top of page

శ్రీమతి ఒక బహుమతి


'Srimathi Oka Bahumathi' - New Telugu Story Written By Mohana Krishna Tata

'శ్రీమతి ఒక బహుమతి' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

సెల్ ఫోన్ రింగ్ తో, బాత్రూం లో ఉన్న సతీష్ గబగబా రూమ్ లోకి వచ్చి ఫోన్ ఆన్సర్ చేసాడు.

"బాబు సతీష్! ఎలా ఉన్నావు? కొత్త ఉద్యోగం ఎలా ఉంది? చాలా దూరం వెళ్ళావు ఉద్యోగం కోసమని, అమ్మ తెగ బాధ పడుతుంది రా!"


"బానే ఉన్నాను నాన్న! ఇక్కడే హాస్టల్ లో రూమ్ లో ఉంటున్నాను. ఆఫీస్ ఇక్కడ నుంచి దగ్గరే."


"హాస్టల్ బానే ఉందా? రూమ్ లో గాలి వెలుతురు వస్తుందా? హాస్టల్ లో ఫుడ్ ఎలా ఉంది?" అడిగాడు తండ్రి.

"రూమ్ బానే ఉంది. లంచ్ కాంటీన్ లోనే చేస్తాను. రాత్రి హాస్టల్ ఫుడ్ మాత్రం అంత గొప్పగా లేదు" అన్నాడు సతీష్.


"ఇంట్లో భోజనం లాగా ఎలా ఉంటుంది లే! అన్ని చోట్ల కల్తీయే కదా! ఆరోగ్యం జాగ్రత్త కన్నా....ఉంటాను"


"మీ ఆరోగ్యం, అమ్మ ఆరోగ్యం చూసుకోండి...నేను ఇక్కడ బానే ఉన్నాను"


సతీష్ రెడీ అయి ఆఫీస్ కు వెళ్ళాడు. ఆఫీస్ లో అంతా కొత్త పరిచయాలు. అందరూ...వేరే రాష్ట్రాలనుంచి వచ్చినవారే.... ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు...తెలుగు తనం ఎక్కడా కనిపించలేదు. అసలే సతీష్ కు తెలుగు, తెలుగు సంప్రదాయాలన్నా, తెలుగు తనం అన్నా, చాలా మక్కువ.


ఆఫీస్ లో పని అయ్యాక, సాయంత్రం ఆఫీస్ క్యాబ్ లో హాస్టల్ కు చేరుకున్నాడు సతీష్. ఫ్రెష్ అయిన తర్వాత, ఫ్రెండ్ ఫోన్ చేసాడు తన ఊరు నుంచి.


"ఒరేయ్ సురేష్! ఏలా ఉన్నవాడు రా? "


"బానే ఉన్నాను రా! నీ పనే బాగుంది రా, ఉన్న ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ, తల్లి దండ్రులను చక్కగా చూసుకుంటున్నావు. నేనేమో ఇక్కడ దూరాన ఇలా..." అన్నాడు సతీష్


"అలాగంటావేంట్రా! సాఫ్ట్‌వేర్ జాబ్ కదా! మంచి సంపాదన."


"నిజమే అనుకో! ఇక్కడ అంతా వేరే బాషా వాళ్ళే. తెలుగు లో మాట్లాడాలంటే, ఒక్కరూ లేరనుకో. హాస్టల్ లో ఫుడ్ కూడా అంతంత మాత్రమే" అన్నాడు సతీష్


"అవునా సతీష్! ఇక్కడ, మీ అమ్మ, నాన్న కూడా బెంగ పెట్టుకుంటున్నారనుకో నీ గురించి...మొన్న మీ ఇంటికి వెళ్ళినప్పుడు అర్ధమైంది నాకు. వాళ్ళు అక్కడకు రావడం కుదరదు పాపం.

నువ్వు ఒక పని చెయ్యరా..ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకో....


కావాలంటే...నేను ఇక్కడ అమ్మాయిని చూస్తాను...లేదా మాట్రిమోనీ లో చూసి చేసుకో రా. అమ్మ,నాన్న తో నేను చెబుతాను లే!


పెళ్ళి చేసుకుంటే, టైం కు వండి పెడుతుంది భార్య, అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి, సలహా ఇవ్వడానికి, నిన్ను చూసుకోడానికి ఒక తోడు ఉంటుంది...అందుకే అంటారు 'శ్రీమతి ఒక బహుమతి' అని"


"నిజమే, అనుకో....అదే పనిలో ఉంటాను లే..." అన్నాడు సతీష్


మర్నాడు, మాట్రిమోనీ లో రిజిస్టర్ చేసి, చాట్ చేస్తున్నాడు. కానీ, ఏ అమ్మాయి అంత దూరము రావడానికి ఇష్టపడట్లేదు.


తన టీం లోకి రేపు కొత్త అమ్మాయి వస్తుందని ఎవరో మాట్లాడుకోవడం విన్నాడు. అమ్మాయి తెలుగమ్మాయి అని కూడా విన్నాడు.


మరునాడు అనుకున్నట్టు గానే ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది. అమ్మాయి చూడడానికి చాలా బాగుంది. తెలుగు మాట్లాడితే వినాలనుకున్నాడు సతీష్. అమ్మాయి, వర్క్ నేర్చుకోవడానికి, సతీష్ దగ్గరకే పంపించారు ప్రాజెక్ట్ మేనేజర్. అక్కడే ఇంట్రడక్షన్ కూడా చేసాడు మేనేజర్.


"హలో! నా పేరు మృదుల" అని ఇంట్రడ్యూస్ చేసుకుంది ఆ అమ్మాయి.


"నా పేరు సతీష్" అన్నాడు సతీష్ ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తూ..


ట్రైనింగ్ ఇస్తున్న రోజులన్నీ, సతీష్ మృదుల తో దగ్గరగా ఉండడం, నిత్యం డిస్కషన్స్ లో మాట్లాడమూ, లంచ్ టైం లో పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడం వల్ల చాలా దగ్గరయ్యాడు సతీష్ మృదులకు. ఆమె కూడా సతీష్ కంపెనీ చాలా బాగా నచ్చింది.


ఒక రోజు...మృదులను కాఫీ కు క్యాంటీన్ కు రమ్మన్నాడు సతీష్. ఇద్దరూ, ఒక సింగల్ కార్నర్ టేబుల్ లో కూర్చొని కాఫీ సిప్ చేస్తున్నారు. చుట్టూ ఎవరు లేరు. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది... రాత్రి నుంచి వర్షం పడటం చేత. ఇదే మంచి టైం అనుకున్నాడు సతీష్...


"మృదుల! నువ్వు తొందరగా వర్క్ నేర్చుకున్నావు...నువ్వు చాలా స్మార్ట్” అన్నాడు.


"మరీ పొగుడుతున్నారు" అన్నది మృదుల.


"మీరు ఏమి అనుకోకపోతే, ఒక మాట అడగనా మృదుల?"

"అడగండి సతీష్"

"మీ కన్నా అందమైన, మంచి అమ్మాయి నాకు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదేమో అని మిమల్ని చుసిన క్షణమే అనిపించింది. ఇది నా మనసులో మాట మృదుల. మీతో పరిచయం తర్వాత, నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. ఈ సంతోషం నాకు జీవితాంతం కావాలి మృదుల!" అని ఆత్రంగా అడిగాడు సతీష్


"ఐ లవ్ యు మృదుల" అన్నాడు సతీష్.


మృదుల ఒక నవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోయింది.


"మృదుల! ఏమి చెప్పకుండా వెళ్తే ఎలా?"


"సాయంత్రం పార్క్ లో కలుద్దాం" అంది మృదుల


వర్క్ అయ్యిన తర్వాత సతీష్ మృదుల కోసం వెయిట్ చేస్తున్నాడు. కొంచం లేట్ అయినా, మృదుల వచ్చింది పార్క్ కు.


"మీరు రారేమో అనుకున్నాను మృదుల!"


"నేను మిమల్ని చూసిన మొదటి రోజే బాగా నచ్చేసారు. మీ వ్యక్తిత్వం, మీ భాషాభిమానం, మీ ఫ్యామిలీ గురించి తెలుసుకున్న తర్వాత, ఇంకా బాగా నచ్చేసారు. మీకు తెలియని ఇంకొక విషయం చెప్పనా! మాది మీ ఊరు పక్కన ఉన్న పల్లెటూరు. కష్టపడి చదువుకుని, జాబ్ కోసం ఇంత దూరము వచ్చాను. మీ లాంటి మంచి మనిషి తోడు ఉంటే, నా జీవితానికి ఇంకేమి కావాలి..ఐ టూ లవ్ యు సతీష్" అంది మృదుల


ఇంకొక మాట, నేను వంట బాగా చేస్తాను, మిమల్ని జీవితాంతం బాగా చూసుకుంటాను.


ఇది.. కాబోయే ఈ శ్రీమతి... మీకిచ్చే బహుమతి.


************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


99 views0 comments

Comentarios


bottom of page