top of page

ఆయన ప్రాణం.. పూరి


'Ayana Pranam Poori' - New Telugu Story Written By Mohana Krishna Tata

'ఆయన ప్రాణం.. పూరి' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


"ఏమిటి నానమ్మ! ఎప్పుడూ.. టిఫిన్ పూరి చేస్తావు? ఈ రోజు.. మళ్ళీ పూరి చేసావు. నాకైతే.. వేడిగా దోస వెయ్యి.. ప్లీజ్" అడిగింది మనవరాలు శ్రేష్ఠ.


"ఏమిటి అత్తయ్యగారు! మీరింకా.. అదే ఆలోచిస్తున్నారా?"


"అవును కమల.. "


"ఏమిటి నానమ్మ? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?"


“అది తేలియాలంటే, నీకు మా గురించి తెలియాలి..”

"చెప్పు నానమ్మ.. వింటాను.. " అంది శ్రేష్ఠ.


“నాకు మీ తాతయ్య తో పెళ్ళయిన కొత్తలో.. ఒక విషయం తెలిసింది..”


"ఏమిటది?"


"టిఫిన్ పూరి గురించి.. "


******

"పార్వతి! ఈ రోజు టిఫిన్ లోకి పూరి చేస్తావా!?"


"ఏమైనా.. స్పెషల్ ఉందా ఈ రోజు?"

"లేదు.. నా శ్రీమతి చేతి పూరి తినాలని పించింది. అందుకే.. అడిగాను"


"అలాగే చేస్తాను.. దానికేమి అంత భాగ్యం చెప్పండి!"


అలాగ.. ఆ రోజు నేను మొదటసారి మా ఆయన కోసం పూరి చేశాను.. మీ తాతయ్య.. ఆ పూరి తిని.. ఎంతో ఆనందపడ్డారు.. నన్ను మెచ్చుకున్నారు..

అప్పటిదాకా.. పూరి అంటే ఇష్టమైన మీ తాతగారికి.. అప్పటినుంచి.. అది మహా ఫేవరెట్ అయిపోయింది.. నా చేతి పూరి తినకుండా.. ఉండలేకపోయారు.. "


పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో పూరి కూడా ఆయనకు నచ్చేది కాదు.. ఆఫీస్ కు ఎక్కువ లంచ్ కు పూరి పెట్టేదానిని. అప్పటినుంచి.. వారానికి ఒకసారైనా పూరి చెయ్యమని అడిగేవారు. పూరి తింటే.. అయన చాలా హుషారుగా ఉండేవారు..


అందరూ.. మూడ్ బాగోలేనప్పుడు మందు తాగుతారు.. లేకపోతే సిగరెట్ కాలుస్తారు.. ఇంకా కొంతమంది కాఫీ తాగుతారు.. కానీ మీ తాతగారు నా దగ్గరకు వచ్చి.. పూరి చెయ్యమనేవారు.. అది కూడా మసాలా కూర తో.. నా స్టైల్ లో.


ఒకసారి నేను అడిగాను "ఏమండి! పూరి అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? మనకు ఎన్నో రకాల టిఫిన్స్ ఉండగా.. "

"పార్వతి! నువ్వు చెప్పినది నిజమే.. మనకి ఎన్నో రకాల టిఫిన్లు ఉన్నాయి.. తొందరగా చేసేది ఉప్మా.. బలానికి ఇడ్లీ.. రుచికి దోస.. పెసరట్టు.. ఇంకా ఎన్నెనో.. దేని రుచి దానిదే.. కానీ పూరి కున్న గొప్పతనం.. ఏమిటో తెలుసా?

పూరి పొంగినట్టుగా.. నా మనసు ఉప్పొంగుతుంది.. "


******


"మరి పూరి చేసేదానివా! నానమ్మ"


"మీ తాతగారి ఇష్టం మేరకు.. అడిగినప్పుడు పూరి చేసేదానిని.. పెళ్ళిరోజైనా.. పుట్టిన రోజైనా.. పూరి టిఫిన్ ఆయనకు అమృతం.. "


ఇప్పుడు తాతగారు ఎక్కడ ఉన్నారు?

"కంట నీరు పెట్టుకుని పార్వతి.. హాస్పిటల్ లో ఉన్నారు" అని సన్నగిల్లిన స్వరంతో చెప్పింది..


"ఏమైంది తాతగారికి?" ఆత్రుతగా అడిగింది మనవరాలు


"వొంట్లో బాగోలేదు శ్రేష్ఠ.. డాక్టర్ ఆయనకు ఇష్టమైనవి తినిపించమన్నారు.. ఇష్టమైన కబుర్లు చెప్పమన్నారు.. అందుకే రోజూ.. పూరి చేస్తున్నాను"


"మరి తాతగారు పూరి తింటున్నారు కదా!.. ఇప్పుడు ఎలా ఉన్నారు"?

"నా ప్రేమంతా కలిపి.. పూరి చేసి ఆయనకు తినిపిస్తున్నాను.. నచ్చిన కబుర్లు చెబుతున్నాను. డాక్టర్ ఇప్పుడు.. కొంచం ఇంప్రూవ్మెంట్ ఉందన్నారు..”


"నేను తాతయ్యను చూడాలి.. "


"హాస్పిటల్ కు వద్దని నిన్ను తీసుకుని వెళ్ళలేదు. త్వరలో తాతగారు ఇంటికి వచ్చేస్తారు.. అప్పుడు మాట్లాడుదుగాని.."


"నానమ్మా! ఇకపై పూరి ఎప్పుడు చేసినా.. ఎన్నిసార్లు చేసినా.. నేను ఏమి అనుకోను.."


దేవుడు కరుణించాడు.. పూరి పని చూపించింది.. మా ఆయన పూర్తిగా కోలుకున్నారు..


*******************

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


41 views0 comments
bottom of page