top of page
Original.png

తల్లిమనసు


తన పిల్లలను పసికూనలుగానే చూసే తల్లి జింకను చూపించే తల్లిమనసు తెలుగు నీతి కథ దృశ్యం

Thalli Manasu - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

తల్లిమనసు - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 31/08/2026


తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. పిల్లలు ఎంత పెద్దవారైనా, తల్లి కళ్లకు వారు ఎప్పటికీ పసికూనలుగానే కనిపిస్తారు. ఈ అద్భుతమైన సత్యాన్ని ఎంతో సరళంగా, హృదయాన్ని తాకేలా చెప్పే తెలుగు నీతి కథే “తల్లిమనసు”.


“ఏ తల్లికైనా తన పిల్లలు ఎంత పెద్దవారైనా పసికూనలలాగే కనిపిస్తారు.”

ఈ ఒక్క మాటలోనే ఈ కథ యొక్క అసలు నీతి దాగి ఉంది.


ఒకసారి అడవిలో ఉన్న పులికి జ్వరం వచ్చింది. చాలా రోజుల వరకు తగ్గలేదు. పులి నీరసంగా తయారైంది. అప్పుడు ఒక జింక పులిమీద జాలిపడి సపర్యలు చేసింది. జ్వరం తగ్గినంతవరకు పులిని కంటికి రెప్పలా కాపాడింది. జింక చేసిన సేవతో పులి కోలుకుంది. పూర్తిగా ఆరోగ్యం నయమైన తరువాత పులి జింకతో అన్నది—"నాకెంతో సహాయం చేశావు. ఈ రోజు నుంచి నువ్వు నేను మిత్రులం. నీకు ఏం కావాలో కోరుకో, ప్రత్యుపకారం చేస్తాను" అన్నది . ఆ మాటలకు సంబరపడిపోయిన జింక—"పులి రాజా! నా పిల్లలు చిన్నవి, పసికూనలు. వాటిని వేటాడనని మాటివ్వు" అన్నది. అలాగేనని మాటిచ్చింది పులి.


ఒక రోజు వేటనుంచి వస్తున్న పులిని చూసి జింక గుండెలు బాదుకుంటూ ఇలా అంది—"ఎంత పని చేశావు పులిరాజా! నా పిల్లలను చంపావు."


"లేదు లేదు, నేను ఈ రోజు వేటాడిన జంతువులలో ఒక్కటి కూడా చిన్నది లేదు, అన్నీ పెద్ద జంతువులే" అన్నది పులి.


"ఓ పులి రాజా! ఇంతేనా నీకు తెలిసింది? తల్లిమనసు కనలేకపోయావు. ఏ తల్లికైనా తన పిల్లలు ఎంత పెద్దవారైనా పసికూనలలాగే కనిపిస్తాయి. ఈ విషయం (తల్లిమనసు) అర్థం చేసుకోలేని నీలాంటి కసాయితో నాకు స్నేహం వద్దు" అన్నది జింక.


*** 

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.


మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page