top of page

స్వచ్ఛతకు మూలం శ్రమదానం

#SwachhathakuMulamSramadanam, #స్వచ్ఛతకుమూలంశ్రమదానం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguHeartTouchingStories

ree

Swachhathaku Mulam Sramadanam - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 25/07/2025

స్వచ్ఛతకు మూలం శ్రమదానంతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


అది చిన్న గ్రామం....


చుట్టూ పైరు పొలాలు, పండ్ల తోటలు.... స్వఛ్ఛమైన ప్రాణవాయువుకు అది నిలయం.... స్వఛ్ఛత... కనులకు కనుపించాలంటే శ్రమదానం అతిముఖ్యం....


రంగడు తల్లి తండ్రి లేని అనాథ. ఆ గ్రామవాసి. వయస్సు పదిహేను సంవత్సరాలు. అతనికి వున్నది నాయనమ్మ ఒక్కతే.... అతనికి పంచ ప్రాణాలు ఆ నాయనమ్మ. ఆమె పేరు జానకమ్మ. జానకమ్మ సర్వస్వం తన మనుమడు రంగడే. కులంవారు రంగడిని ఎంతో ప్రీతిగా అభిమానిస్తారు. కారణం, వారు కాలితో చెప్పిన పనిని వీడు తలతో చేస్తాడు. వాడు చేసిన పనిని అనుసరించి రంగడికి వారు కానుక (డబ్బు) ఇస్తారు. ఆ డబ్బును రంగడు పదిలంగా తెచ్చి నాయనమ్మ జానకమ్మ చేతికి ఇస్తాడు.


"ఒరే రంగా!.... ఈ అడ్డ తిరుగుళ్ళు మాని స్కూలుకు వెళ్ళి చదువుకోరా!... నీ తోటివారు ఎంత బాగా చదువుకొంటునారో చూడు!.... నా మాట వినరా!..." ప్రాధేయపూర్వకంగా చెప్పింది జానకమ్మ.


"నానమ్మా!... నేను చదువుకొని ఏం కలెక్టర్ అవ్వాలా!... నాకు ఆ ఆశలేదు. నిన్ను జాగ్రత్తగా చూచుకోవడం అన్నదే నా ఆశ. నీకూ రోజు రోజుకి వయస్సు పెరుగుతూ వుంది కదే!..." అనునయంగా చెప్పాడు రంగడు.


"నీ మాట నీదేకాని, నా మాటను వినవా!..." విచారంగా అంది రంగమ్మ.


"వి...న...ను" నవ్వుతూ చెప్పాడు రంగడు.


"మరోమాట వూర్లో వుండే నలభై ఇళ్ళ వారిలో పాతికమంది వ్యవసాయం చేసేవారే. వారిలో నేను ఒకణ్ణి. రైతన్నలు నాగలితో మన నల్ల రేగడి భూమిని దున్ని పైరు నాటి, పంటను (ధాన్యాన్ని) పండించకపోతే మనకు, పట్నాల్లో వుండేవారికి బువ్వ (అన్నం) ఎట్టా వస్తాదే!... సెప్పు. ఆ పైరు మీద నుంచి వూళ్లోకి వచ్చే ఆ పైరుగాలి, మనందరికీ ఎంతో మంచిదే. ఆ గాల్లో పరిసుధమైన ప్రాణవాయువుందే. మన ఎదురింటి మాస్టారుగారు సెబుతుంటే ఇన్నా!.... నానీ!... ఓ నానీ!... మన సర్‍పంచి ఊర్లోని, వీధుల్లో, సుట్టూ సీమెంటు రోడ్డు వేయించినాడు కదా!...."


"అవునురా!..."


"ఆ సీమెంటు రోడ్డు ఏసేదాని కోసం ఆ మహామనిసి ఎన్ని చెట్లను నేల కూల్చినాడో నీకు తెలుసా!... నేను లెక్కపెట్టినా, 260... అన్ని చెట్లూ ఆయన దొడ్లో వంట చెరకుగా ఎండిపోతుండాయి. అదేందయ్యా చెట్లను చంపుతుండావని ఆయన్ని అడిగేవాడెవడు?... ఎవ్వరూ అడగలేదు. కారణం ఆయన పేరున్న పెద్దమనిషి, కానీ నానమ్మే!... నేను ఆయన్ని అడగతా!...."


"ఏమనిరా!..."


"అన్ని చెట్లను చంపినావే అది పాపం కాదా!... వూరినిండా వుండే పరిసుద్ధమైన గాలిని పాడు చేసినావు కదా అని...."


"ఒరేయ్!... నీకెందుకురా!...."


"ఆ.... నాకెందుకా!... నానీ, నేనూ ఈ వూరి వాణ్ణే. నాకు నా వూరు బాగుండాలి. నా వూరి జనం అంతా బాగుండాలి. అది జరగాలంటే కొట్టేసినచెట్లకు బదులుగా చెట్ల మొక్కలు నాటాలి. వాటిని పెంచాలి. ఆ పనిని నేను ఆ పెద్దయ్యతో మాటాడి నేను సేయబోతుండా!..." ఇంట్లోనించి వేగంగా వెళ్ళిపోయాడు రంగడు.


"ఏరా రంగా!.... ఇట్టా వచ్చినావ్?"


"అన్నా మీతో మాట్లాడాలి!..."


"విషయం ఏందిరా!..."


"రెండువందల అరవై చెట్లు చచ్చిపోయాయన్నా. మూడొందల చెట్లు నాటాలన్నా!... నేను నాటుతా, మీరు సాయం చెయ్యాలన్నా!" దీనంగా పలికాడు రంగడు.


ఆ పెద్దయ్య రంగడి ముఖంలోకి పరీక్షగా చూచాడు. ‘అవును 260 చెట్లను నేను నేలకూల్చాను. వీధికి రెండు వైపులా వున్న చెట్లు కారణంగా టన్నెల్‍లో (సొరంగం) పోతున్నట్లు అనిపించే ఆ వాతావరణం మారి వీధుల్లో ఎడారిలో నడిచినట్లుంది. రంగడి ఆలోచన మంచిది. వెంటనే వీధుల్లో రెండు వైపులా చెట్ల మొక్కలను నాటించాలి’ అనుకొన్నాడు పెద్దయ్య.


"రంగా!... నీ ఆలోచన నాకు సమ్మతం. డబ్బు ఎంత కావాలి?"


"అన్నా!... మీకు తెలవదా!..." దీనంగా చెప్పాడు.


"ఒక్క మొక్క పాతిక రూపాయలనుకో, 300 మొక్కలు 7500/- వుండు వస్తా!...." ఇంట్లోకి వెళ్ళి పదినిముషాల్లో వచ్చి రంగడి చేతిలో పదివేలు పెట్టాడు నవ్వుతూ....


"మన ట్రాక్టర్ తీసుకెళ్ళి రాజమండ్రి నుండి మొక్కలను తీసుకురా!... అందరం కలిసి మన గ్రామ స్వఛ్ఛతకు శ్రమదానంతో మొక్కలను నాటుదాం" నవ్వుతూ చెప్పాడు పెద్దయ్య.


రంగడు ఆశ్చర్యపోయాడు, తన మాటను వారు అంతగా గౌరవించినందుకు....


సంతోషంతో పారవశ్యంతో పెద్దయ్యకు చేతులు జోడించి నమస్కరించాడు రంగడు. ప్రతి గ్రామ నగర పెద్దలు యువత, అలాంటి భావాలు కలిగి వుండే అందరూ ఆనందం ఆరోగ్యంతో వర్థిల్లుతారు.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Commentaires


bottom of page