top of page

సౌకర్యాలు


'Soukaryalu' - New Telugu Story Written By D V D Prasad

'సౌకర్యాలు' తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అప్పటివరకూ స్వంత ఇల్లు లేని ఆనందం రిటైరైన తర్వాత వచ్చిన డబ్బులతో గేటెడ్ కమ్యూనిటిలో ఒక ఫ్లాట్ కొందామనుకున్నాడు. అయితే భార్య సునీతకి మాత్రం ఊరి చివరైనా సరే ఓ ప్లాట్ కొని అందులో తమ అభిరుచికి అనుగుణంగా ఇల్లు కట్టుకొని ఇంటి ముందు ఓ ముచ్చటైన పూలతోట ఏర్పరుచుకోవాలని కోరిక. తన మాట నెగ్గించుకోలేక చివరికి భార్య కోరికవైపే మొగ్గు చూపాడు ఆనందం. టౌన్లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళ చూపించినవేవీ వాళ్ళిద్దరికీ నచ్చలేదు. ఈ క్రమంలో తనకి తెలిసిన స్నేహితులందరికీ కూడా చెప్పాడు ఎక్కడైనా మంచి ప్లాట్లు ఉంటే చెప్పమని.


ఒకరోజు ఆనందం స్నేహితుడు కోదండం అనుకోకుండా మార్కెట్లో కలిసి, "అవునూ, నీకు ఇల్లు కట్టుకోవడానికి ఓ ప్లాట్ కావాలని చెప్పావు కదా! నేనిప్పుడు ఉన్న ఏరియాలో నేను కట్టుకున్న ఇంటికి దగ్గరగానే ఓ ప్లాట్ అమ్మకానికి ఉంది, కొంటావా? మంచి ఏరియా. పైగా మనకి కావలసిన సౌకర్యాలు, సదుపాయాలూ అన్నీ దగ్గరగా అందుబాటులోనే ఉన్నాయి. " అన్నాడు గుంభనంగా నవ్వుతూ.


ఆనంద్ ఆ మరుసటిరోజు భార్యని తీసుకొని కోదండం ఇంటికి వెళ్ళాడు. కోదండం దంపతులు వాళ్ళిద్దర్నీ ఆహ్వానించారు. ఇల్లు బాగానే కట్టుకున్నాడు కోదండం, కాకపోతే ఆ కాలనీ పట్టణానికి చాలా దూరం.


కోదండం వాళ్ళకి ఆ ప్లాట్ చూపించాడు. ప్లాట్ చూసిన తర్వాత, "జాగా బాగానే ఉంది ఫర్వాలేదు. అయిదు సెంట్లు పైనే ఉంది, మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఓ పెద్ద తోట కూడా వేసుకోవచ్చు. కానీ నువ్వున్న ఈ ప్రాంతం అన్నింటికీ చాలా దూరంలో ఉంది. రైల్వే స్టేషన్, బస్టాండు కూడా పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దగ్గర ఒక్క హాస్పిటల్ కూడా లేదు. మనకి అవసరమైన బ్యాంక్, ఏటీఎం, రైతుబజారు కూడా దగ్గరలో లేవు. సూపర్ మార్కెట్ కాదుకదా, కనీసం వెచ్చాలు కూడా ఈ దగ్గరెక్కడా దొరకడం లేదు. మరి మనకి కావలసిన సౌకర్యాలన్నీ చాలా దగ్గరగా, అందుబాటులో ఉన్నాయని అన్నావు కదా?" అర్ధంకాక అడిగాడు ఆనంద్.


"అవున్రా! అవన్నీ లేకపోవచ్చు కానీ, మనకి కావల్సినవన్నీ దగ్గర్లోనే ఉన్నాయన్నది నిజం. కావలిస్తే చూడు, ఫారిన్ లిక్కర్ షాపు ఒకటి, బార్లు రెండు, ఇక్కడికి అరకిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మన స్నేహితులు దేవదాసు, డోసుబాబు, బీరుబాబు, మందు మస్తాన్రావు అందరూ ఈ కాలనీలోనే ఉన్నారు. పావు కిలోమిటర్లలోపునే మనం పేకడ్డానికి క్లబ్ కూడా ఉంది మరి! ఇంతకన్నా మనకింకేం సదుపాయాలు కావాలి?" మెల్లగా తన భార్యకి వినిపించకుండా అన్న కోదండం మాటలకి తెల్లబోయి చూసాడు ఆనంద్.


కోదండం భాషలో సౌకర్యాలంటే అవే మరి! తనేమో అపార్ధం చేసుకున్నాడు. తనెప్పుడో ఓ సారి వాళ్ళతో పేకాటలో కూర్చున్న మాట నిజం గానీ, ఇప్పుడు తనకలాంటి అలవాట్లేమీ లేవని తెలియని కోదండంకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తను రాంగ్ అడ్రెస్కి వచ్చానని మాత్రం అర్థం అయింది ఆనంద్ కి.

***

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.



63 views0 comments
bottom of page