కవితల ప్రచురణలో మార్పు | నవంబర్ 2026 నుంచి నెలవారీ కవితా సంకలనం

ప్రియమైన కవులు, రచయితలు మరియు పాఠకులకు నమస్కారం.
ఒక్కో కవితను చదివేందుకు ఒక్కో పోస్టును తెరవడం కొంత ఇబ్బందిగా ఉందని పలువురు పాఠకులు తెలియజేశారు. వారి సూచనలను దృష్టిలో ఉంచుకొని, కవితలను మరింత సులభంగా చదివేందుకు నవంబర్ 2026 నుంచి కవితల ప్రచురణ విధానంలో మార్పు చేస్తున్నాము.
కవితల ప్రచురణలో మార్పు
ఇకపై ప్రతి నెలలో అందిన కవితలను ఆ నెలకు సంబంధించిన ఒకే పోస్టులో ప్రచురిస్తాము. ఉదాహరణకు, నవంబర్ నెలలో అందిన కవితలను “నవంబర్ 2026 కవితలు” అనే పోస్టులో చూడవచ్చు.
ప్రతి కవితతో పాటు కవిత పేరు, రచయిత పేరు, ప్రచురించిన తేదీ స్పష్టంగా తెలియజేస్తాము.
ప్రత్యేక పోస్టు కోరుకునే రచయితలకు
తమ కవితలను ప్రత్యేక పోస్టుగా ప్రచురించాలని కోరుకునే రచయితలు ఐదు నుంచి పది కవితలను ఒకేసారి పంపవచ్చు. వాటిని ఒక సంకలనంగా ప్రత్యేక పోస్టులో ప్రచురిస్తాము.
ఒకటి లేదా రెండు కవితలు మాత్రమే పంపగలిగిన రచయితల కవితలను కూడా యథావిధిగా స్వీకరించి, నెలవారీ కవితల పోస్టులో ప్రచురిస్తాము.
ఈ మార్పు ద్వారా పాఠకులు ఒకే చోట అనేక కవితలను ఆస్వాదించగలరని, రచయితల రచనలు మరింత మంది పాఠకులకు చేరువవుతాయని ఆశిస్తున్నాము.
మీ కవితలను, విలువైన సూచనలను మాతో పంచుకుంటూ ఉండండి. 🌸
-మనతెలుగుకథలు.కామ్





Comments