top of page

తవిషి లాంటి తల్లి మహిమ


'Thavishi Lanti Thalli Mahima' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally

'తవిషి లాంటి తల్లి మహిమ' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


ఇమ్మహి నందు వెదక నరుడ

అమ్మ ఒడియె నీకు అందలంబు

అదియె సింహాసనంబు

అదియె స్వర్గ ధామంబు


అమృత పానమనగ అమ్మ పాలె

పూల రక్తము తోడ

అత్తరు అందినట్లు

తల్లి రక్తమె పాలుగా మారే చూడు


అమ్మ లేకున్న నీకు జన్మ లేదు

అవని కున్నట్టి సహనము అమ్మకుండు

సకల దేవుండ్లకు మొక్కుట కన్న

సర్వంసహ సమాన అమ్మకేను


మొక్కుటందె నీకు మోక్షమగును

మనిషి ముట్టలేని దుర్గంధ మలిన మైన

మహియె భరించు విధము తీరు

మాత అటులనె సహించె నీ మలిన భారమంత


అట్టి అమ్మను దలువు కొలువు నీవు

పుట్టి నందున ఆమె పొట్టలోన

కడుపున పడ్డదాది కలలు గనుచు

నీది రూప మెరుగ నిలిచియుండి


ఉదరమందు నుండి నీవెదను దన్నుచున్న

హృదయ ముప్పొంగి నిన్నె దలుచు నిలింప మనగ

ఆపదేదైన అమ్మ యను మాట తోడ

అంతరించును చూడు అమ్మ మహిమ


మానవత్వము నీవు మరచి పోక

పిడి బాకు చే బట్టి మెడ నరుక బూనిన

కడకు నీ చేయి నొచ్చని కక్కస పడుచుండు

అమ్మ గొప్ప తనమె సుతులకానంద డోలిక.


మరువకోయి మనిషి మరి నీ అమ్మనింక.


***


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


25 views0 comments

Comments


bottom of page