top of page
Original.png

సృష్టి పాఠాలు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #SrushtiPatalu, #సృష్టిపాఠాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 134


Srushti Patalu - Somanna Gari Kavithalu Part 134 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 22/10/2025

సృష్టి పాఠాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 134 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


సృష్టి పాఠాలు

-------------------------------------------

మొలకెత్తే విత్తనము

ప్రకాశించు రవి కిరణము

స్ఫూర్తికవి నిదర్శనము

చూపించును ఆదర్శము


ప్రవహించే సెలయేరులు

ప్రసరించే వాయువులు

భువిలో పరోపకారులు

ఫలాలిచ్చే వృక్షములు


ఎగసి పడే కెరటాలు

వాడిపోయే పుష్పాలు

నేర్పును జీవిత సత్యాలు

నీటి మీద బుడగలు


ప్రవాహానికెదురీదే

కనువిందు చేయు చేపలు

ఏదో ఒకటి నేర్పుతాయి

విశ్వంలోని జీవులు


వెలుగునిచ్చు దీపాలు

చిత్రకారుని చిత్రాలు

ఎన్నెన్నో బోధించును

శిల్పకారుని శిల్పాలు


సృష్టిలోని ప్రతిదీ

నేర్పునోయి పాఠము

దిద్దుకుంటే జీవితము

అవుతుందోయి ఉన్నతము












అక్షరాల గోస

------------------------------

కోల్పోవద్దు నిగ్రహము

తెచ్చుకోకు ఆగ్రహము

ప్రశాంతమైన జీవనము

సమాజంలో అవసరము


కుళ్లుబోతుతనం ముప్పు

అది తగలబెట్టే నిప్పు

కనువిప్పు కలిగేలా

ఈ సంగతి విప్పి చెప్పు


రాతిలాంటి హృదయాలు

దయ్యాలకు నిలయాలు

మృదువుగా మార్చుకుంటే

అగును కరుణ మందిరాలు


కఠినమైన మాటలతో

విసిగించే చేతలతో

ఇబ్బంది పెట్టరాదు

పనికిమాలిన పనులతో













విశ్వశాంతికి సూత్రాలు

------------------------------------

ఉన్నంతలో తృప్తిగా

ఉండడం నేర్చుకుంటే

సుఖమయమగును జీవితము

అలవాటు చేసుకుంటే


పరుల విషయాల్లో గనుక

తలదూర్చడం మానితే

ఆనందం ప్రవహించును

ఆహ్లాదం సొంతమగును


వ్యక్తిగత విషయాల్లో

జోక్యమే మేలు కాదు

పచ్చని కుటుంబాల్లో

నిప్పులు పోయకూడదు


పొరుగు వారితో వైరము

కాదు ఒప్పు ఏమాత్రము

తెలుసుకుంటే ఈ సూత్రము

విశ్వశాంతి సుసాధ్యము








అదుపులోనే గెలువు

-----------------------------------------

పవిత్రమైన హృదయము

భగవంతుని ఆలయము

అపవిత్రమైన పనులతో

చేయకూడదు మలినము


శ్రేష్టమైన తలపులతో

ఉన్నత భావాలతో

జీవించి చూపాలోయ్!

పసిడిలాంటి గుణాలతో


మనసే అతికీలకము

అదుపు చేస్తే క్షేమము

అగ్నివంటి నాలుకయే

అన్నింటికీ మూలము


అవయవాలపై నియంత్రణ

జీవితాల్లో రక్షణ

నేర్పాలోయ్!క్రమశిక్షణ

మారాలోయ్! ఆలోచన




















జాగ్రత్త! నోటితో

-------------------------------------------------

బుద్ధిహీనుని నోరు

వట్టి సంద్రపు హోరు

అనుదినము పోరునే

ఖచ్చితంగా కోరు


నోటిని చేయాలోయ్!

జాగ్రత్తగా అదుపు

పొదుపుగా వాడాలోయ్!

అప్పుడే కదా గెలుపు


నాలుక ప్రమాదకారి

గమనించు ఓ సారి

అందుకే చెపుతున్న

క్షేమాన్ని కోరి కోరి


గొడవలకు కారణము

చూడంగా నాలుక

యథేచ్చగా వాడితే

తుదకు అధోగతే

-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page