్మారి ఇది. అయితే నివారణ లేకపోలేదు, వుంది. ఏమీ భయం లేదు. తగ్గదు ...అనే విచారం అక్కరలేదు. కీళ్ల నొప్పుల్లో ఇదో రకం. ఇండియాలో ఏదో ఒక మసాజ్ పరికరంతో ఫిజికల్ థెరపీ చేస్తారు. ఇంటిదగ్గిర హీటింగ్ పాడ్ పెట్టుకోమంటారు. కానీ తాత్కాలికమే .పైగా చాలా ఖర్చు కూడా. నిజానికి ఖర్చుకి జడిసి భరించలేక బాధను అనుభవించే వారే నాకు తెలుసు.


పై పూతగా క్రీములు, ఆయింట్ మెంట్ రాసుకుంటూ ఏదోలా గడిపేస్తారు. లేదంటే ఆయుర్వేదం ..హోమియోపతి ఆశ్రయిస్తారు. ఫలితం ఆవగింజ . ఖర్చు ఏదైనా ఎక్కువే.


మరెలా.... అంటే ఎక్సర్ సైజ్ కొద్దిగా.. ఎంతో కొంత నడకా.. ఉండాలి. నేను అమెరికన్ సిటిజన్ కనుక మాకు అక్కడ హెల్త్ ఫ్రీ ఫిజికల్ తెరపి ఉండటంవలన నేను చాలా మటుకు తగ్గించుకో గలిగాను. ఆకిటుకు ఏమంటే పరికరాలతోబాటు మాన్యువల్ తెరపీ కూడా చేస్తారు. చలి ప్రదేశాల్లో ఒక పట్టాన తగ్గదు. ఎక్కువగా కూర్చుని టీవీ చూడవద్దు. మామూలుగా ఇంటిపని చేసుకోవాలి. ఒబెసిటీ కూడా కీళ్ల నొప్పులకు కారణంగా చెబుతారు .....కానీ బక్కగా వున్నవారినీ ఈ బాధలు విడువవు .


మరోకారణం స్పైనల్ కార్డు దెబ్బతినడం. (వెన్నుపూసలు అరిగిపోడం.) అన్నిటికీ ఒకటే మంత్రం. మనకు గతంలో లేని అవకాశాలు ఇప్పుడు వున్నాయి . కనుక సద్వినియోగం చేసుకోడం. మన పిల్లలకు ఖరీదైన బైకులు కార్లు ఫోన్లు మరోటీ ఇవ్వడంకాదు. ఆరోగ్యం ఇవ్వగలగడం మన ముఖ్య బాధ్యత . అన్నీవున్నప్పటికీ జిమ్ కి వెళ్లడం, కనీసం రోజూ బైక్ (సైకిల్) తొక్కడం అలవాటు చేయండి.


వారితోబాటు అమ్మ నాన్నలు.. మీరూ వాడండి.


చిన్నతనం నుంచే యోగా స్పోర్ట్స్ నేర్పించండి. ....... ఆహారంలో జాగ్రత్తలు పాటించండి.

పెద్దవారైనా చేయగలిగే ఎక్సర్ సైజులో వున్నాయి. పట్టుదలగా ఆరోగ్యం కాపాడుకోండి.

ఫుడ్ మీద నియంత్రణ కూడా అత్యవసరం. ఇంటి భోజనానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.

***

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.






29 views0 comments
bottom of page