top of page
Original.png

తెనాలి తెలివితేటలు

13 hours ago
3 min read

శ్రీకృష్ణదేవరాయల రాజసభలో తెనాలి రామకృష్ణుడు తన తెలివితేటలతో నగల దొంగలను పట్టిస్తున్న దృశ్యం

Tenali Telivitetalu - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

తెనాలి తెలివితేటలు - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 27/09/2026


తెనాలి రామకృష్ణుడి తెలివితేటలు, సమయస్ఫూర్తి గురించి చెప్పే ఆసక్తికరమైన కథ

“తెనాలి తెలివితేటలు”.

శ్రీకృష్ణదేవరాయల రాజభవనంలో జరిగిన నగల దొంగతనాన్ని తెనాలి తన ప్రత్యేకమైన పద్ధతిలో ఎలా ఛేదించాడో ఈ కథ వివరిస్తుంది.హాస్యం, తెలివితేటలు, న్యాయం కలగలిసిన ఈ కథ పిల్లలకు మంచి సందేశాన్ని అందిస్తుంది.సమస్య ఎంత క్లిష్టమైనదైనా తెలివితో పరిష్కరించవచ్చనే నీతిని ఈ కథ తెలియజేస్తుంది.


పూర్వం హంపి విజయనగరం రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. హంపి విజయనగరం ఇప్పుడు కర్ణాటకలో ఉంది.


శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఎనిమిది మంది తెలుగు కవులు ఉండేవారు. వీరిని అష్టదిగ్గజ కవుల పేరుతో పిలిచేవారు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల ఇంటిలో నగలు దొంగతనం జరిగింది.


దొంగలు ఎవరో ఎవరికీ తెలియలేదు. రాజఆస్థానంలో ఉన్న అధికారులు, మంత్రులు ఎంత బుర్ర బాదుకున్నా ఆ దొంగలను కనిపెట్టలేకపోయారు.


శ్రీకృష్ణదేవరాయలు తన ఇంటిలో పడ్డ దొంగలనే పట్టుకోలేకపోయారు, ఇక దేశంలో దొంగలు పడితే ఎలా పట్టుకుంటారు అని అంతా అనుకోవడం వినిపించింది.


రాయలవారు రాజభవనంలో జరిగిన దొంగతనాన్ని పెద్ద సవాలుగా తీసుకున్నారు. తన గృహంలో దొంగతనం విషయాన్ని అష్టదిగ్గజ కవుల ముందు ఉంచారు.


రాయలు తెనాలి రామకృష్ణుడితో "నీవు వికటకవివి కదా. సాహిత్యంలోని సమస్యలను హాస్యభరితంగా పూరిస్తావు. ఇప్పుడు నిజ జీవిత సమస్యను కూడా నీదైన పంథాలో పరిష్కారం చూపి నీ బిరుదు వికటకవి నామం సార్థకం చేసుకో" అన్నారు. "చిత్తం, తమ ఆజ్ఞ.


తప్పకుండా పరిష్కరిస్తాను" అని బదులిచ్చాడు తెనాలి. దొంగతనం జరిగిన తీరు ఒకసారి ఆ రోజు కాపలా ఉన్న భటులను అడిగి తెలుసుకున్నాడు.


ఆ రోజు రాజభవనానికి వేసిన తలుపులు వేసినట్టే ఉండడం తెలుసుకున్నాడు. అంటే దొంగతనం జరిగిన రోజు బయటి నుండి ఎవరూ దొంగతనం చేయడానికి లోనికి రాలేదు.


దొంగతనం జరిగిన రాత్రి కాపలా ఉన్న భటులే దొంగతనం చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చాడు.


దొంగతనం జరిగిన రాత్రి విధులు నిర్వహించిన భటులను పిలిపించి సమావేశపరిచాడు. "మీలో దొంగతనం చేసిన వారెవరో చెప్పండి.


ఎవరైనా దొంగతనం చేయగా చూసినవారు ఎవరైనా ఉంటే చెప్పండి. శిక్ష పడకుండా నేను చూస్తాను" అన్నాడు వికటకవి. వారంతా "మేము దొంగతనం చేయలేదు.


ఎవరైనా దొంగతనం చేస్తుండగా మేము చూడలేదు" అని ముక్తకంఠంతో చెప్పారు. పైగా రాజుగారింటిలో పనికి వచ్చిన తమపై ఇలాంటి అపనిందలు వేయడం తగదన్నారు.


వెంటనే రాజఆస్థానంలోని మంగలిని పిలిపించి వారందరికీ గుండు కొట్టించాడు. గుండు తరువాత ఒక రకమైన లేపనం పూయించాడు.


"మీరు రాజాస్థానంలో విలువైన నగలు దొంగతనం చేయక మంచివారైతే మీ జుట్టు నెల రోజుల్లో మీ తలపై రెట్టింపు జుట్టు మొలుస్తుంది. అదే మీరే దొంగలైతే మీ జుట్టు ఎప్పుడూ మామూలుగా మొలుస్తుంది" అని వారితో చెప్పి నెల రోజుల తరువాత రమ్మన్నాడు.


నింద మోపబడిన రాజభటులకు తెనాలి ఇచ్చిన నెల రోజుల గడువు పూర్తయింది.


రాజభటులు వచ్చి తెనాలి ముందు నిలబడ్డారు. తెనాలి రాజఆస్థానంలోని మంగలిని పిలిచాడు. రాజమంగలితో "నీ దగ్గర విగ్గు చేయించుకున్న ముగ్గురిని చెప్పండి" అన్నాడు.


రాజమంగలి ముగ్గురిని పిలిచాడు. ఆ ముగ్గురు దొంగతనం చేసినట్లు నిర్ధారించాడు.


"ఈ ముగ్గురు దొంగలు తాము మంచివారమని నిరూపించుకోవడానికి, నేను చెప్పినట్టు నెలలో రెట్టింపు చేసుకోవడానికి రాజమంగలికి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించి విగ్గులు చేయించుకున్నారు రాజా" అని రాయలతో తెనాలి ఆ ముగ్గురు దొంగల గురించి చెప్పాడు.


ఆ ముగ్గురు దొంగలకు నాలుగేసి కొరడా దెబ్బలు కొట్టేసరికి నగలు తెచ్చి ఇచ్చారు.


దొంగలకు రాయలు కారాగార శిక్ష విధించాడు. తన పరువు, రాజ్యం పరువు కాపాడిన తెనాలి తెలివితేటలను మెచ్చి తగు రీతిన సత్కరించాడు రాయలు.


తెనాలి తన తెలివితేటలతో కవిత్వ సమస్యలే కాక నిజ జీవిత సమస్యలు తీర్చి వికటకవి బిరుదు సార్థకుడయ్యాడు. వికటకవి అంటే నవ్వుతూ సమస్యలు పరిష్కరించేవాడని అర్థం.


*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.


మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page