శ్రీ వెంకటేశ్వర ప్రార్ధన
- Dr. C S G Krishnamacharyulu
- Jun 8
- 2 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #SriVenkateswaraPrardhana, #శ్రీవెంకటేశ్వరప్రార్ధన, #TeluguKavithalu, #తేటగీతి, #సీసము, #ఆటవెలది, #కందము

Sri Venkateswara Prardhana - New Telugu Poem Written By - Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 08/06/2025
శ్రీ వెంకటేశ్వర ప్రార్ధన - తెలుగు పద్యాలు
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
తే.గీ.
అమ్మ అలివేలు తో గూడి అవని పైన
ఆర్తజనులను బ్రోవంగ నవతరించె.
కలికలుష హారి, భక్తుల కల్ప తరువు
వేంకటేశుని, భక్తితో వేడు కొందు.
సీ.
ఏడు కొండల వాడు, ఇందిరా నాధుడు
బంగారు గుడిలోన బరగు వాడు
వడ్డి కాసులవాడు వరములొసగువాడు
నిలువు దోపిడి చేసి అలరు వాడు
సర్వ పాపహరుడు సాధు జనప్రియుడు
పొర్లు దండాలకు పొంగు వాడు
అఖిలాండ కోటికి ఆరాధ్య దేవుడు
మోక్షమొసగు వాడు రక్షకుండు
తే.గీ.
నిత్య కల్యాణ శోభతో నెగడు వాడు
భక్త సులభుడు ధ్యానించ పలుకు వాడు
మమ్ము గాచెడు సామి ! నామాల వాని
మ్రొక్కి వేడెద! తొలగింప చిక్కులెల్ల.
ఆ.వె.
అహము వీడి స్వామి ఆశ్రయించెద నిన్ను,
తలపు లందు నెపుడు నిలుపు కొందు
దివ్య చరణ సేవ దీక్షగా చేతును
సకలలోక నాధ! శరణు శరణు!
కందము
మంగళ మువేంక టేశా !
మంగళ ము సురే శ ! భక్త మానస చోరా!
మంగళ ముత్రిలో కేశా!
మంగళము గిరీశ! ! నీకు మంగళ మెపుడున్.
***
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
ఆటవెలది ఇనగన త్రయంబు నింద్రగణ ద్వయంబు హంసపంచకంబు ఆటవెలది తేట గీతి సూర్యడొక్కరుండ సురరాజులిద్దరూ దినకరద్వయంబు తేట గీతి సీస పద్యం ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు పాదపాదమందు పల్కుచుండు ఆటవెలదినైన తేటగీతియు నైన చెప్పవలయు మీద సీసమునకు కందపద్యం
పాదాలు=4
కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలు మాత్రమే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు.
2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు.
2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి.
2,4 పాదాలలో చివరి అక్షరం గురువు, అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి.
పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతోనే మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతోనే మొదలుకావాలి.
యతి: 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి.
ప్రాస: ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు. 🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రతిపదం లో ఆ స్వామి మీకు ఇచ్చిన అనుగ్రహం మరియు అశీస్సులు కనిపిస్తున్నాయి. చదువుతుంటే అన్నమయ్య గారి పాట వింటున్నట్టు, మనస్సంతా భక్తితో, ఆనందంతో నిండిపోయింది. ఈ పద్యం చదివి స్వామి ని తలుచుకున్న పాఠకులు అదృష్టవంతులు. ఓం నమో వెంకటేశాయ🙏
"కావ్యం, భక్తి, సంగీతం అన్నీ కలిసిన మణిపూసల హారమిది, ఏమి రాసారు సార్!... ఒక్కొక్క పదమే వేంకటేశుని అర్చనల్లా ఉంది. మా హృదయపూర్వక వందనములు మీకు!"
వెంకటేశ్వర ప్రార్ఘన నిజమైన భక్తుని అంతరంగమును ప్రతిఫలింపచేస్తోంది .
రచ్యితకు అభినందనలు