top of page
Original.png

తమ్మునికి సలహాలు

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ThammunikiSalahalu, #తమ్మునికిసలహాలు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 142

Thammuniki Salahalu - Somanna Gari Kavithalu Part 142 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 18/11/2025

తమ్మునికి సలహాలు - సోమన్న గారి కవితలు పార్ట్ 142 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


తమ్మునికి సలహాలు

----------------------

మంచి మంచి తలపులతో

గొప్ప గొప్ప చేతలతో

అందరిని మెప్పించాలి

అంతులేని జ్ఞానంతో


ఊరడించు మాటలతో

ప్రేమలొలుకు హృదయంతో

గుండెల్లో చేరాలి

అభిమానం పొందాలి


ఘనమైన మేధస్సుతో

ఘనులైన వ్యక్తులతో

జీవితాన వెలగాలి

స్నేహమే వికసించాలి


చాడీలు చెప్పకుండా

ప్రేమతో మదినిండా

ఎగరేయాలి తమ్ముడు

ఇల త్రివర్ణ జెండా







సాగర తీరం చూసొద్దామా!

------------------------------

సాగర తీరం పోదామా

సొంపుగా ఆడుకుందామా

ఇసుకతో ఇండ్లను కడుతూ

ఆనందమే పొందుదామా


కడలి తల్లి ఒడిలో ఆడే

తీర ప్రాంతంలో పాడే

కెరటాలనే చూద్దామా

వీనులవిందే చేద్దామా


తీరం చేరాలనే అలల

ఆరాటం చూసొద్దామా

అవి చేసే విన్యాసాలతో

కాలం మరచి గడిపేద్దామా


ఇసుక పరుపుపై హాయిగా

పవళిద్దామా! నేస్తమా

కూనిరాగాలే తీయగా

తీరం వెంట పాడేద్దామా


సాగర తీరం అందాలను

చల్లగా వీచే గాలులను

మనసారగ తిలకిద్దామా

రోగాలను తరిమెద్దామా


సాగరం నేర్పును పాఠాలు

అవే దిద్దును జీవితాలు

సమయం దొరికినప్పుడెల్లా

వెళ్ళొద్దాం సాగర తీరాలు





















గేయ హారాలు- నగ్న సత్యాలు

--------------------------------------

నాలుకను అదుపు చేస్తేనే

మంచిగా మనుగడ సాగేది

యోచించి మాట్లాడితేనే

బ్రతుకున గౌరవం దక్కేది


హద్దులోనే ఉంటేనే

కుటుంబాలు బాగుండేది

ఇల ఇచ్చుపుచ్చుకుంటేనే

బంధాలు పటిష్టమయ్యేది


క్షమాకాంతులు వెలిగితేనే

పగ,ప్రతీకారాలు తొలగేది

అనురాగం పండితేనే

వసుధైక కుటుంబమయ్యేది


విజ్ఞానం వికసిస్తేనే

అజ్ఞానము మాయమయ్యేది

అభివృద్ధి బాటలోనే

దేశం ముందడుగు వేసేది







వస్తావా! మా ఊరు

-----------------------------------------

పచ్చదనం దుప్పటిలా

పరచుకుంది మా ఊరు

కొత్త పెళ్లి కూతురులా

ముస్తాబైంది మా ఊరు


పొలంలోని పైరులతో

చెరువులోని జలములతో

కనువిందే చేస్తుంది

ఆడిపాడే పిల్లలతో


నలుదిశలా తరువులతో

ప్రేమలొలుకు మనసులతో

సమైక్యతను చాటుతుంది

కలుపుగోలుతనంతో


వస్తావా! మా ఊరు

చూస్తావా! దాని తీరు

చెంత ఉంది కోనేరు

పారుతుంది సెలయేరు







సాగరము

----------------------------------------

విశాలమైన సాగరము

పంచునోయి! వినోదము

ఎన్నో ప్రాణుల నిలయము

అమ్మలాంటిది హృదయము


కడలిపైన ప్రయాణము

మదికెంతో ఆహ్లాదము

కెరటాల ఉయ్యాలలో

అంతులేని ఆనందము


అందాల సాగర తీరము

చూడాలి ఖచ్చితంగా

జీవితాల్లో పాఠము

నేర్చితే మంచిదేగా


ఆ సముద్ర గర్భంలో

ఘన సంపద నిక్షిప్తము

ఎంతెంతో ఉపయోగము

వాడుకుంటే మాత్రము

-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page