top of page
Original.png

ఆ కుర్చీ రహస్యం

3 hours ago
5 min read

ఆ కుర్చీ రహస్యం తెలుగు కథలో మాధవ్, అతని తల్లి మరియు కొత్త కుర్చీ

Aa Kurchee rahasyam - Telugu Inspirational Story | P V Padmavathi Madhu Nivrithi

ఆ కుర్చీ రహస్యం - తెలుగు ప్రేరణాత్మక కథ | పి. వి. పద్మావతి మధు నివ్రితి

Published in manatelugukathalu.com on 14/09/2026


1)

మాధవ్

తన ఇంట్లో కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని ఆలోచనలు గతాన్ని తలచుకున్నాయి.


--------------------- గతం (Flashback) ----------------


మాధవ్ పాఠశాల నుండి తిరిగి వచ్చి తన ఇంట్లో ఒక కొత్త కుర్చీని చూశాడు. అతని ఇంట్లో అది మొదటి కుర్చీ. 


"అమ్మా, ఇంత ఖరీదైన కుర్చీ ఎందుకు కొన్నావు? నువ్వు అంత డబ్బు ఎందుకు వృధా చేశావు?", మాధవ్ తన ఆశ్చర్యాన్ని ఆపుకోలేకపోయాడు. ఎందుకంటే వారిది పేద కుటుంబం కాబట్టి.


"నీకోసం బాబు... నేను దానిని వాయిదాలలో కొన్నాను", అమ్మ చిరునవ్వుతో అన్నది... ఆప్యాయత - అనుబంధం - అనురాగంతో.


"నువ్వు కుర్చీలో కూర్చో మాధవ్.. నేను నీకు ఆహారం పెడతాను", అని అమ్మ అన్నది, కుర్చీ పక్కన నేల మీద కూర్చుని.


మాధవ్ ఆశ్చర్యంగా తన తల్లిని అడిగాడు కుర్చీలో కూర్చుని,

"అమ్మా, ఈరోజు అందరూ ఎందుకలా వింతగా ప్రవర్తిస్తున్నారు?


పాఠశాలలో కూడా నా కోసం ఒక మంచి కుర్చీ వేశారు. నేను ఇతరుల ఇళ్లకు వెళ్ళినప్పుడు, వాళ్ళు కూడా లేచి నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. నిన్నటి వరకు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు అందరూ నాతో ఎందుకంత గౌరవంగా ప్రవర్తిస్తున్నారు? నీతో సహా ... ఎందుకు అమ్మ అలా?"


"ముందు భోజనం చేయి, ఆ తర్వాత నేను నీకు ఈ కుర్చీ కొన్న రహస్యం - కారణం చెబుతాను", అమ్మ చెప్పింది చిరునవ్వుతో.


మాధవ్ బెట్టు చేసాడు, "నువ్వు ముందు కుర్చీ కొన్న రహస్యం చెప్పు, తర్వాత తింటాను... లేకపోతే నేను తినను", అని.


అమ్మ మాధవ్ చెవిలో గుసగుసలాడుతూ కుర్చీ రహస్యాన్ని వెల్లడించింది, "నిన్న నీ కోసం, నీ (6వ తరగతి) సహవిద్యార్థిని (క్లాస్‌మేట్) అందాల వింధ్య... మన ఇంటికి వచ్చింది కదా, అందుకే".


3)


మాధవ్ ఇప్పుడు రెట్టింపు ఆశ్చర్యపోయాడు. అతను, "ఈ రెండు సంఘటనల మధ్య సంబంధం ఏమిటి?" అని అన్నాడు అమాయకంగా.


"అందాల వింధ్య ధనవంతురాలు - గుణవంతురాలు. దేవతా హృదయం. నీకు రాజ యోగం ఇప్పటినుండి. ఈ రోజు నుండి మీరు యువరాజు", అమ్మ నవ్వుతూ చెప్పింది.

 

"డబ్బుకు లోకం దాసోహం ... నేను మాత్రo అందాల వింధ్య అందమైన మనసుకు, మంచికి దాసోహం ... ఆమె డబ్బుకు కాదు", అన్నాదు మాధవ్ నిట్టుర్పుతో.


"బాబు మాధవ్, హోంవర్క్ అయిపోతే లైట్ స్విచ్ ఆఫ్ చేసి పడుకో", అన్నది అమ్మ.


మాధవ్ గతానుభవాల - ఆలోచనల నుండి బయటపడ్డాడు.


4)


----------- గత స్మృతులు ముగిశాయి, -------------


ఇప్పుడు వర్తమానం (NOW PRESENT) 


"అలాగే అమ్మ", అన్నాడు.. మాధవ్.


నేల మీద ఒక పరుపు పరిచి దాని మీద పడుకున్నాడు. అతని హృదయం ఇలా అంది,

"ధన్యవాదాలు వింధ్య. అందరూ నాతో సౌకర్యంగా, శ్రద్ధగా, మంచిగా ప్రవర్తించాలని నువ్వు కావాలనే మా ఇంటికి వచ్చావు... నా సామాజిక సంక్షేమం - భద్రత - రక్షణ కోసం... ఇకపై ఎవరూ నన్ను దుర్వినియోగం చేయకూడదు, నాకు హాని చేయకూడదు అని".


"వింధ్య ... నువ్వు దేవతలను మించిన దేవతవు. నువ్వు నిజమైన నిస్వార్థ స్నేహo ఆంటే ... నువ్వు నాకు దేవుడిచ్చిన వరం - బహుమతి"... అని మాధవ్ అంతరాత్మ పలికింది.


వింధ్య గతంలో అన్న మాటలు మాధవ్ హృదయంలో - చెవులలో ప్రతిధ్వనించాయి,


"మాధవ్... నువ్వు మంచిని మించిన మంచి వాడివి. అందుకే నేను నిన్ను ఇష్టపడతాను. నువ్వు నాకోసమే పుట్టావు. నేను నీకోసం. మనది దేవుడు సృష్టించిన జంట... ఒకరి కోసం ఒకరు పుట్టాము.. ఈ నాటి మన బంధం ఏనాటిదో... మనది జన్మజన్మల బంధం... ఈ దళారీ - భూత తత్వపు ప్రపంచం నుండి నేను నిన్ను కాపాడతాను".


మాధవ్ తన పక్కనున్న కుర్చీపై చేతులు వేసి, పెదవులపై హాయి ఇచ్ఛె చిరునవ్వుతో నిద్రలోకి జారుకున్నాడు ... అందాల వింధ్య యొక్క తేనె మనస్సుల స్మృతులతో.


------------------ చిన్న కథ సమాప్తం -----------------


------------------- నీతి -----------------


1) డబ్బుకు లోకం దాసోహంగా బ్రతక్కూడదు... మరి? అందమైన మనసుకు, మంచికి, మానవత్వానికీ దాసోహంగా బ్రతకాలి.


2) నిజమైన నిస్వార్థ స్నేహం అంటే వింధ్య - మాధవ్‌ల జంటలా ఉండాలి... కలకాలం... జన్మజన్మల బంధంలా.


2) నిజమైన నిస్వార్థ స్నేహo అంటే వింధ్య - మాధవ్ ల జంటలా ఉండాలి ... కలకాలం ... జన్మజన్మల బంధంలా.


3) డాలర్ మోజు వద్దు... మరి?... దేవుడు చేసిన మనుషులు అంటే... ఆప్యాయత - అనుబంధం - ఆత్మీయత - అనురాగం --- సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ - ఉభయతారక ఆనందకరమైన విజయ పరిష్కారాలు - నిర్మాణాత్మక స్వభావం కావాలి.


3) డాలర్ మోజు వద్దు ... మరి? ... దేవుడు చేసిన మనుషులు ఆంటే ... ఆప్యాయత - అనుబంధం - ఆత్మీయత - అనురాగం --- సంతోషకరమైన అభివృద్ధి నిర్వహణ - ఉభయతారక ఆనందకరమైన విజయ పరిష్కారాలు - నిర్మాణాత్మక స్వభావం కావాలి. 

(అది కూడా బ్రోకరేజ్ - దలారి - టైమ్‌పాస్ - దుష్ట స్వభావం - భూత తత్వం - బలిపశువు చేయడం - నిందల ఆట - చెడగొట్టే స్వభావం - జోక్యం ... లేకుండా).

 

4) అందరికీ... మంచినీ - మానవత్వాన్ని పంచుతూ, పెంచుతూ - మంచి ఆరోగ్యం - మాటలు - చేతలు - ఆచరణ - శాంతి - శ్రేయస్సు - పురోగతి... వ్యాప్తి చేసుకుంటూ... బ్రతకాలి... దేవుడు చేసిన మనుషులు అంటే!...


భూతాల్లా బతక్కూడదు.


-------------------- నీతి సమాప్తం ---------------------







07 September 2026, Monday


This is OUR SENT "162nd" article in this popular prestigious Telugu web magazine. ....In about 1.5 years.


THANKS to the encouraging & inspirational management of ... www.manatelugukathalu.com

--------X X X --------- X X X ------- X X X ----------



07 సెప్టెంబర్ 2026, సోమవారం 


గమనిక:

ఈ జనాదరణ పొందిన ప్రతిష్టాత్మక వెబ్ మ్యాగజైన్‌లో ఇది మేము పంపిన "162వ" ఆర్టికల్ (కథ / వ్యాసం / క్విజ్)... సుమారు 1.5 సంవత్సరాలలో)



ధన్యవాదాలు ... ప్రసిద్ధ - ప్రతిష్టాత్మక


--------X X X --------- X X X ------- X X X ----------


--------------------- END -----------------------

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి కొన్ని ఇతర రచనలు:


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

P V Padmavathi Madhu Nivrithi

రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page