top of page
Original.png

బామ్మా.. మజాకా..?

బామ్మా మజాకా కథ, తెలుగు హాస్య కథ, బామ్మ మనవడు కథ, Telugu comedy story, Telugu family story, Bhanupriya stories, Telugu short stories, funny grandmother story, family comedy Telugu, Telugu literature, తెలుగు కథలు, హాస్య కథలు, కుటుంబ కథలు, తెలుగు చిన్న కథలు, బామ్మ కథ, మనవడి కథ

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ బామ్మా.. మజాకా..? కథలో బామ్మ టీవీ చూస్తుండగా ఆమె చెవుడు వల్ల ఇబ్బందిపడుతున్న మనవడితో జరిగిన సరదా సంభాషణను చూపించే హాస్యభరిత కుటుంబ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ బామ్మా.. మజాకా..? కథలో బామ్మ టీవీ చూస్తుండగా ఆమె చెవుడు వల్ల ఇబ్బందిపడుతున్న మనవడితో జరిగిన సరదా సంభాషణను చూపించే హాస్యభరిత కుటుంబ దృశ్యం.

Bamma Majaka - Telugu Comedy Story | Bhanupriya

బామ్మా.. మజాకా..? - తెలుగు హాస్య కథ | భానుప్రియ

Published In manatelugukathalu.com On 16/06/2026


కుటుంబంలో బామ్మలు, తాతయ్యలు ఉండటం ఎంత ఆనందమో, వాళ్లతో జరిగే సరదా సంఘటనలు అంతకంటే మధురం. "బామ్మా.. మజాకా..?" కథలో చెవుడు ఉన్న బామ్మ సుందరి, ఆమె మనవడు రమేష్ మధ్య జరిగే హాస్యభరిత సంభాషణలు పాఠకులను కడుపుబ్బా నవ్విస్తాయి. చిన్న చిన్న అపార్థాలు ఎలా పెద్ద గందరగోళాలకు దారి తీస్తాయో రచయిత్రి భానుప్రియ ఎంతో చమత్కారంగా చిత్రించారు. కుటుంబ బంధాలు, ప్రేమ, అల్లరి, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రతి పాఠకుడిని అలరిస్తుంది.


“సుందరి... సుందరి... ఏం చేస్తున్నావ్? అబ్బో టీవీ చూస్తున్నావా!

అందులో నీకేదో అర్థమైనట్టుగా ఆ నవ్వు ఎందుకే?

అక్కడ సీరియస్‌గా విలన్ ఏదో కుట్ర పన్నుతుంటే నువ్వేమో తెగ నవ్వుతున్నావు. ఓహో తెలిసిందిలే. పక్కింటి పంకజం, ఎదురింటి ఎంకమ్మ, గంగాలమ్మ, కాంతమ్మ - ఈ మీ దోస్తులంతా నిన్నే చూస్తున్నారని, నీ సంగతి వారికి తెలియద్దని తెగ ప్రయత్నం చేస్తున్నావ్ గా!

అవునా సుందరి, ఓహో నా సుందరి" అని మనవడు రమేష్ నాయనమ్మను ఆటపట్టిస్తుండగా…


"పోరా! ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను ఒక మిషన్ కొని నా చెవిలో పెట్టమని. వాళ్ళందరికీ తెలియదు నాకు చెవుడని, వాళ్లు మాట్లాడుతుంటే కళ్ళతో విని నేను సమాధానం చెప్తూ చస్తున్నాను."


"హమ్మ ఎంత మోసం చేస్తున్నావే! ముసలిదానా.. అయినా నేను ఒక మిషన్ తెచ్చి నీ చెవిలో పెట్టానుగా, అదేమో అందరికీ కనిపిస్తుందని, లేటెస్ట్‌గా వచ్చిన చెవిలో చిన్నగా పట్టేటటువంటి మిషన్లు అని అవి మూలకు పెట్టేసావు. ఇంత ముసలితనం వచ్చినా నీకెందుకే ఈ సోకులు నాయనమ్మ."


"ఏమంత వయసయ్యింది రా నాకు. నేను ఇంకా బాగానే ఉన్నాను." అని మనవడిపై రుసరుసలాడుతూ బుంగమూతి పెట్టుకుంది.


"అబ్బో నోటిలో పండ్లే లేవు కానీ మళ్ళీ బుంగమూతి ఒకటి ఆ ముఖానికి" అని రమేష్ తన నాయనమ్మను ఆటపట్టిస్తుంటాడు.


"సరే కానీ అన్నం పెట్టవే ఆకలేస్తుంది." అని రమేష్ అనగా "ఏంటి దండం పెట్టాలా! ఎవరికి రా! దండం పెట్టేది!" 


"దండం కాదే అన్నం పెట్టు."


"ఏంటి? పిండం పెట్టాలా? ఎవరికి పెట్టాలా పిండం? ఎవరు పోయారు రా...." అని తనకు కొంచెం అర్థం అయినా, నన్ను ఆట పట్టిస్తావా వెదవ అని మనసులో అనుకుంటుంది బామ్మ.


"ఓరి నాయనమ్మ ఏమీ లేదు. ఆ అన్నం ఏదో నేనే పెట్టుకుంటాను. నువ్వు అలాగే కూర్చొని ఉండు" అంటూ తల నెత్తికి బాదుకుంటూ,

"ఏం కూర చేసావే నాయనమ్మ!

వామ్మో! ఏంటే ఈ కాకరకాయ కూర? కమ్మనైన కూర చేయమని ఉదయము నీకు చెప్పిపోతే!"


"ఏమోరా మనవడా! నాకు కాకరకాయ కూర వండిపెట్టు అని వినిపించింది. అందుకే చేశా, ఒక పట్టు పట్టరా!

కాకరకాయ బలమని చేదు తీయకుండా చేశా." అని నవ్వుతూ కాకరకాయ కూరను నోట్లో పెట్టుకుంటుంది.


"వామ్మో నీ చెవుడితో నన్ను చంపేస్తున్నావే. తాతయ్యను పైకి పంపించేశావు. ఇక నన్ను కూడా పంపిస్తావా ఏంటి?"


"అంత తొందరెందుకు రా! నీకు ఇంకా చూసేవి చాలా ఉన్నాయి." అని బామ్మ అనగానే ఇంకా ఎన్ని దెబ్బలు చూడాలో నేను అని తలబాదుకుంటూ…


మర్నాడు ఉదయం "ఈరోజు మన ఇంటికి ఇద్దరు ఆఫీసర్స్ వస్తారే నాయనమ్మ" అని చెప్పగా "హ ఎవరురా అడుక్కునే వాళ్ళా!"


"కాదే! నీ చెవుడితో నన్ను చంపేస్తున్నావు. అడుక్కునే వాళ్ళు కాదే ఆఫీసర్స్, ఆఫీసర్స్" అని గట్టిగా అరుస్తూ చెప్తాడు రమేష్.


"ఒకరు నా ఉద్యోగ ప్రమోషన్ కోసం, ఇంకొకరు నా లోన్ కోసం. నేను కొన్ని విషయాలు చెబుతాను. మర్చిపోకుండా గుర్తుపెట్టుకో" అని గట్టిగా అరుస్తూ "లోన్ కోసం వచ్చే వ్యక్తి కోసం, ప్రమోషన్ కోసం వచ్చే వ్యక్తి కోసం" అని చెప్పవలసిన విషయాలను చెప్పి,

"అనుకోకుండా నేను తప్పనిసరిగా బయటికి వెళ్తున్నాను." తొందరగా వస్తానని బామ్మకు చెప్పి భయం భయంగా బయలుదేరుతాడు రమేష్.


అనుకోని అంతరాయాల వల్ల బయటనే చిక్కుకున్న రమేష్‌కు ఆఫీసర్ ఫోన్ చేయగా, లబోదిబోమంటూ ఇంటికి చేరుకొని తలబాదుకుంటూ

"బామ్మ.. బామ్మ.. అని గట్టిగా అరుస్తూ నా జీవితాన్ని నాశనం చేసావే బామ్మ!

ఒక ఆఫీసర్‌కు చెప్పే సమాధానాలు, ఇంకో ఆఫీసర్‌కు చెప్పి ఇటు నా బంగారం లాంటి ఉద్యోగము,

ఇటు లోన్ రెండు పోయాయి నీ చెవుడు వల్ల" అని ఏడుస్తూ తలబాదుకుంటుండగా

"ఎవరు పోయారు రా అలా ఏడుస్తున్నావు? సీరియల్లో డాక్టర్ బాబు మళ్లీ దీపను అవమానించాడని నేను బాధపడుతుంటే, నువ్వేంటి రా అలా ఏడుస్తున్నావు!"


"వామ్మో! నీ చెవుడితో నా జీవితాన్ని నాశనం చేసావు కదనే! మళ్ళీ సీరియల్ గురించి ఏడుస్తున్నావా!" అంటూ తలబాదుకుంటూ ‘నీకు దండమే సుందరి’ అంటూ లబోదిబోమంటాడు.


***

భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/priyanka

నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page