top of page

సెక్స్‌ టార్షన్‌

#AyyalaSomayajulaSubrahmanyam, #Sextorshan, #సెక్స్‌టార్షన్‌, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #TeluguStory, #తెలుగుకథ


Sextorshan - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam 

Published In manatelugukathalu.com On 03/05/2025

సెక్స్‌ టార్షన్‌ - తెలుగు కథ

రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ఆన్‌లైన్‌ లో లవ్‌బాంబింగ్‌ పెరిగింది. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నారు. లవ్‌బాంబింగ్ అంటే ప్రేమ కబుర్లు, మోసపూరిత వాగ్దానాలు చెయ్యటం, తాము ఎంపిక చేసుకున్న ప్రొఫైల్‌ తో మాటలు కలుపుతారు. 


ఆ మాటలు ఎంతో తియ్యనివి. పొగడ్తలతో నిండినవి. 

సులభంగా బుట్టలో పడవేసేవి. అలా అద్భుతమైన మాటలతో తాను ఎంతగా ప్రేమతో తపిస్తున్నది వివరించుటమే కాక, చిన్నచిన్న ప్రేమ బహుమతులు అందజేస్తారు. అలా పూర్తిగా ప్రేమమత్తులో ముంచి ఆ తరువాత వారి స్కామ్‌ మొదలు పెడతారు. ప్రేమమత్తులో మునిగివున్నవారినుండి నగదు, నగలు, బ్యాంక్‌ఎకౌంట్‌ వివరాలు తీసుకుంటారు. 


అందుకోసం తమ కుటుంబానికి సంబంధించిన చిత్రమైన కష్టాలు చెబుతారు. తిగి వెనక్కి ఇస్తామని వాగ్దానం చేస్తారు. తాము అనుకున్నవన్నీ అందుకోగానే ఆ ఫేక్‌ఫ్రొఫైల్‌ మూసివేస్తారు. 


ఆ ఫేక్‌ఫ్రొఫైల్‌ ను పట్టుకోవడం కష్టమవుతున్నదని అమెరికా ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేషన్‌ (FBI) అంటున్నది. 

 రొమాంటిక్‌ వేదికలు తయారు ఏర్పాటు చేసి ప్రేమమీద, రొమాన్స్‌ మీద చర్చలు నిర్వహిస్తూ వుంటారు. చక్కని రూపం, బలమైన శరీరంతో మగవాళ్ళు, ఒంపుసొంపులతో ఆడవాళ్ళు ఈ స్కామ్ చేస్తున్నారు. 

“సెక్స్ టార్షన్‌” అనే కొత్తపదం‌ నేడు ప్రచారంలోకి వచ్చింది. సెక్స్ ని ఎరగా వేసి డబ్బులు గుంజటం ఇందులో భాగం. టీనేజర్స్‌ ని ఇందుకు ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలకు సెక్స్‌మీద ఆసక్తి మొదలయ్యే వయసు అది. ఆ వయసులో సెక్సీ కబుర్లు, చిలిపి సెక్సీపనులతో వాళ్ళని లొందీసుకుంటున్నారు. 


ఆ సెక్స్‌ మత్తులో ఇంటిలోని పెద్దలకు తెలియకుండా డబ్బులు, ఆస్తుల డాక్యుమెంట్లు అవతలి వాళ్ళకి, మోసగాళ్ళకు అందచేస్తున్నారు. ప్రేమమత్తులోకి నెట్టి, అమ్మాయిల్లో కోరికలు పెంచి, తమ మాటలకు తగినట్టుగా ఆడిస్తూ వారి నగ్న ఫోటోలను తీయగలుగుతున్నారు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని బ్లాక్‌ మెయిల్‌ లకు పాల్పడుతున్నారు. 


నేటి యువత తమ ప్రతిచర్య ఇన్‌స్టాగ్రమ్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో కనీసం 200 కోట్ల మంది తమ రోజువారీ వివరాలు ఉంచుతున్నారు. ఇంతమంది డేటా ఉచితంగా

మోసగాళ్లకు అందిస్తున్నారు. ప్రభుత్వాలు వివరాలు అడిగితే వ్యక్తిగత గోప్యతకు భంగం అని వాదించే వర్గాలు కూడా

సామాజిక మాధ్యమాల్లో తమ వివరాలు, వివాదాలు యథేచ్ఛగా విప్పి చూపుతున్నారు. 

 ****** 

మీ ముందుకు ఒక చిన్న జరిగిన కథ.. 


భారత విదేశాంగ సేవలో పనిచేసే ఒక వనిత ట్రాప్‌ లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన విధం. 

జమునాబాయ్‌ భారత విదేశాంగ సేవలో సీనియర్‌ అధికారిణి. ఆమె వయస్సు ఏభై రెండు సంవత్సరాలు. కానీ అవివాహితురాలు. 


ఆమె ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్‌, లిబియా తో సహా అనేకసదేశాలలో సీనియర్‌ అధికారిగా పనిచేసింది. ఉర్దూపై ఆమెకున్న మంచి పట్టు చూసి ఆమెను పాకిస్తాన్‌ కు

పంపారు. అక్కడ ఆమెకు వీసాతో పాటు మీడియా బాధ్యతలు కూడా అప్పజెప్పారు. 


పాకిస్తాన్ లో నియమించబడిన అధికారులందరిపై నిఘా ఉంచింది. ఒక పార్టీలో జమునాబాయ్‌ జహంఘీర్‌ అలియాస్‌ జానీ అనే ముప్పైఏళ్ళ యువకుడిని కలిశారు. ఆ యువకుని వాక్ఛాతుర్యము మరియు తెలివితో జమునాబాయ్‌ హృదయాన్ని గెలుచుకున్నాడు. 


తరవాత జమునాబాయ్‌ అతనితో ప్రేమలో పడింది. ఇది మాత్రమే కాదు. జమునా బాయ్‌ ఇస్లాం మతంలోకి మారింది. జహంఘీర్‌ ను పెళ్ళి చేసుకుంది. ఈ విషయం భారత విదేశాంగ ఉన్నతాధికారులకు తెలిసింది. జమునాబాయ్‌ పై నిఘాదృష్టి తీవ్రతరమైంది. 


అప్పుడు జమునాబాయ్‌, జహంఘీర్‌ మీద ప్రేమతో ద్రోహిగా మారిందని తెలిసింది. ఆమె భారత దేశ సమాచారాన్ని జహంఘీర్‌ అలియాస్‌ జానీ కి చెబుతోందని తెలిసింది. నిజానికి జహంఘీర్‌ అలియాస్‌ జానీ ISI గూఢచారి. 

జమునాబాయ్‌ ను ట్రేస్‌ చేయడానికి  ISI అతనికి శిక్షణ ఇచ్చి నియమించింది. ఎందుకంటే జమునాబాయ్‌ వయస్సు ఏభైరెండేళ్ళు. అవివాహిత అని తెలిసినప్పుడు ఆమె ఖచ్చితంగా భాగస్వామి కోసం వెతుకుతుంది. జహంఘీర్‌ వల వేశాడు. 


ఇది తెలిసి ఆమెను ఏదో ఒక నెపంతో భారతదేశానికి పిలిపించి, ఆమె డిల్లీలో దిగిన వెంటనే అరెస్ట్‌ చేసింది భారతప్రభుత్వం. ఆమెకు అన్ని ఆధారాలు చూపెట్టారు. నేరం అంగీకరించింది జమునాబాయ్‌. 


ఆమెకు మూడు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించింది ప్రభుత్వం. కానీ కోవిడ్‌ మహమ్మారి సమయంలో, ఆమె కొంతకాలం జైలునుండి బెయిల్‌ పొందింది. 


తరువాత అజ్మీర్‌ వెళ్ళి అటునుండి అజ్ఞాతం లోకి వెళ్ళింది. ఆపై జమునాబాయ్‌ అజ్ఞాతంలో ఉండగానే మరణించిందని తెలిసింది. ఆమెకు కోవిడ్‌, డయాబెటిస్ మరియు అనేక

 ఇతర వ్యాధులు ఒకేసారి వచ్చాయనే వార్తలు వచ్చాయి. 


ఆమె అంత్యక్రియలు స్థానిక ప్రజలు మరియు మునిసిపాలిటీ సిబ్బంది కలిసి నిర్వహించారు. ఆమె మరణం తరువాత, ఏడవడానికి ఎవరూ లేరు. అంత్యక్రియలు నిర్వహించడానికి 

మరెవరూ లేరు. 


ఈ జరిగిన కథను పంచుకోవడంలో ఉన్న ముఖ్య విషయం ఏమిటంటే, ఇంత చదువుకున్న మరియు ఇంత సీనియర్‌ పోస్ట్‌లో పోస్ట్ చేయబడిన ఏభై రెండేళ్ళ పరిణతి చెందిన మహిళ కూడా లవ్‌ జిహాద్ లో చిక్కుగోగలదు అని. 


అలాంటప్పుడు పదునాలుగు, పదిహేను సంవత్సరాలు గల అమాయక బాలికలు ఈ వలలో చిక్కుకోగూడదని మనం ఎలా ఆశించగలం. 


ప్రతీసారి లవ్‌ మరియు ఆ హత్యకు సంబంధించిన ప్రతి సంఘటనకు ప్రతిస్పందన ఏమిటంటే, నిర్లక్ష్యం లేదా దాని పట్ల మనకు సానుభూతి, భయం ఏమీ లేవు. 


ఈ కుంభకోణాలకు డబ్బు, ఆస్తులే కాదు. చివరికి లవ్‌ కూడా ఫెయిలై బలి అయింది. ప్రేమ పేరుతో అత్యధికంగా ఆన్‌లైన్‌ లో మోసాలు జరుగుతున్న దేశాల్లో మనం మూడవ స్థానం లో ఉన్నాము. 


ఈ ఫేక్ ఫ్రొఫైల్స్‌ పెరుగుతున్నందున డేటింగ్‌ యాప్‌లు, మ్యారేజ్ బ్యూరో లతో జాగ్రత్త గా వ్యవహరించమని ఇండియన్ సైబర్‌ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ భారతీయులను హెచ్చరిస్తోంది. 


గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్‌ విషయంలో జాగ్రత్త గా వ్యవహరించటం ప్రస్తుత ప్రపంచంలో అవసరం. 

 ప్రస్తుత పరిస్థితుల్లో “ లవ్‌స్కాం” వెలుగు చూసింది. ప్రేమ కావాలి. కానీ అది స్వచ్చమైన  ప్రేమ కావాలి. 

 *****

కొసమెరుపు: ఈ లవ్‌ స్కాం లో బాలికలే కాకుండా పరిణతి చెందిన యువతులు కూడా మోసపోతున్నారు. వలపు వలలో చిక్కుకు పోతున్నారు. ఈ హానిట్రాప్‌ లో ఒక్కొక్కసారి మొగవాళ్ళు కూడా ఇరుక్కుంటున్నారు. 


***శుభంభూయాత్‌***


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








1 Comment


Good one

Like
bottom of page