top of page
Original.png

స్వ తత్త్వం

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #SwaThathwam, #స్వతత్త్వం, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

Swa Thathwam - New Telugu Poem Written By - Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 13/12/2025

స్వ తత్త్వం - తెలుగు కవిత

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

పంచ కట్టు - చీర కట్టు

నొసట బొట్టు

ఇంటి ముంగిట ముగ్గు

మాయమవుతున్న తీరు

ఆశ్చర్యం! అతి లజ్జాకరం

జాతి సంస్కృతి దుస్థితికి నిలువుటద్దం.


నీ భాషా సాహిత్యాలు, నీ సంగీత నృత్యాలు

నీ జానపద గాత్రాలు, నీ చిత్ర శిల్ప కళా నైపుణ్యాలు

నీ ఉనికిని అస్తిత్వాలను తెలిపే నీ కంఠస్వరాన్ని తృణీకరించడం హేయాతి హేయం.


నీ ఆటపాటల్ని, పండగపబ్బాల్ని

నీ సరసోక్తుల్ని, చతుర పద ప్రయోగాల్ని

నీ తత్త్వాన్ని, ఆలోచనా ఒరవడిని

మరవడం మానధనులకు అవమానం.


నీ ఆత్మ గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని

నీ నాగరికతను, సొంత గొంతుకను తుడిపేసుకోవడం, నీ మూర్ఖత్వానికి మరో రూపం

పరాయీకరణకు,‌ పరమ పరాకాష్ట


ఏ జాతి తన సంస్కృతిని ముప్పై శాతం కోల్పోతుందో

ఆ జాతి మరణశయ్యపై ఉన్నట్లని

ప్రపంచ మేధావులు ఉటంకించిన ఉవాచ 


నీ సంస్కృతి నిన్ను ప్రపంచ సంస్కృతులలో

విశిష్టుడిగా సగౌరవంగా నిలుపుతుంది


కావున...

ఆలోచనా సమాలోచనుడివి కమ్ము!

తిరస్కృతుల్ని, తరోగమనాల్ని చక్కబెట్టు!

మాతృ స్థానాన్ని ఉన్నతోన్నతంగా నిలబెట్టు!


 ---------


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:


పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.

పుట్టింది  1960లో.

చదివింది డిగ్రీ.

నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.

అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.

భార్య - కళావతి.

సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .

కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక

మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ

రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,

'పినాకిని కథలు' కథల సంపుటి.

రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.

సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.

పెన్నోత్సవం 2004.

జార్జి క్లబ్ వారు,

ప్రొద్దుటూరు నాటక పరిషత్.

యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.

స్నేహం సేవా సమితి.

కళా స్రవంతి.

తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.

NTR అభిమాన సంఘం.

తెలుగు రక్షణ వేదిక 

వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.

గోదావరి పుష్కర పురస్కారం.

కృష్ణా పుష్కర పురస్కారం.

స్వామి క్రియేషన్స్.

కృష్ణదేవరాయ సాహితీ సమితి.

భానుమతి స్వరం మీడియా.

కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page