top of page

స్త్రీ మూర్తి

#ChilakamarriRajeswari, #చిలకమర్రిరాజేశ్వరి, #SthreeMurthi, #స్త్రీమూర్తి,  #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Sthree Murthi - New Telugu Poem Written By  - Chilakamarri Rajeswari

Published in manatelugukathalu.com on 01/07/2025 

స్త్రీ మూర్తి - తెలుగు కవిత

రచన: చిలకమర్రి రాజేశ్వరి

                

అసమాన పరాక్రమంతో శత్రువులపాలిట సింహస్వప్నంగా మారిన రుద్రమదేవి


ధైర్యసాహసాలతో, భర్తకు అండగా నిలిచి

నరకాసురుని అంతమొందించివ సత్యభామ

 ఐతిహాసిక వీరగాధలను ఉగ్గుబాలతో రంగరించి

శివాజీని దేశభక్తునిగా తీర్చిదిద్దిన జిజియాబాయి

 రాముని  కోసం రాజ్యభోగాలు  త్యజించి       పదునాలుగేండ్లు వనవాసానికి తరలిన సీతాదేవి

నిష్కల్మషమైన భక్తితో ఓపికగా జీవితాంతం

ఎదురుచూసి రాముని దర్శనం పొందిన శబరి

కష్టాలలో ఉన్నవారికి కరుణామయి , ఆశాజ్యోతి, సర్వజనులకూ  సేవామూర్తి అయిన మదర్ ధెరిసా

పట్టుదలతో సాధించలేనిది లేదని  నిరూపించి  

కర్తవ్యనిర్వహణలో అసువులు బాసిన కల్పనాచావ్లా

మనకు స్ఫూర్తిప్రదాతలు, మార్గదర్శులు  పురాణాలలోనైనా , చరిత్ర లలో నైనా, 

ఎందరో స్త్రీ మూర్తులు 

వారిని ఆదర్శంగా తీసుకుందాం, మన జీవితాలను  తీర్చిదిద్దుకుందాం 

అసూయా ద్వేషాలకు అతీతంగా ఉందాం

అసంఘటిత శక్తులను అడ్డుకుందాం

అరాచకశక్తులకు తనిఖీ పెడదాం

మానవతావిలువలను పరిరక్షించుకొందాం

మగువ తలుచుకున్న సాధించలేనిది ఏమీలేదని నిరుపిద్దాం

విశ్వమానవ కల్యాణానికి మనవంతు కృషి చేద్దాం

***



చిలకమర్రి రాజేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: చిలకమర్రి రాజేశ్వరి

 

నా పేరు చిలకమర్రి రాజేశ్వరి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో డిప్యూటి జనరలు మానేజర్ గా పనిచేసి, ఆగష్టు 2024లో రిటైరు,అయ్యాను.


మా కుటుంబ సభ్యులందరూ సాహితీప్రియులు కావడంతో, నా చిన్ననాటి నుంచే, తెలుగు వార,మాస పత్రికలు, నవలలు చదవం అలవాటు అయింది. అదే నాలోని పఠనాసక్తిని పెంపొందించింది. అనేక అంశాల మీద కవితలు రాయడం అభిరుచిగా మారింది. స్టీలుప్లాంట్ వారు,నిర్వహించిన వివిధ కవితల పోటీల్లో పాల్గొనడం, కొన్నిటికి బహుమతులు అందుకోవడం జరిగింది.


నీవు రాయగలవు అంటూ నన్ను అనునిత్యం ప్రోత్సహించే కుటుంబసభ్యుల మద్దతు నాకుండటం నా అదృష్టం.


పుస్తకాలు చదవడం నా హాబీ. తెలుగు, ఇంగ్లీషుభాష లలో వీలైనన్ని మంచిపుస్తకాలు చదివి నా మనోవికాసాన్ని,  నా విశ్లేషణాశక్తిని మెరుగుపరుచుకోవాలని నా ఆకాంక్ష.

2件のコメント


బాగుంది స్త్రీ మూర్తి స్వరూపం

いいね!

professorcsgk
6 days ago

మంచి భావన. చక్కని పదాల. వెరసి స్ఫూర్తి నిచ్చే కవిత

いいね!
bottom of page