top of page

శ్రీ రామ శరణాగతి

#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #SriRamaSaranagathi, #శ్రీరామశరణాగతి,  #TeluguKavithalu, #తేటగీతి, #సీసము

ree

Sri Rama Saranagathi - New Telugu Poem Written By  - Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 01/07/2025 

శ్రీ రామ శరణాగతి - తెలుగు పద్యాలు

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

                                                

సీ.        

మదమత్సరములను, మదగజంబులకూల్చి 

మమతలు పంచిన, మధురమూర్తి !

క్రోధలోభంబుల, కోరల తెగగొట్టి

శాంత భూషణుడైన, సాధు మూర్తి! 

కామమోహంబుల, కల్మషము హరించి

జనవత్సలుండైన, సౌమ్య మూర్తి ! 

అరిషడ్వర్గంబుల,  హద్ధులో నిలిపిన

సత్పురాణజ్ఞాని  సత్యమూర్తి!

తే.గీ.    

నిన్ను, కౌసల్య ప్రియ సుతా ! నీరజాక్ష!

శివుని విల్లుని విరిచిన శ్రేష్ఠ వీర!   

లలన సీత వరించిన రామ చంద్ర!

శరణు జొచ్చితి,  కాపాడు పరమ పురుష!


తే.గీ.

తండ్రి మాట పాటించిన త్యాగ మూర్తి! 

సతి అహల్యను  గాచిన,  సాధు శీలి! 

పక్షి రాజుని బ్రోచిన, భక్త వరద!

 శరణు జొచ్చితి కాపాడు, పరమ పురుష! 


తే.గీ.   

సకల మునిజన వందితా!  సార్వభౌమ, 

దశరధాత్మజ!  సుకుమార!  ధర్మ మూర్తి

దుష్ట  సంహార! రఘునాధ!  దురిత దూర! 

 శరణు జొచ్చితి కాపాడు పరమ పురుష.! 


 తే.గీ.      

సకల వేళల నీనామ జపము చేతు  

భక్తి శ్రద్ధల పూజింతు పగలు రేయి,

ముక్తి పధమును పాటింతు శక్తి కొలది  

శరణు జొచ్చితి కాపాడు పరమ పురుష.! 


***

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

3 Comments


Super sir

Like

Excellent poem sir

Like

🙏🙏🙏

Like
bottom of page