తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో అనురక్తి పెంచే మార్గాలు

Telugu Bhasha Patla Vidyarthullo Anurakthi Penche Maragalu - Telugu Inspirational Article | Rallabandi Sangam Naidu
తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో అనురక్తి పెంచే మార్గాలు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 30/10/2026
తెలుగు భాష మన సంస్కృతికి, సంప్రదాయాలకు, సాహిత్య వారసత్వానికి ప్రతీక. నేటి విద్యావిధానంలో ఆంగ్లభాషకు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో విద్యార్థుల్లో మాతృభాష పట్ల ఆసక్తిని, అభిమానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది.
తెలుగు భాషను కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా భావవ్యక్తీకరణకు, సృజనాత్మకతకు, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే భాషగా విద్యార్థులకు పరిచయం చేయాలి.
తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సాహితీవేత్తలు ఏ విధంగా కృషి చేయాలో రచయిత రాళ్లబండి సంగం నాయుడు ఈ వ్యాసంలో పలు ఆచరణాత్మక సూచనలు చేశారు.
*తెలుగు భాష పట్ల ఆసక్తి పెంచడంలో రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, మేధావులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలి. చిత్తశుద్ధి లేని శివపూజలేల? ఆత్మశుద్ధి లేని భాండమేల?
*ఆచరణాత్మక సలహాలు, సూచనలు పాటించాలి.
*తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచడంలో ఆరంభశూరత్వం వదులుకోవాలి.
*విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి పెంచడంలో తెలుగువాళ్ళు తమిళులు, మలయాళీలు, కన్నడిగులు, బెంగాలీల నుండి గుణపాఠం నేర్చుకోవాలి.
*భాష, సంస్కృతి, సంప్రదాయం, కట్టుబొట్టు విషయంలో తెలుగువాళ్ళ దృక్పథం మారాలి.
పొరుగుంటి పుల్లకూర రుచి అని మరవకూడదు.
*తెలుగువాళ్ళ వ్యామోహమైన ఆంగ్లం పుట్టుక 800 సంవత్సరాలని, తెలుగు భాష పుట్టుక 2000 సంవత్సరాల పైమాటని, ప్రపంచంలో అతి ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటని గుర్తుచేసుకోవాలి.
*తెలుగు వర్ణమాలలోని వర్ణాలు 56 అని, ఆంగ్ల ఆల్ఫాబెట్స్ 26 అని గుర్తుచేసుకోవాలి. అనగా తెలుగు భాష ధనిక భాష అని గుర్తుచేసుకోవాలి.
*తెలుగు భాషలో ప్రతీ నిర్దిష్ట ధ్వనికి నిర్దిష్ట అక్షరం ఉందని గుర్తుచేసుకోవాలి.
*ముందు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయం, కట్టుబొట్టు పట్ల గౌరవం పెంపొందించుకోవాలి.
*తెలుగు భాషను, తెలుగు భాష గౌరవాన్ని కించపరిచే సినిమాలు, సీరియళ్ళు నిషేధించాలి.
*తెలుగు పద్యానికి, ముఖ్యంగా శతక సాహిత్యానికి పట్టం కట్టాలి.
*తెలుగు భాష ఔన్నత్యం పెంచే విధంగా పాఠశాల, కళాశాల స్థాయి పాఠాలు, ప్రశ్నపత్రాలు ఉండాలి.
*తెలుగు బోధనలో, మూల్యాంకనంలో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
*తెలుగు సంకీర్తనలు, ముఖ్యంగా అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య లాంటి వాగ్గేయకారులకు తగు స్థానం కల్పించాలి.
*పాఠశాల, కళాశాల స్థాయిలలో విద్యార్థులతో కథలు రాయించడం, చెప్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
*తెలుగులో చదివిన వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
*విద్యార్థులు పాఠశాలలో కథలు రాసే విధంగా ప్రోత్సహించాలి.
*ప్రతీ జిల్లాలో DEO స్థాయిలో కథలపై కార్యశాలలు ఏర్పాటు చేయాలి.
*ప్రతీ సంవత్సరం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో కథల పోటీలు పెట్టి ప్రభుత్వం బహుమతులు ఇవ్వాలి.
*ప్రతీ సంవత్సరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పద్యాలపై పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి.
*విద్యార్థులు కవితలు, పద్యాలు రాసే విధంగా ప్రోత్సహించాలి.
*తెలుగు భాషా ఉపాధ్యాయులు విధిగా తెలుగు భాష, సంస్కృతి పట్ల మమకారం కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలి.
*తెలుగు భాషా ఉపాధ్యాయుల నియామకం, ప్రమోషన్ సమయంలో వారి సృజనాత్మక నైపుణ్యాలను (క్రియేటివ్ స్కిల్స్) పరీక్షించాలి.
*తెలుగు భాషా ఉద్ధరణ కోసం ప్రత్యేక స్వతంత్ర మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడపాలి.
*తెలుగు సాహిత్యమే తెలుగు జాతి సముద్ధరణ అని తెలుగువాళ్ళందరూ గుర్తించాలి.
*పాఠశాల, కళాశాల స్థాయిల్లో తెలుగును అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలి.
*అమ్మ భాష అధ్యయనం ముందు అమెరికా లాంటి విదేశాలు దిగదుడుపని తెలుసుకోవాలి.
*అమ్మ భాష అన్వయమే అనంతకోటి జన్మ, పుణ్య, పురుషార్థ ప్రదమని అందరం అనుకుందాం.
*రండి అమ్మ భాషతో మమేకమవుదాం. అవనిని ఏలుదాం.
*తెలుగు భాష విశ్వ వెలుగు భాష, విశ్వాసపు భాష.
*తెలుగులో మాట్లాడాలి.
తెలుగు భాషను జీర్ణం చేసుకుందాం.
తెలివి పెంచుకుందాం.
*తెలుగును పెంచుకుందాం.
ప్రపంచంలోని తోటివారికి ఆదుకుందాం.
*అవనిన అమ్మ భాషకు సరిసాటి మరొక భాష లేదు.
*తెలుగంటే తెలివంతే.
విశ్వతేజం తెలుగొంతే.
=== రాళ్లబండి సంగం నాయుడు
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం







Comments