top of page
Original.png

స్ఫూర్తినింపు


కాళ్లు కోల్పోయిన మాజీ సైనికుడు బోస్ తన కుమారుడు తిలక్‌లో దేశభక్తి నింపుతున్న హృదయస్పర్శి దృశ్యం

Spurtinimpu - Telugu Patriotic Story | Bhanupriya

స్ఫూర్తినింపు - తెలుగు దేశభక్తి కథ | భానుప్రియ

Published In manatelugukathalu.com On 30/08/2026


దేశం కోసం ప్రాణాలను, అవయవాలను త్యాగం చేసే సైనికుల కుటుంబాలు అనుభవించే బాధను మనం ఎప్పుడూ పూర్తిగా అర్థం చేసుకోలేం. “స్ఫూర్తినింపు” అలాంటి ఒక సైనిక కుటుంబం త్యాగాన్ని, తండ్రి–కొడుకు మధ్య ఉన్న అనుబంధాన్ని, దేశభక్తి తరతరాలకు ఎలా అందుతుందో హృదయాన్ని తాకేలా చెప్పే స్ఫూర్తిదాయక తెలుగు కథ.



మది మోయలేని భారాన్ని మోస్తూ, ఆవేదనతో తనువెల్ల గాయాలతో వీల్‌చైర్‌లో బోస్‌ రావటాన్ని చూసి కుటుంబం మొత్తం ఆ హఠాత్పరిణామాన్ని నమ్మలేకపోతుంది.

వారు తేరుకొని రెండు కాళ్లు పోగొట్టుకున్న బోస్‌ను పట్టుకొని రోజు మొత్తం కన్నీటిపర్యంతమవుతారు. మరుసటి రోజు బోస్‌ తన రెండు కాళ్లను చూసుకొని, కార్గిల్‌ బార్డర్‌లో గత నెలలో జరిగిన యుద్ధ తాలూకా మిగిల్చిన విషాదం తన రెండు కాళ్లు పోవడమే అని తన గుండె లోపల అదిమి పెట్టుకున్న దుఃఖాన్ని తన కుటుంబాన్ని చూసేసరికి కన్నీరు రూపంలో బయట పెడతాడు.


కొద్ది రోజుల పాటు బోస్‌ కుటుంబం ఆ విషాద సంఘటన నుంచి తేరుకోలేకపోతుంది.

బోస్‌ తనకు తానుగా ఏ పని చేసుకోలేక, "నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు నాకు ఎన్ని రోజులు ఇలా సపర్యలు చేయాలి? నేను వారికి భారం కాకూడదు. ఇక నేను అటు దేశ సేవకు ఇటు నా వాళ్లకు ఏ విధంగా కూడా ఉపయోగపడని నిర్వేదంతో, తప్పని తెలిసినా తనని తాను సముదాయించుకోవడం చేతకాక తన తనువు చాలించాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకుంటాడు."

మర్నాడు ఉదయం...


"తిలక్‌! ఏంటిరా నువ్వు చేసేది? అది మన జాతీయ జెండా రా! దాన్ని నువ్వు అలా గుంత తీసి ఎందుకు పాతిపెడుతున్నావు?" అని తిలక్‌ స్నేహితుడు రాము అడుగుతుండగా, తిలక్‌ ఒక్కసారిగా తనలో ఉన్న దుఃఖాన్ని అంతా గట్టిగా ఏడ్చి, "ఎందుకురా ఈ జాతీయ జెండా అంటే అంత ప్రేమ? నిన్నటి వరకు నాకు కూడా ఈ జెండా పైన, దేశం పైన ఎనలేని ప్రేమ ఉండేది. కానీ దేశం కోసం మా నాన్నగారి రెండు కాళ్లు పోయి, మా కుటుంబం ఎన్నో బాధలను అనుభవిస్తున్నా ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మరి నేనెందుకు నా దేశం గురించి, జెండా గురించి బాధపడాలి?" అని నాలుగవ తరగతి చదువుతున్న తన కొడుకు తిలక్‌ మాటలను కిటికీలోనుంచి విన్న బోస్‌కి ఒక్కసారిగా తిలక్‌పై ఎనలేని కోపం వస్తుంది.


రెండు నిమిషాల పాటు బోస్‌ అలాగే నిశ్శబ్దంగా ఉండి, 'నా రెండు కాళ్లు దేశం కొరకు పోయినందుకే నా కొడుకు దేశాన్ని ఇంతలా ద్వేషిస్తున్నాడు. ఇక నేను చనిపోతే వాడు దేశద్రోహిగా మిగిలిపోతాను. వాడికి ఎలాగైనా నా నాన్నగారు పంచిన దేశభక్తి భావాన్ని, దేశ ప్రేమను అందించాలి' అని మనసులో అనుకుంటాడు.


"బాబు తిలక్‌! ఇలా రా" అని భుజం మీద చేయి వేసి తన దగ్గర కూర్చోబెట్టుకొని, "ఇలా చూడు తిలక్‌, ఈ పుస్తకంలో ఉన్న వాళ్లందరూ మన స్వాతంత్ర్య సమరయోధులు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వారి నెత్తురును దారపోసి, బ్రిటిష్ వారి కొరడా దెబ్బలు అనుక్షణం చిత్రవధ చేస్తున్నా మన భారత జాతి జెండా రెపరెపల కోసం ఆనందంగా వాళ్ళ ప్రాణాలను సైతం దేశానికై అంకితమిచ్చారు. మీ తాతయ్య, అదే మా నాన్న ఒంటి పైన కూడా స్వాతంత్ర్యపు లాఠీ దెబ్బలు ఇప్పటికీ గుర్తులుగా చాలా ఉన్నాయి.


ఎంతటి బాధను అనుభవించినా తాతయ్య నిరుత్సహపడకుండా, 'దేశం నాకేమిచ్చిందని కాకుండా నన్ను జవాన్‌ని చేసి దేశానికి సేవకుడిగా చేసి ఈ భరతభూమి రుణం తీర్చుకోవాలి' అని చాలా కష్టపడ్డాడు. ఇప్పటికీ దేశం కోసం తన ప్రాణాలను అర్పించడానికి తాతయ్య సిద్ధంగా ఉన్నాడు. నా రెండు కాళ్లు దేశ సేవకై అర్పించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటికీ కూడా నేను ఆర్మీలో పని చేయడానికి నా దేహంలో ఊపిరి ఉన్నంతవరకు, చివరి రక్తపు బొట్టు వరకు దేశానికే అంకితం అవ్వాలని ఆశగా ఉంది" అని తన తండ్రి చెబుతూ ఉంటే, ఒక్కసారిగా తిలక్‌ తన తండ్రిని హత్తుకొని,

"నన్ను క్షమించండి నాన్న! మీకు కాళ్లు పోయాయనే బాధతో నేను మన జాతీయ జెండాను పాతిపెట్టాలని చూశాను. ఇప్పుడు చెప్తున్నాను నాన్న, నేను సైనికుడిని అవుతాను. దేశానికై, దేశ ప్రతిష్టకై నా పోరాటాన్ని సాగిస్తాను" అని అణువణువునా దేశభక్తిని నింపుకొన్న భరతమాత ముద్దుబిడ్డలాగా "జై హింద్" అని తన రెండు కాళ్లను గట్టిగా కొట్టి తన తండ్రికి సెల్యూట్ చేస్తాడు.


జై హింద్

***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



భానుప్రియ గారి కొన్ని ఇతర రచనలు:


భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 

భానుప్రియ

రచయిత్రి పరిచయం:

నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page