top of page

తేలికైన విద్యా విధానం

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #TelikainaVidyaVidhanam, #తేలికైనవిద్యావిధానం, #TeluguChildrenArticles, #TeluguArticleOnGeneralKnowledge

తేలికైన - సమర్థవంతమైన - ప్రయోజనకరమైన - విద్యా విధానం  (25 సూచనలు - అభిప్రాయాలు - ఉపాయాలు - పరిష్కారాలు)


Telikaina Vidya Vidhanam - New Telugu Article Written By P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 30/04/2025

తేలికైన విద్యా విధానం - తెలుగు వ్యాసం

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


పరిచయం:


విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం:


i) జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం మరియు నిపుణ పంచటం - పెంచటం. 

ii) మనిషిలో దాగి ఉన్న శక్తి యుక్తులు వెలికి బయిటికి తీయటం. 

iii) వ్యక్తికి ఉపాధి కల్పించడానికి సహాయపడే జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తుంది

Iv) ఒక నిర్దిష్ట పద్దతి ప్రకారం ఏర్పాటు చేయబడిన / క్రమశిక్షణ గల, ప్రణాళికా బద్దమైన తీరులో. పాఠ్యాంశాలను అనుసరించి - బోధించి... సహజ (రీతి) పరీక్షలు పెట్టి... ఉత్తీర్ణులైన వారికి... గుర్తింపు పొందిన అకడమిక్ సర్టిఫికేట్లు / డిగ్రీలు / సత్ఫలితాలు / అభివృద్ధి / సృజనాత్మక ఆలోచనా తీరు ఇవ్వటం. 


------- విద్య తేలికగా... 25 సూచనలు - అభిప్రాయాలు - పరిష్కారాలు - ఉపాయాలు -----------


1)

పాఠ్య పుస్తకాల్లో... ఆబ్జెక్టివ్ ల రూపంలో - నమూనా లో... ఎక్కువ ప్రశ్నలు ఇవ్వటం (జవాబులు కింద ఇవ్వాలి... వెంటనే పక్కన ఇవ్వ కూడదు) 

అవి ఎవనాగా?... 

 (I) ఖాళీలను నింపండి ii) మ్యాచింగ్ - కలపటం సరి అయిన జవాబు తో iii) బహుళ ఎంపిక iv) చిన్న ప్రశ్నలు - జవాబులు v) ఖాళీల లో మొదటి అక్షరం మాత్రం ఇవ్వటం vi) క్లూ (సంకేతం) పదం ఇవ్వటం ఇతరత్రా 

-------------------------------------------------------

2)

పాఠ్య పుస్తకాల్లో ఎక్కువగా బొమ్మలు ఇవ్వటం... ఎక్కడ వీలు ఉంటే... (తేలికైన బోధనకు... విద్యార్థులకు / పిల్లలకు తేలికగా అర్థం అవుతుంది)

-----------------------------------------------------

3)

బోధన పద్ధతి:-

 ప్రొజెక్టర్ + సమాచారం తో తయారుగా ఉన్న స్లైడ్స్ ద్వారా అయితే మరీ మంచిది... 

I) టీచర్ లకు / ఉపాధ్యాయులకు బోర్డ్ మీద వ్రాసే సమయం అదా అవుతుంది 

Ii) ఎక్కువ సమయం బోధనకు, సందేహాల స్పష్టీకరణ / నివృత్తి కి కేటాయించ వచ్చు టీచర్లు. 

iii) స్క్రీన్ / తెర ను కాస్త యెత్తు గా పెడితే... విద్యార్థులందరికీ... (వెనక బెంచీ వాళ్లకు కూడా)... సృష్ఠంగా కనిపిస్తుంది.... (ముందు బెంచీల పిల్లల తలలు అడ్డు వచ్చే సమస్య ఉండదు)

-------------------------------------------------

4) 

తరగతి గది లో... పిల్లలు పాఠ్య పుస్తకాల్లో... అండర్లైన్ (underline) చేస్తే చాలు... (టీచర్ బోధిస్తున్న వాక్యాల - పదాల కింద గీత గీస్తే చాలు)... (చేతితో పెన్ / కలం తో... నోట్ పుస్తకం లో వ్రాయటం అవసరం లేదు). 

లాభం ఏమిటి?

బోధన అంశం - తాత్పర్యం అర్థం చేసుకోటానికి ఎక్కువ సమయం ఉంటుంది - ఆస్కారం ఉంటుంది పిల్లలకు. 

వ్రాసే అభ్యాసం / సాధన / అలవాటు / అనుసరణ... హోం వర్క్ చేయటంలో ఎలాగు వస్తుంది కదా! (పిల్లలకు). విషయం పునరావృత్తి (revision of subject) కూడా అవుతుంది (హోం వర్క్ చేసే ద్వారా)

-------------------------------------------

5) ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆన్లైన్ అనిమేషన్ (online animation) తో... (కంప్యూటర్ - మార్జాలాం లో కదిలే బొమ్మలతో)... బోధన చేయాలి. అప్పుడు అందరకీ చాలా తేలికగా అర్థమవుతుంది. 

-------------------------------------------

6) కళాశాల లేక పాఠశాల అయినా సరే... 

సిలబస్ మరీ ఎక్కువ ఉండకూడదు... సిలబస్ ను 30 నుండి 40 శాతం (30-40%) తగ్గిస్తే / కుదిస్తే... [కనీసం విజ్ఞాన శాస్త్రం కోవలో రాని విషయాలు:- తెలుగు, హిందీ, ఇంగ్లీష్ (ఆంగ్లం), సాంఘీక శాస్త్రం భాష ల అధ్యాయాలు 30-40% కుదిస్తే]... అప్పుడు రోజూ క్రీడలకు, అభిరుచుల తరగతులకు... రోజూ సమయ పట్టిక లో (రోజూ వాడి టైం టేబుల్ లో / రోజూ కరిక్యులమ్ లో ) చోటు దక్కుతుంది. 

*రోజూ క్రీడల - అభిరుచుల తరగతుల వల్ల... పిల్లలకు ఉల్లాసం, ఉత్సాహం, మానస వికాసం, మానసిక సంతోషం, వ్యాయామం, మంచి ఆరోగ్యం... చేకూరుతుంది. 


*జట్టు తీరు గా సాగటం - "అందరికీ ప్రగతి - అభ్యుదయం - సౌభాగ్యం అనే ఆలోచనా తీరు", నాయకత్వ లక్షణాలు కూడా అలవడుతుంది (చిన్నపటి నుండే... అందరూ పిల్లలకు). 

*సిలబస్ తగ్గిస్తే... హోం వర్క్, ప్రాజెక్ట్ వర్క్ సైజ్... కూడా ఎలాగూ తగ్గుతుంది. 

*చరవాణి, వీడియో గేమ్స్ కాకుండా... బయిట వాతావరణంలో ఆటలు - పాటలు ఉంటే... పిల్లలకు, వ్యక్తులకు ఆరోగ్యకరం. 


*చిన్న ప్రాజెక్ట్ లు విద్యా కేంద్రం లోనే... ఇద్దరు - ముగ్గురు జట్టుగా... చేసేటట్టు ఇవ్వాలి... అదీ టీచర్ మార్గదర్శకత్వం లో - ఉపదేశం లో. 


* విద్యార్థుల ఇంటి సభ్యుల పై / తల్లి దండ్రుల మీద... విద్యా కేంద్రపు బరువు బాధ్యతలు వేయ వద్దు - రుద్ద కూడదు. విద్యా కేంద్రం ఒక స్నేహపూరిత బృందం గా... సంతోష పూరిత - నిర్మాణాత్మక త - ఉత్పాదక నిర్వహణ మరియు ఆనంద దాయక పరిష్కారాల తీరు అవలంభించాలి. 


* ఒకరి మీద ఇంకొకరిని ఆడటం, బలి పశువు చేయటం, తప్పులు లెక్క పెట్టడం, హాని చేయటం, ఒకరి కోసం - ఇంకొకరిని తోసేయటం... లాంటి భూత సర్ప పైశాచిక తత్వం - నివృత్తి ఉండరాదు. (ఏ వ్యవస్థ లేక ఏదైనా కార్యాలయం లో - విద్యా సంస్థ లో నైనా సరే... ఉండకూడదు). 

మరి ఎలా?


ఒక స్నేహపూరిత జట్టు రీతి తో మెలగాలి. 


* ఇప్పుడు పాఠశాలలో ఇస్తున్న ప్రాజెక్ట్ లు.... ప్రతి సబ్జెక్ట్ / విషయం లో.... చాలా పెద్దవిగా ఉన్నాయి. గూగుల్ నుండి కాపీ - పేస్ట్ తోనే సరిపోతుంది. 50-80 పేజీ ల ప్రాజెక్టులు. ఇంటి సభ్యుల పై భారం వేస్తున్నారు. ఇంటిల్లి పాది టెన్షన్, బి. పి, వంటి - ఒళ్ళు నొప్పి, డబ్బు ఖర్చు, సమయం వృధా తప్ప... ఇలాంటి ప్రాజెక్టుల తో ఒరిగేది ఏమీ లేదు... పిల్లలకు - పెద్దలకు.... (జ్ఞానం - విజ్ఞానం రూపం లో ఏమీ రాదు). టీచర్లు కూడా ఆ ప్రాజెక్టులను సరిగ్గా దిద్దరు - చూడరు. 

... 

150 - 200 పెద్ద ప్రాజెక్టులు ఎలా చూడగలరు... అదీ కొద్ది సమయంలో?... ప్రాజెక్ట్ సైజ్ ను బట్టి మార్కులు వేయ వలసి వస్తుంది. 

పరిష్కారం ఏమిటి???


చిన్న హోం వర్క్ లు, ప్రాజెక్ట్ లు మేలు... అదీ విద్యా కేంద్రం లో... 3 - 4 పిల్లలు జట్టుగా చేయటం... అదీ టీచర్ పర్యవేక్షణ లో - మార్గదర్శకత్వం లో - ఉపదేశం లో. 

-------------------------------------------

7) 

పరీక్షల ప్రశ్న పత్రాలు... క్లాస్/ తరగతి లో జరిగిన సిలబస్ ను అనుకరించి ఉండాలి. (ఏదేదో ప్రశ్నలు ఇవ్వరాదు... సిలబస్ లో లేనివి). 

పరీక్ష వేరు... పరిశోధన - ప్రాజెక్ట్ వేరు. 


అయినా కూడా... ఎన్ని పరిశోధన - ప్రాజెక్ట్ లు... కొత్త విషయాలు కనుక్కుంటున్నాయి? సమాజానికి ఉపయోం?... చాలా తక్కువ. 

----------------------------------------

8)

అన్ని రకాల పరీక్షలకు... పునరావృత్తం (రివిజన్)... టీచర్లు... బోర్డ్ మీద చాక్ -. పీస్ (సుద్ద ముక్క) తో వ్రాసి... లేదా స్లైడ్స్ - ప్రొజెక్టర్ లో చూపించి... క్రమ పద్దతి లో - సమయ పట్టిక తయారు చేసి... సిలబస్ పూర్తి చేయాలి. అప్పుడు మొత్తం సిలబస్ కవర్ - పూర్తి చేయ వచ్చు. 

*పూర్వ (క్రితం సంవత్సర) ఫైనల్ పరీక్ష పత్రాలు (కనీసం 2 -3, ప్రతి విషయం లో)... ప్రశ్న - జవాబు పద్ధతి లో (సైంటిఫిక్ పద్ధతి లో)... టీచర్ లు బోధన చేయ వచ్చు తరగతి గది లోనే. 

*రోజూ... ఒక పీరియడ్ (40-50 నిముషాలు), ఒక సబ్జెక్టు / ఒక విషయం పై కొన్ని ప్రశ్నలు - జవాబులు... చర్చ లాగా. 


*అప్పుడు అన్ని అధ్యాయాలు, అన్ని విషయాల్లో చదివి - పూర్తి చేసిన సంతృప్తి భావన వస్తుంది పిల్లలకు. 


*సమయం సరిపోలేదు కాబట్టి ప్రత్యేకంగా వెనకటి అధ్యాయాలు వదిలేసాను... పునరావృత్తం లేకుండా... అనే సమస్య రాదు. 


*ఆఖరి ఫైనల్ పరీక్షలకు తయారీ ఇంట్లో చేసుకోండి... అంటూ సెలవులు ఇవ్వకూడదు పిల్లలకు... పిల్లలకు వదిలేయ కూడదు. 


ఎందుకు?

*పరీక్ష తయారీ ఎలా - ఎక్కడ మొదలు పెట్టాలి? తక్కువ సమయం లో ఎలా సిలబస్ పూర్తి చేయాలి... అదీ... 7 -8 సబ్జెక్ట్ లు - విషయాలు?... అవక-తవక గా తయారీ చేయవచ్చు పిల్లలు... ఇంట్లో అయితే. 

గమనిక: 

*****

క్రితం సంవత్సరం యొక్క ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలు ముందు ఉంచి... వాటికి జవాబులు వ్రాస్తే... ఒక క్రమ (సైంటిఫిక్) పద్ధతి (పరీక్ష) తయారీ - పునరావృత్తం... మంచి పద్ధతి... (ఇంట్లో లేక తరగతి గది లో... తయారీ కైనా సరే)... అదీ అన్ని సబ్జెక్ట్స్ - విషయాలలో... ఒక అధ్యాయం వదలకుండా (పూర్తి చేయవచ్చు సిలబస్ ను... నిర్ణీత తక్కువ సమయంలో). 

----------------------------------------------------------

 9)

 అన్ని తరగతులకు కూడా... ప్రి ఫైనల్ పరీక్షలు పెడితే... పిల్లలు... ఒక ఆట లాగా - పాట లాగా (ఫన్ గేమ్ లా)... తప్పులు తెలుసుకొని... సరి దిద్దు కుంటారు... రానివి కొన్నే కాబట్టి.. ఇంటికెల్లాక వెంటనే పుస్తకం తెరచి - చదివి లేక ఇతరులను అడిగి నేర్చుకుంటారు. 

రెండు ప్రి ఫైనల్ పరీక్షలు పెడితే... ముందు (50%) యాభై శాతం సిలబస్ తో - వెనకటి యాభై (50%) శాతం సిలబస్ తో పెట్టడం... మరీ మంచిది. అప్పుడు వెనకటి అధ్యాయాలు సమయం సరిపోక వదిలేసే సమస్య రాదు (పిల్లలకు - విద్యార్థులకు). 

-----------------------------------------------------

10) 

ప్రతి పరీక్ష అయిపోయాక (యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ యియర్ లీ, ఫైనల్ పరీక్ష.. ఏదైనా సరే)... దానిని (ప్రశ్న - జవాబు లను)... టీచర్ తరగతి గది లో... నిదానంగా చర్చిస్తే... బోధనా పద్ధతి రూపం లో... పిల్లల మెదడులో జవాబు - జ్ఞానం - విజ్ఞానం... శాశ్వతంగా ఉండిపోతుంది. 

---------------------------------

11)

టీచర్ లకు కూడా తరచు... శిక్షణ (ట్రైనింగ్) ఇస్తే... తేలికైన బోధనా పద్ధతుల్లో.... సంతోష పూరిత నిర్వహణ... ఆనంద దాయక పరిష్కారాల తీరు లో... అప్పుడు దేశానికే... ప్రపంచానికే... మేలు - ఉపయోగం. 

అదెలా?

ఒక్క టీచర్ కొవ్వత్తి (జ్ఞానం - విజ్ఞానం - ఉత్తమ సంతోష పూరిత నిర్మాణాత్మక నిర్వహణ అనే అంశాలతో)... ఉత్తమంగా వెలిగిస్తే - వెలిగితే... అవి ఎన్నో విద్యార్థులు అనే కొవ్వొత్తులను (అదే... జ్ఞానం - విజ్ఞానం - ఉత్తమ సంతోష పూరిత నిర్మాణాత్మక నిర్వహణ... అనే... వెలుగు తో) వెలిగేలా చేస్తుంది. 

---------------------------------------------------

12)

టీచర్ ల పని భారం తగ్గించాలి. వారిని మానస - సంతోషం తో - దివ్యంగా ఉండేలా చేయాలి. క్లాస్ నోట్స్, హోం వర్క్ పుస్తకాలను

+ పరీక్ష జవాబుల పత్రాలను... దిద్దటానికి... వేరే ఉద్యోగులను పెట్టుకుంటే / నియమించు కుంటే మరీ మంచిది. 

అప్పుడు... దేశ నిరుద్యోగ సమస్య కూడా.... కాస్త తగ్గుతుంది. 

చాలామందికి ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా టీచర్ల పని భారం తగ్గుతుంది 

---------------------------------------------------

13)

ఒకే దేశం, ఒకే సిలబస్.... అంటే అందరికీ ఒకే పాఠ్య పుస్తకం (టెక్స్ట్ బుక్).... ప్రతి సబ్జెక్ట్ లో (విషయం లో) ఉండాలి (మొత్తం భారత దేశం లో). పాఠశాల లేక కళాశాల అయినా సరే. 

I) అప్పుడు, తరచు ట్రాన్స్ఫర్ అయ్యే కుటుంబాల పిల్లలకు సమస్య ఉండదు. 

Ii) ప్రతి విద్యార్థి, ప్రతి విద్యా కేంద్రం లేక ఉద్యోగ ప్రవేశ పరీక్ష కు... తయారు గా ఉంటాడు / ఉంటుంది. కొన్ని ప్రశ్నలు సిలబస్ లో లేనివి వచ్చాయి అనే సమస్య అదృశ్యం అయిపోతుంది (దేశం లో). 

Iii) సి. బి. ఎస్. ఇ అనే ఒకే సిలబస్ మాత్రమే పెడితే... మొత్తం భారత్ లో... అదీ 30-40 శాతం (%) తగ్గించింది... అప్పుడు అంతర్జాతీయ పరీక్షలు కూడా తేలికగా ఎదుర్కుంటారు... జవాబులు వ్రాస్తారు... భారతీయ విద్యార్థులు. ఆట పాటలకు - అభిరుచులకు - మానస వికాసంకు కూడా సమయం దొరుకుతుంది... అదీ రోజూ. 

పరీక్ష కొరకు బట్టీ అనే రోజులు పోతాయి... ఇష్టంగా జ్ఞానం - విజ్ఞానం కొరకు (పిల్లలు) చదివే రోజులు వస్తాయి 

--------------------------------------------------

14) 

హిందీ అని, రీజనల్ - ప్రాంతీయ భాష తప్పని సరి అని... పిల్లల పై వత్తిడి తేవద్దు / ఇవ్వ వద్దు. 

*శాస్త్రీయ విషయాల పై (మాథ్స్ - గణితం, సైన్సెస్ - శాస్త్రీయ విషయాలు, కంప్యూటర్, ఎ ఐ (AI) పై ఎక్కువ దృష్టి సారించాలి. అప్పుడు పిల్లలకు... అంతర్జాతీయ అవకాశాలకు... ఎక్కువ పరిధి - పరిమితి ఉంటుంది. 

2 రకాల పరిష్కారాలు:

* హిందీ, ప్రాంతీయ భాష మార్కులు రిపోర్ట్ కార్డ్ లో ఉంచ కూడదు. 

లేదా

* వేరే విషయాల పట్టిక తయారు చేయాలి (డ్రాయింగ్, ఆర్ట్స్, కంప్యూటర్, ఆంగ్లం - ఇంగ్లీష్, AI (ఎ. ఐ)... ఇతరత్రా). వాటినుండి ఏదైనా రెండు ఎన్నుకోవచ్చు (హిందీ, ప్రాంతీయ భాష బదులు). 

--------------------------------------------------

15) 

పరీక్షలు 50 శాతం (50%) ఆబ్జెక్టివ్ ఫార్మాట్ మరియు 50 శాతం (50%) సబ్జెక్టివ్ ఫార్మాట్ లో పెట్ట వచ్చు. 

*ఆబ్జెక్టివ్ ఫార్మాట్ లో విడిగా తయారు చేయించాలి పిల్లలను. 

------------------------------------------

16)

పాఠ్య పుస్తకాల్లో లేటెస్ట్ టెక్నాలజీ - సాంకేతికత సంబంధిత విషయాలు 

పెట్టాలి (ఉదాహరణలు: i) కాలుష్యం వల్ల వచ్చే భూతాపం (భూమిలో ఎక్కువ ఉష్ణోగ్రత)... దాని వల్ల వచ్చే అతివృష్టి - అనా వృష్టి... ధన - జన - ప్రాణ నష్టం... పరిష్కారం ఏమిటి???.... పచ్చ ఇంధనం - స్వచ్ఛ శక్తి (సూర్య - గాలి - పచ్చ హైడ్రోజన్ లేక ఉదజని, అణు శక్తి లేక న్యూక్లియర్ శక్తి) వాడాలి 

... 

ii) AI (ఏ. ఐ) వల్ల లాభాలు - నష్టాలు... Iii) ఎలా అందరికీ జీవిత భీమా - ఆరోగ్య భీమా, విద్య ఆధునిక ఆరోగ్య సదుపాయాల తో కూడిన ఆసుపత్రుల సేవ సాధ్యం... Iv) దేశంలో అందరికీ కనీస మౌలిక సదుపాయాలు... V) అందరికీ విద్య అందుబాటులో... Vi) బయో ప్లాస్టిక్ వాడితే పర్యావరణానికి మంచిది... Vii) రైతులకు ఆధునిక టెక్నాలజీ - పరికరాలు - పద్ధతులు (క్రాప్ రొటేషన్, ఆర్గానిక్ ఎరువులు మరియు మందులు, జెనెటిక్ ఇంజనీర్డ్ మరియు హైబ్రిడ్ విత్తనాలు, హైదోఫోని వ్యవసాయం)... Viii) క్వాంటమ్ కంప్యూటర్స్... Ix) పత్తి బట్టలనే వాడాలి... అప్పుడు రసాయన సింథటిక్ బట్టల వల్ల కలిగే నష్టాలు ఉండవు (చర్మ వ్యాధులు - మంచి నీటి సీసాల్లో మైక్రో ప్లాస్టిక్ చేరటం... అవి ఊపిరితిత్తుల సమస్యలు ఇవ్వటం ఉండవు)... Ix) పంట భీమా (క్రాప్ ఇన్సూరెన్స్)... ఇతరత్రా 

---------------------------------------------------

17)

సాంఘీక శాస్త్రం లో... చరిత్ర (హిస్టరీ) భాగంలో... రక్తపాతం - యుద్ధాలు గురించి తక్కువగా ఇచ్చి (కేవలం కొన్ని వాక్యాలు మాత్రమే)... ఆ కాలంలో ఉన్న మంచి నిర్వహణ గురించి విపులంగా ఇస్తే... పిల్లల సృజనాత్మక ఆలోచనా తీరుకు దోహద పడుతుంది. 

--------------------------------

18) 

తరచు విహారయాత్రలకు తీసుకు వెళ్ళాలి పిల్లలను... (మ్యూజియం లకు, డాం - ఆనకట్ట లకు, నదుల - సముద్ర తీరాలకు, పాల - బ్రెడ్ - బిస్కెట్ - చాక్లెట్ / క్యాండీ కంపెనీ లకు, పొలాలకు... ఇతర పరిశ్రమలకు - సేవా సంస్థలకు... తీసుకు వెళ్ళాలి పిల్లలను. స్వయంగా చూసి నేర్చుకుంటారు పిల్లలు. మన దేశం ఎంత అభివృద్ధి చెందింది సాంకేతిక పరంగా (సైంటిఫిక్ గా) పిల్లలు తెలుసుకుంటారు). కనీసం వారం లో / నెలలో ఓ సారి (సిలబస్ 30-40% తగ్గిస్తే - కుదిస్తే... ఇవన్నీ సాధ్య పడతాయి). 

--------------------------------

19) 

పిల్లల అభిరుచులకు - బలం కు అనుగుణంగా - తగ్గట్టు... వారికి కావాల్సిన సబ్జెక్ట్స్ - విషయాలు, ప్రాజెక్ట్స్... ఎంచుకోవటం అనే సౌకర్యం... కల్పిస్తే... (కనీసం ఎనిమిదవ తరగతి నుండి... వారి అత్యున్నత అభివృద్ధికి దోహద పడుతుంది). 

----------------------------------------

20)

సంతోష జీవితం (ఇంట్లో మరియు పని చేసే చోట) అనే విషయం (సబ్జెక్ట్) పెట్టాలి... ప్రతి తరగతి లో (1 వ తరగతి నుండి పి. జి. దాకా). 

--------------------------------------

21) మంచి సృజనాత్మక ఆలోచనా తీరు, ఆనంద దాయక పరిష్కారాల తీరు, నిర్మాణాత్మక త, సంతోష పూరిత నిర్వహణ, మంచి పుస్తకాలు చదవటం, ... మంచిని పెంచటం - పంచటం, రోజూ వ్యాయామం (కనీసం నడక)... పజిల్స్ పరిష్కరించడం (రోజూ దిన పత్రికలో వచ్చేవి)... సుడోకు పరిష్కరించడం... ఇతరత్రా... నేర్పించాలి పిల్లలకు... చరవాణి తక్కువగా వాడటం (చిన్నపటి నుండే). 

-----------------------------------

22)

ప్రత్యేకం గా ఆటల డిగ్రీలు ఇచ్చే స్కూళ్లు - కాలేజీలు స్థాపిస్తే మంచిది. 

అప్పుడు దేశానికి ఎక్కువగా అంతర్జాతీయ పతకాలు వస్తాయి (ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్, అసియన్ క్రీడలు... ఇతరత్రా లో). 

ఎవరికి యే ఆట ఇష్టమో, అనుకూలమో... ఎన్నుకునే ప్రక్రియ కల్పించాలి. ఏదైనా కారణం వల్ల వేరే ఆట / క్రీడ కు మారాలి అనుకుంటే... వారిని ప్రోత్సహించాలి. 

క్రీడలలో కూడా మంచి భవిష్యత్తు, సంపాదన, వృత్తి, జీవన ప్రగతి ఉందని ప్రచారం చేయాలి. 

విద్య - చదువు అబ్బక పోతే... అటువంటి వ్యక్తులకు ఊరట ఉంటుంది, మనస్థైర్యము వస్తుంది. 

క్రీడల స్కూలు - కళాశాలలు వీలు కాకపోతే... క్రీడల శిక్షణ కేంద్రాలు స్థాపించాలి... దేశమంతటా (పల్లెల్లో - గ్రామాల్లో - నగరాల్లో / పట్టణాలలో). పేద వారికి ఉచితంగా. మధ్య తరగతి వారికి తక్కువ ధరతో - చౌకగా లభ్యం అయ్యేటట్లు. 

(తప్పులు లెక్కపెట్టడం, మానసిక - భౌతిక హింస, నిరుత్సాహ పరచటం పోవాలి... అన్ని రంగాలలో... మన దేశం నుండి మరియు ప్రపంచం నుండి). 

--------------------------------------

23)

ప్రతి పాఠశాల తరగతి గది లో... పిల్లలు / విద్యార్థుల సంఖ్య 25 మించకూడదు. 

--------------------------------------

24)

తరగతి గది లో ఎవ్వరూ (పెద్ద - చిన్న, ఆడ - మగ) చరవాణి వాడకూడదు. (దానిని నిషేధించాలి)

--------------------------------------

25)

పాఠ్య పుస్తకాలలో ముందుగా ఆబ్జెక్టివ్ ఫార్మాట్ పెట్టాలి... తరువాయి సబ్జెక్టివ్ ఫార్మాట్ పెట్టాలి. 

*గమనిక:

*పేద వారికి ఉచితం గా... మరియు మధ్య తరగతి వారికి తక్కువ ధరతో / ఫీజు తో... ఇవ్వాలి విద్య, క్రీడలు, మౌలిక సదుపాయాలు - సౌకర్యాలు ఇతరత్రా.... అప్పుడే అది సఫలీకృతం అవుతుంది. ప్రగతి, అభ్యుదయం, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఉత్పాదకత... ఇత్యాది మంచిలు... పెరుగుతుంది దేశంలో మరియు ప్రపంచంలో. 

----X X X ----X X X ----X X X -----

-- తేలికైన విద్య పై 25 సూచనల వ్యాసం సమాప్తం --


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Comentarios


bottom of page