సంస్కారం

Samskaram - Telugu Inspirational Story| Addanki Lakshmi
సంస్కారం - తెలుగు ప్రేరణాత్మక కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 14/09/2026
మనిషి గొప్పతనం అతని సంపదలోనో, హోదాలోనో కాదు—అవసరంలో ఉన్న మరో మనిషికి చేయూతనిచ్చే మనసులో ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న మంచి పని మరొకరి ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. అలాంటి మానవత్వపు విలువను సున్నితంగా చెప్పే కథ ‘సంస్కారం’.
గేటు బయట హారన్ మోగుతోంది.
"శేఖర్ వచ్చేసాడు,
పద్మా! నా బ్యాగు ఏది?"
"ఇదిగోనండి" అంటూ చేతికి అందించింది పద్మ.
"బై పద్మా" అంటూ మూర్తి గబగబా గేటు దగ్గరకొచ్చి,
"అరె శేఖర్! సరిగ్గా టైంకు వచ్చేసావ్! గుడ్ మార్నింగ్" అన్నాడు కార్లో కూర్చుంటూ.
"మరి టైం అంటే టైమే కదా! మళ్లీ ట్రాఫిక్ లో ఒక్కొక్కసారి లేట్ అవుతుంది" అన్నాడు శేఖర్.
"నా కారు క్లీనింగ్ రెండు రోజులు పడుతుందన్నాడు, పాపం నీకు నా వల్ల శ్రమ" అన్నాడు మూర్తి, కారులో కూర్చుంటూ.
"ఏం కాదులే. శ్రమ ఏంటి స్నేహితుల మధ్య?" అన్నాడు నవ్వుతూ శేఖర్.
మూర్తి, శేఖర్ ఒకే కంపెనీలో పని చేస్తారు. కానీ వేరువేరు కాలనీల్లో ఉంటారు.
మూర్తి కారు రిపేర్ కి ఇచ్చాడు, అందుకే శేఖర్ వచ్చి మూర్తిని పికప్ చేసుకున్నాడు.
"బస్సులో వెళ్తానులే" అన్నాడు కానీ శేఖర్ ఒప్పుకోలేదు.
"ఏముంది 10 నిమిషాల ముందు బయలుదేరి వస్తాను, స్నేహితులకు ఈ మాత్రం సహాయం చేసుకోవాలి" అన్నాడు ప్రేమగా.
కొంచెం దూరం వచ్చిన తర్వాత శేఖర్ కారును ఒక బస్ స్టాప్ దగ్గర నిలిపివేశాడు.
"ఇక్కడ ఎందుకు నిలిపావు శేఖర్ కారు?" అడిగాడు మూర్తి.
ఇంతలో ఒక పాతికేళ్ల కుర్రాడు, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని రోడ్డుమీద నడుచుకుంటూ వచ్చాడు,
చెట్టు దగ్గర ఆపిన శేఖర్ కారు దగ్గరకు.
"హలో మహేష్, గుడ్ మార్నింగ్" అంటూ వెనక సీటు తెరిచాడు.
మహేష్ "గుడ్ మార్నింగ్ సార్" అంటూ మెల్లగా కారులో కూర్చున్నాడు.
ఒక 15 నిమిషాల్లో అతని బ్యాంకు వచ్చింది. ఆ బ్యాంకు దగ్గర దింపేశాడు.
"వెళ్ళొస్తా సార్, థాంక్స్" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
"శేఖర్! ఎవరీ అబ్బాయి? నీకు తెలుసా?" అని అడిగాడు మూర్తి.
"లేదు మూర్తి, నాకు తెలియదు. ఈ పిల్లవాడు ఎవరో, నేను వెళ్లే దారిలో ఆ బస్టాప్ దగ్గర రోజూ ఉంటాడు. ఒకసారి నా కారు పాడయింది. నేను కూడా బస్సులో వెళ్ళవలసి వచ్చింది. ఆ తోపులాటల్లో ఇతన్ని ఎవరూ ఎక్కనివ్వరు, చాలా కష్టపడి ఎక్కుతాడు.
ఇదంతా చూసి నాకు జాలి వేసింది.
అతను చదువుకున్నాడు ఎమ్మే వరకు. ఇప్పుడు బ్యాంకులో క్లర్క్ గా పని చేస్తున్నాడు, ఈమధ్యే ఉద్యోగం వచ్చిందిట.
ఇంటికి దగ్గరలో ఉన్న బ్యాంకులో వేశారు.
మూడు బస్టాపుల్లో వస్తుంది, మంచి కుర్రవాడు.
ఆ తర్వాత నా కారు బాగు అయింది. రోజూ ఈ కుర్రవాన్ని వాళ్ళ బ్యాంక్ దగ్గర దింపేసి, నేను ఆఫీసుకి వచ్చేస్తున్నాను.
సాయంత్రం వెళ్లేటప్పుడు వాళ్ళ ఆఫీసు ఫ్రెండు స్కూటర్ మీద ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపుతాడు, ఇదీ ఇతని స్టోరీ," అన్నాడు శేఖర్.
ఇద్దరూ ఆఫీసుకు వెళ్లిపోయారు.
ఆఫీసులో పని చేసుకుంటూ
మూర్తి మనసులో ఆలోచించుకున్నాడు.
"ఎంత జాలి మనసు శేఖర్ ది! గుడ్డివాడికి మంచి హృదయంతో రోజూ సహాయం చేస్తున్నాడు."
శేఖర్ తో పోల్చుకొని తనకు తాను మనసులో సిగ్గుపడ్డాడు మూర్తి.
అప్పుడప్పుడు తనకు ఇటువంటి సంఘటనలు ఎదురవుతాయి.
తను ఆఫీసుకు వెళ్తుంటే ఒకప్పుడు స్టూడెంట్స్ గాని,ఎవరైనా పెద్దవారు గానీ లేడీస్ గాని మధ్యలో చెయ్యి ఊపుతారు. ఆపమని,
బస్సు గురించి చాలా సేపు చూసి,తాను ఎప్పుడూ ఎవరినీ ఎక్కించుకోడు, వాళ్లను చూసి తాను మరీ స్పీడుగా వెళ్ళిపోతాడు.
కారు ఖాళీగానే ఉంటుంది, నలుగురు కూర్చోవచ్చు, అయినా ఎక్కించుకోడు.
ఒకసారి ఎక్కించుకుంటే ఇదే అలవాటు అవుతుందని తన భావన.
విశాల హృదయం అంటారు, తనకి అసలు లేదు. తన స్వార్థం తన పని. ఏదైనా మంచి చేస్తే అదేపనిగా వాళ్ళు తనని మోసం చేస్తారని భయం.
దీనివల్ల తాను ఏ ఒక్కరికీ సహాయం చేయడు.
ఇలా ఆలోచనలు సాగుతున్నాయి.
తన మీద తనకే అసహ్యం వేసింది. తాను చాలా సంకుచిత స్వభావుడు. నలుగురితో కలిసిమెలిసి ఉంటే తన వల్ల వాళ్ళు లాభం పొందుతారని భయం, అందుకే ఎవరితోనూ స్నేహం చెయ్యడు. ఒకవేళ చేసినా తనకన్నా హై లెవెల్ వాళ్లతో చేస్తాడు. డబ్బు లేని వాళ్ళన్నా, పేదవాళ్ళన్నా తనకి అసహ్యం.నిజంగా శేఖర్ ఎంత మంచివాడు!
మానవత్వం అంటే అదే కదా! ఎవరో తెలియని అంధునికి రోజూ సహాయం చేస్తున్నాడంటే గ్రేట్ కదా! గుడ్డివాళ్లంటే తనకు అసలే ఇష్టం ఉండదు.
నిజానికి తనని కూడా ఇంటికి వచ్చి కారులో ఆఫీసుకు తీసుకెళ్లవలసిన అవసరం లేదు.
తనకేమి లోటు లేదు కదా, తాను టాక్సీలో కూడా వెళ్లగలడు.
కానీ స్నేహబంధానికి విలువనిచ్చే శేఖర్,
శేఖర్ ని దగ్గరగా పరిశీలించేసరికి అతనిలో ఉండే మంచి గుణాలు కనిపించాయి మూర్తికి.
తాను కూడా శేఖర్ లా మంచి మనిషిగా మారాలి అని వెంటనే మనసులో నిర్ణయం చేసుకున్నాడు మూర్తి.
మూర్తి ఇప్పుడు చాలా మారాడు. పూర్వం కారులో తాను ఒక్కడే వెళ్లేవాడు.
ఇప్పుడు ఎవరైనా చేయి చాపితే తప్పకుండా ఎక్కించుకుని వారిని వాళ్ళ గమ్యానికి చేరుస్తాడు.
ఈ చిన్న సహాయం చేసినందుకే తనకు తానే సంతోషంగా ఫీల్ అవుతున్నాడు.
చిన్న చిన్న మంచి పనులు చేస్తే మనిషికి ఎంత ఆనందంగా, తృప్తిగా ఉంటుందో మూర్తి చాలా కాలానికి తెలుసుకున్నాడు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,











Comments