నేతి బీరకాయ

Nethi Beerakaya - Telugu Moral Story | Rallabandi Sangam Naidu
నేతి బీరకాయ - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 30/10/2026
అనగనగా పూర్వం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆనంద గజపతి పరిపాలించేవాడు. ఆనంద గజపతి మంచివాడు. దైవభక్తి కలవాడు. రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డలు అనుకునేవాడు. రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం యజ్ఞయాగాలు చేసేవాడు. దానధర్మాలు చేసేవాడు. ప్రజలు కోరిన కోర్కెలు తీర్చి జనరంజకుడనే పేరు సంపాదించాడు.
ఒకరోజు ఆనంద గజపతి కలలోకి పైడి తల్లమ్మ వచ్చింది. "నాయనా, నేను మీ పూసపాటి వంశీయుల ఆడపడుచును. నీవు చేస్తున్న యజ్ఞయాగాలు, దానధర్మాలు చూసి చాలా సంతోషిస్తున్నాను. నాకు ఒక కోరిక, దాన్ని తీర్చు. నీ రాజ్యాన్ని సుఖసంతోషాలతో కాపాడుతాను. కరువు కాటకం లేకుండా చేస్తాను. నేను తరించి మిమ్మల్ని దీవిస్తాను. అంతేకాదు, నన్ను సేవించటానికి వచ్చిన భక్తులకు రెండు అరచేతులు పట్టినంత ఆవు నేతితో చేసిన అరిసె ప్రసాదంగా ఇవ్వు. జనం ఆకలి తీర్చు" అని చెప్పి అంతర్ధానమైంది.
ఆనంద గజపతి తనకు వచ్చిన కల ప్రకారం పైడి తల్లమ్మ గుడి నిర్మించి, ఆవు నేతితో చేసిన అరిసెను ప్రసాదంగా ఉచితంగా వితరణ చేయసాగాడు. నాటి నుండి తన రాజ్యంలో అన్నవస్త్రాలకు కొదువ లేదు. నేతి అరిసెల తయారీ కోసం గుడిలో బంగారు బొక్కసం ఒకటి ఉంచి, దాని నిండా బంగారం ఉంచేవాడు. ఆ బంగారం నేతి అరిసెల తయారీ ఖర్చు కోసం.
ఈ ధర్మ కార్యాన్ని జగన్నాథుడు అనే ధర్మకర్తకు అప్పగించాడు. మొదట్లో జగన్నాథుడు నేతి అరిసెలు బాగానే చేసేవాడు. తరువాతి కాలంలో ధనానికి కక్కుర్తి పడి నెయ్యిని కల్తీ చేశాడు. అరిసె పరిమాణం పిడికెడు చేశాడు. చివరికి అరిసెల తయారీలో పూర్తిగా నెయ్యి వాడకం మానేసి నూనెతో చేసిన అరిసెలు ప్రసాదంగా ఇవ్వడం ప్రారంభించాడు. ఇది గమనించిన కొందరు భక్తులు జగన్నాథుణ్ణి ప్రశ్నించారు.
"పైడి తల్లమ్మలో పైడి లేదు, నేతి బీరకాయలో నేతి లేదు. అలాగే నేతి అరిసెలో నెయ్యి ఉండదు" అని సమాధానం చెప్పేవాడు.
కొంతకాలానికి పైడి తల్లమ్మ గుడిలోని బంగారు బొక్కసానికి బంగారం రావడం ఆగింది. ఇది గమనించిన జగన్నాథుడు బంగారు బొక్కసానికి బంగారం రావడం ఆగిందని ఆనంద గజపతికి లేఖ రాశాడు. అక్కడ నుండి సమాధానం ఇలా వచ్చింది: "నేతి బీరకాయలో నెయ్యి లేదు. నేతి అరిసెలో నెయ్యి లేదు. పైడి తల్లమ్మలో పైడి లేదు. బంగారు బొక్కసంలో బంగారం లేదు. ధర్మకర్త పదవిలో నువ్వు లేవు. నీ బదులు చంద్రనాథుణ్ణి ధర్మకర్తగా నియమిస్తున్నాను. ఇక నుండి నీవు నేతి బీరకాయలో నెయ్యి వెతుక్కుంటే చాలు."
ఆనాటి నుండి చంద్రనాథుడు పైడి తల్లమ్మ గుడి ధర్మకర్త అయి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజా పునస్కారాలు చేశాడు. కమ్మని ఆవు నేతి అరిసెలు యథాప్రకారం భక్తులకు వితరణ చేయసాగాడు. దాంతో అమ్మ కరుణాకటాక్షాలతో ఆనంద గజపతి రాజ్యం సుభిక్షమైంది.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం







Comments