ఇది ఏ బలం పోటీ?
బుద్ధిబలం, ఇది ఏ బలం పోటీ, ప్రేరణాత్మక కథ, శాస్త్రీయ ఆలోచన, జట్టుకృషి, సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం, తెలుగు కథ

Idi Ye Balam Potee - Telugu Inspirational Story | P V Padmavathi Madhu Nivrithi
ఇది ఏ బలం పోటీ? - తెలుగు ప్రేరణాత్మక కథ | పి. వి. పద్మావతి మధు నివ్రితి
Published in manatelugukathalu.com on 26/07/2026
బుద్ధిబలం, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, జట్టుకృషి, పరిశీలన శక్తి విజయానికి ఎలా దోహదపడతాయో తెలియజేసే ప్రేరణాత్మక తెలుగు కథ 'ఇది ఏ బలం పోటీ?' చదవండి.
1) ఆ పాఠశాలలో 'బలం పోటీ' జరుగుతున్నది.
పోటీ నియమాలు బోర్డు పైన ఇలా రాశారు:
i) కొన్ని బరువైన బస్తాలను ఒక వ్యక్తి (మాత్రమే) ఒక వైపు నుండి మరొక వైపుకు 'తరలించాలి'.
ii) కానీ చాలా మంది - ఎంతమంది వ్యక్తులైనా... బరువులను ఎత్తి పెట్టవచ్చు (బరువు మోసే స్థలం పైన).
------------------------------------------
2) చాలా మంది అబ్బాయిలు ప్రయత్నించారు కానీ ఒక్క బస్తా కూడా ఎత్తలేకపోయారు. ఇక తరలించే ప్రశ్నే లేదు.
3) శ్రీలేఖ అనే విద్యార్థిని ఇటూ అటూ చూస్తూ, పాఠశాలలోని చెత్త వేసిన వైపు చూసింది. అకస్మాత్తుగా ఏదో ఆలోచన తటాలున తట్టింది ఆమె మదిలో. ఆమె మళ్ళీ బోర్డు మీద రాసి ఉన్న నియమాలను చూసి విజయగర్వంతో నవ్వింది. సందేహంతో అడిగింది, "అమ్మాయిలు కూడా ప్రయత్నించవచ్చా - పాల్గొనవచ్చా? ఈ బరువులెత్తే - కదిలించే పోటీలో?" అని.
అక్కడ ఉన్నవారందరూ "మగవాళ్లే చేయలేకపోయారు, ఆడవాళ్లు ఎలా చేయగలరు" అంటూ నవ్వారు.
ఉపాధ్యాయురాలు చిరునవ్వుతో, "ఎవరైనా పాల్గొనవచ్చు" అని అన్నారు.
4) శ్రీలేఖ పాఠశాలలోని చెత్తబుట్టల మూలకు వెళ్లి తోపుడు చక్రాల బండి తెచ్చుకున్నది. ఆమె తన స్నేహితులను పిలిచింది. వారందరూ కలిసి బరువున్న ప్రతి బస్తాను... ఒక్కొక్కటిగా... ఎత్తి... తోపుడు చక్రాల బండి మీద ఉంచారు (నియమం ii ప్రకారం: చాలా మంది వ్యక్తులు బరువులను ఎత్తి పెట్టవచ్చు).
5) ఆమె ఒంటరిగా చక్రాల బండిని అవతలి వైపుకు (గమ్యస్థానానికి) నెట్టింది - ప్రయాస లేకుండా సులభంగా. నియమం ప్రకారం (i): కొన్ని బరువైన బస్తాలను ఒక వ్యక్తి (మాత్రమే) ఒక వైపు నుండి మరొక వైపుకు 'తరలించాలి'. (వ్యక్తి మోస్తూ పోవాలి అని లేదు కదా! 'తరలించాలి' అని మాత్రమే ఉన్నది నియమంలో).
6) ఒక్క క్షణం పాటు ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. తరువాత చిరునవ్వుతో... అందరూ శ్రీలేఖ బుద్ధి బలానికి - పరిశీలన సామర్థ్యానికి చప్పట్లు కొట్టారు.
బహుమతిని అందజేస్తూ ఉపాధ్యాయురాలు, "ఈ పోటీ నుండి ఒక వ్యక్తి ఎలాంటి నీతులను నేర్చుకోవచ్చని" అడిగారు.
7) 'విజేత శ్రీలేఖ' బహుమతిని అందుకుని మైకులో ఇలా చెప్పింది:
"మనం ఈ క్రింది నీతులను నేర్చుకోవచ్చు:
I) ఇది ఏ బలం పోటీ? బుద్ధి బలం - భుజ బలం రెండూ.
II) రెండూ బలాలు తగిన సమయాల్లో అవసరంలో వాడాలి.
III) బరువు ఎత్తే సమయంలో జట్టు - సమిష్టి కృషి (well coordinated - cooperative friendly team effort) అత్యవసరం - ముఖ్యమైనది.
IV) విజ్ఞాన శాస్త్రాన్ని, అధునాతన సాంకేతికతను ఉపయోగించండి.
V) మొట్టమొదటి శాస్త్రీయ ఆవిష్కరణ చక్రం. ఎద్దుల బండి, చక్రాల బండి ఘర్షణను తగ్గించి, వస్తువులను కదిలించడాన్ని సులభతరం చేస్తాయి (దొర్లు ఘర్షణ తులనాత్మకంగా తక్కువగా ఉంటుంది కాబట్టి).
VI) అపాయంలో ఉపాయం ముఖ్యం, దిగులు కాదు.
VII) సూక్ష్మ దృష్టి, దూరాలోచన, పరిశీలన సామర్థ్యం కూడా ఉండాలి.
VIII) మంచి శ్రోతగా కూడా ఉండండి... ప్రశ్నను జాగ్రత్తగా వినండి, చదవండి... మంచి వక్తగా మాత్రమే ఉంటే సరిపోదు.
IX) సృజనాత్మకంగా, వినూత్నంగా ఆలోచించాలి."
X) ప్రతి మానవుడు ఎల్లప్పుడూ శాస్త్రీయ, సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణను, ఇరుపక్షాలకూ ప్రయోజనకరమైన విజయ పరిష్కారాలను మరియు నిర్మాణాత్మక స్వభావాన్ని అనుసరించాలి.
XI) ప్రతి మానవుడు ఎల్లప్పుడూ మంచి మాటలు, చేతలు, ఆచరణ... శాంతి, శ్రేయస్సు, పురోగతి... ఉత్తమ ఆరోగ్యం వంటివాటిని అందరికీ, ప్రతి సందర్భంలోనూ వ్యాప్తి చేయాలి.
[గమనిక: పైన చెప్పినవి సాధ్యమవుతాయి - క్రమమైన స్నేహపూర్వక శిక్షణతో, అలాగే సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ మరియు ఉభయతారక ఆనందకరమైన విజయ పరిష్కారాల సలహాదారులను క్రమం తప్పకుండా సందర్శించడం ద్వారా కూడా సాధ్యమవుతాయి."]
...అని శ్రీలేఖ ముగించింది (9 నీతులతో).
ఆ ప్రదేశమంతా చాలా సేపటి వరకు చప్పట్ల శబ్దంతో నిండిపోయింది... శ్రీలేఖ బుద్ధి బలాన్ని మరియు సూక్ష్మ దృష్టిని అభినందిస్తూ.
--- చిన్న కథ సమాప్తం ---
[OUR "157th" article in this popular prestigious Telugu web magazine. ....In about 1.5 years. THANKS to the encouraging & inspirational management of ... www.manatelugukathalu.com]
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు:
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).











Comments