top of page

సీత ఉయ్యాల పాట


'Seetha Uyyala Pata' - New Telugu Song Written By Sudarsana Rao Pochampally

'సీత ఉయ్యాల పాట' తెలుగు పాట

రచన: సుదర్శన రావు పోచంపల్లి


మిథిలా నగరాన ఉయ్యాలో

జనకుడూ మహరాజు ఉయ్యాలో

ఆరాజు క్షేత్రములొ ఉయ్యాలో

మట్టి దున్నగ బూన ఉయ్యాలో


పెట్టొకటి దొరికెనూ ఉయ్యాలో

బంగారు పెట్టెనూ ఉయ్యాలో

కంగారు పడి తెరువ ఉయ్యాలో

పసిడి వన్నె కలిగి ఉయ్యాలో


పసి పాప గాన్ పించె ఉయ్యాలో

మహరాజు కది దెల్ప ఉయ్యాలో

మహదానందముతొ ఉయ్యాలో

ముసి ముసి నవ్వుల ఉయ్యాలో


పసి కందు జూచుచూ ఉయ్యాలో

అనపత్యుడైనందున ఉయ్యాలో

ఆనందము తోడ ఉయ్యాలో

పట్టి నెత్తు కొని ఉయ్యాలో


ముద్దు పెట్టుకొనుచు ఉయ్యాలో

ముచ్చట పడి పాయె ఉయ్యాలో

దైవము తనయందు ఉయ్యాలో

దయ గలిగి ఉన్నదని ఉయ్యాలో

నాగేటి చాలులో ఉయ్యాలో

నా పట్టి దొరికెనని ఉయ్యాలో

సీత యను పేరుతొ ఉయ్యాలో

ప్రీతిగా పిలిచెను ఉయ్యాలో


అవనిజకు ఆ పేరు ఉయ్యాలో

ఆ తీరు పడిపాయె ఉయ్యాలో

జనక పుత్రి గాన ఉయ్యాలో

జానకని పేరొందె ఉయ్యాలో


మిథిల రాకు కుమార్తె ఉయ్యాలో

మైథిలని పిలువబడె ఉయ్యాలో.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


32 views1 comment
bottom of page