top of page

ది కిల్లర్ - ఎపిసోడ్ 2



'The Killer Episode 2'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 09/01/2024

'ది కిల్లర్ ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కాంతం అండ్ సుబ్బారావు.. ఇద్దరిది చాలా అన్యోన్యమైన జంట.. పెళ్లై, ఇన్ని సంవత్సరాలైనా, ఎప్పుడు గొడవ పడింది లేదు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత మంచి ఇల్లు కట్టుకుని, దానికి 'అంకితా నిలయం' అని కూతురి పేరు పెట్టుకున్నారు. రత్నాల్లాంటి పిల్లలు.. అంకిత, ఆనంద్ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాడు. 


ఒక రోజు టీవీ లో బ్రేకింగ్ న్యూస్ లో ఒక అమ్మాయి హత్య గురించి వస్తుంది. దాని గురించి భార్యా భర్తల మధ్య డిస్కషన్ జరుగుతుంది. తర్వాత పిల్లల గురించి మాట్లాడుకుంటారు ఇద్దరు. 


ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 2 చదవండి.. 



మర్నాడు టీవీ లో ఇంకొక బ్రేకింగ్ న్యూస్! ఇంకొక అమ్మాయి దారుణ హత్య.. హత్య చేయబడింది వేరే రాష్ట్రంలో. అమ్మాయిని గుర్తుపట్టలేని విధంగా చంపారు. 


"కాంతం! ఇంకొక అమ్మాయిని చంపేసారే పాపం!.. ఈ సారి స్టేట్ మారిందంతే.. మిగిలింది అంతా ఒక్కటే!"


"ఎవరో.. ఆ అమ్మాయి తెలిసిందా.. ?"

"ఎవరో.. తమిళనాడు లో ఉంటున్న అమ్మాయి. ఏమిటో ఈ హత్యలు! పోలీసులు ఏం చేస్తున్నారో.. ఈ మీడియా ఇలా పీకి పారేస్తుంటే.. "


"ఆ మీడియా అంతే లెండి.., అలా చెప్పిందే చెబుతారు.. కానీ, ఆ హంతకుడు ఎవరో.. తొందరగా పట్టుకుని ఉరి తీసేయాలి.. "

***


"మన పోలీస్ స్టేషన్ ముందు మీడియా ఉంది. ఇప్పుడు మనం ఏమని చెప్పాలి చెప్పండి.. ! అని అడిగాడు పెద్ద మీటింగ్ లో పెద్ద ఇన్స్పెక్టర్ సార్. “హత్య గురించి.. దాని డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేసారా.. ?.. "


"చేసాం సర్! రెండు హత్యలు ఒకేలాగా జరిగాయి. మొదటిది ఇక్కడే హైదరాబాద్ లో జరిగింది.. అమ్మాయి వయసు.. పాతిక లోపే. రెండో అమ్మాయి తమిళనాడు లో ఉంటోంది.. అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఆమె కీ పాతిక లోపే ఉంటాయి.. ఇద్దరు అమ్మాయిల వివరాలు ఇంకా తెలియలేదు సర్!"


"ఎందుకు?.. ఈ ఆలస్యం.. "


"ఇద్దరి అమ్మాయిల ముఖం పచ్చడి చేసి పడేసారు.. గుర్తు పట్టకుండా.. "


"ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఇచ్చారా?"


"లేదు సర్.. ?"


"హత్యలలో ఇంకా ఏమైనా.. కొత్త విషయాలు తెలిసాయా?"


"ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సర్! ఈ కేసు ను ఇన్స్పెక్టర్ రామ్ చూసుకుంటున్నారు.. అతనైతే మీకు ఇంకా బాగా చెప్తాడు.. "


“తొందరగా కనుక్కోండి.. ఆ కిల్లర్ మోటివ్ ఏమిటో మనకి తెలియదు.. నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలియదు.. పై నుంచి చాలా మాటలు పడాల్సి వస్తుంది.. అర్ధంచేసుకోండి. రేపు మళ్ళీ ఇక్కడే మీటింగ్ లో కలుద్దాం. ఇన్స్పెక్టర్ రామ్ ఖచ్చితంగా ఉండాలి..” 


"ఓకే సర్.. "

***


"కాంతం! నేను అలా మార్కెట్ వరకు వెళ్ళి వస్తాను.. తలుపు వేసుకో.. ఇంట్లో జాగ్రత్త! అసలే రోజులు బాగోలేవు.. ఎవడు ఎప్పుడు వచ్చి చంపేస్తాడో తెలియట్లేదు.. "


"అలాగే లెండి.. మీరు జాగ్రత్తగా వెళ్లి రండి !"


సుబ్బారావు మార్కెట్ కు వెళ్ళినా.. అక్కడంతా.. ఈ హత్యల గురించే మాటలు. మార్కెట్ అంతా ఇదే పెద్ద డిస్కషన్. ఇంటికి తిరిగొచ్చిన సుబ్బారావు.. 


"అంతా ఈ హత్యల గురించే మాటలు. ఇంతవరకు.. అందరూ అమ్మాయిలే హత్య చేయబడ్డారనీ.. అమ్మాయిలు చాలా జాగ్రతగా ఉండాలని.. ఒకటే గోల అంతా. ఇంతకీ మన అమ్మాయి ఎక్కడ కాంతం? దానిని బయటకు పంపకు. రేపటి నుంచి నేనే కాలేజీ కు డ్రాప్ చేస్తాను. ఆ వెర్రి పిల్ల నిద్ర లేచిందా.. ?"


"ఇంకా నిద్ర లేవలేదండి.. లేచే టైం కావొస్తోంది.. " 


"కాలేజీ మధ్యాహ్నం కాదు గానీ, ఉదయం లేట్ గా లేవడం అలవాటు అయిపోయింది. జంక్ ఫుడ్ తినడము, మాట వినకపోవడం.. మంచి లక్షణాలన్నీ వచ్చాయి ఈ పిల్ల కి!"


"ఎందుకండీ అలా అంటారు? పెళ్ళైతే అదే అన్నీ తెలుసుకుంటుంది లెండి!"


"ఏమో గానీ.. అసలే మన పిల్ల చాలా అమాయకురాలు.. ఎక్కడికి ఒంటరి గా పంపించకు.. మళ్ళీ చెబుతున్నాను.. "


"సరే.. సరే.. !"




పోలీస్ స్టేషన్ లో మర్నాడు మళ్ళీ అందరు పోలీస్ లు హాజరయ్యారు. 


"నాకు ఈ హత్యల సంబంధించి పూర్తీ ఇన్ఫర్మేషన్ కావాలి ఇన్స్పెక్టర్ రామ్.. "


"అలాగే సర్! నేను ఇన్వెస్టిగేషన్ చేసిన డీటెయిల్స్ అన్నీ చెబుతాను.. నా మీద నమ్మకం ఉంచి ఈ కేసు నాకు స్పెషల్ గా అసైన్ చేసినందుకు ముందుగా నా థాంక్స్ సర్! మీ నమ్మకాన్ని నిలబెడతాను.. 


ఇప్పటివరకు ఇద్దరు అమ్మాయిలు హత్య కు గురయ్యారు. ఇద్దరి వయసు పాతిక లోపే. ఈ అమ్మాయిలు వేరే వేరే ప్రదేశాలలో హత్య చేయబడ్డారు. వాళ్ళ ముఖాలు గుర్తు పట్టలేనంతగా పచ్చడి చేసి చంపారు సర్! చూస్తుంటే, ఇది ఏ శాడిస్ట్ చేసిన పని లాగ అనిపిస్తుంది. ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఏమిటంటే.. ఈ అమ్మాయిలకు ఇంకా పెళ్ళిళ్ళు అవలేదు. అందరిని ఒకే లాగ చంపారు. చూస్తుంటే, ఎంతో కసి తో చంపినట్టు గా ఉంది. పాత పగ గాని, ఇంకేమైనా అలాంటి కారణం ఉండి ఉండొచ్చని అనుమానం. బాడీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత.. చాలా డీటెయిల్స్ తెలుస్తాయి.. 


మొదటి అమ్మాయి ని హైదరాబాద్ లో చంపారు. రెండో అమ్మాయి తమిళనాడు లో ఘోరంగా హత్య చేసారు. ఈ ఇద్దరి అమ్మాయిలకు ఏమైనా రిలేషన్ ఉందా అనేది కుడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం”. 


“ఓకే.. ఇంక ఒక్క ప్రాణం కుడా పోవడానికి వీలు లేదు.. ఇన్స్పెక్టర్ రామ్ నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను”. 


మర్నాడు.. బెంగుళూరు లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అమ్మాయి.. రాత్రి ఆఫీస్ నుంచి వస్తుంటే, ఒక ముసుగు మనిషి వెంబడించి.. వెంబడించి.. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి.. పెట్రోల్ పోసి.. నిప్పు పెట్టి పారిపోయాడు. అమ్మాయి ఎంత అరిచినా.. చుట్టూ పక్కల ఎవరు లేకపోవడం తో.. అమ్మాయి ని కాపాడలేకపోయారు. చాలా సేపటికి పోలీస్ లు స్పాట్ కు వచ్చి.. అమ్మాయిని హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు.. కానీ అప్పటికే అమ్మాయి చనిపోయింది. 


చాలా దూరంగా ఉన్న సీసీటీవీ కెమెరా లో ఆ దృశ్యం అంతా రికార్డు అయ్యింది. బెంగుళూరు నుంచి అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు రామ్. వెంటనే అక్కడకు వెళ్లి.. అమ్మాయిని గుర్తించాడు. ఈ అమ్మాయి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా పని చేస్తుంది. 


రామ్ ఈ కేసు ని ఇంకా సీరియస్ గా తీసుకన్నాడు. ఇన్వెస్టిగేషన్ సీరియస్ గా చెయ్యడం కోసం, వెంటనే చాలా కాల్స్ చేసాడు, కాని ఫోన్ ఎవరు లిఫ్ట్ చెయ్యట్లేదు. వెంటనే బయల్దేరి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ రామ్. దారిలో వర్షం కారణంగా జీప్ మట్టిలో కూరుకు పోయింది. ఏం చెయ్యాలో అర్ధం కాక.. అక్కడ దూరంగా ఉన్న వారిని పిలిచి సాయం చెయ్యమని అడిగాడు. 


ఒక నలుగురు వచ్చి, జీప్ ని మట్టి లోంచి బయటకు తీసారు. ఇదంతా పక్కన ఉన్న చెట్టు పక్క నుంచి ఆ ముసుగు మనిషి చూస్తున్నట్టు చూసాడు రామ్. ముసుగు మనిషి దూరం నుంచి గన్ తో షూట్ చెయ్యడానికి చూడగా.. రామ్ తప్పించుకున్నాడు. అదే ముసుగు మనిషి ని సీసీటీవీ లో చూసాడు రామ్. వెంటనే వెంబడించాడు.. కాని ఫలితం లేదు. వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి.. అలెర్ట్ చేసాడు. 


జీప్ మట్టి లోంచి బయటకు రావడం తో.. మళ్ళీ తన గమ్యం వైపు బయల్దేరాడు. 

***


ఇక్కడ సుబ్బారావు ఇంట్లో.. సుబ్బారావు ఉదయాన్నే టీవీ ఆన్ చేసాడు. షరా మాములే! బ్రేకింగ్ న్యూస్ లో బెంగుళూరు హత్య! ఒక అమ్మాయిని హత్య చేసారు. దారుణంగా పెట్రోల్ పోసి చంపేశారు. మీకోసమే, ఇప్పుడు సీసీటీవీ లో రికార్డు అయిన లైవ్ షో. ఇంకో.. ఐదు నిమిషాలలో.. స్టే ట్యూన్డ్!


"ఒసేయ్ కాంతం! తొందరగా రావే.. హత్య టెలికాస్ట్ అంటా.. ఇప్పుడైనా చూడవే.. "


"వస్తున్నా!ఆ సచ్చినోడు దొరికాడా.. ?"


"చూపిస్తారంట.. చూడు.. "


"అదేంటండి.. ఆ ముసుగు మనిషి.. అలా చంపేస్తున్నాడు ఆ అమ్మాయిని.. పాపం.. ఆ సచ్చినోడికి ఉరి శిక్ష వెయ్యాలి.. "


"పోలీసులు ఇంకా పట్టుకోలేదే.. ఇంకా దొరకలేదు వాడు.. "

***

రామ్ చాలా పట్టుదల మనిషి. ఎలాగైనా, తనే ఈ కేసు సాల్వ్ చేసి క్రెడిట్ అంతా కొట్టేయ్యాలని.. ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒంటరిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. రామ్ తను అనుకున్న.. గమ్యానికి చేరుకున్నాడు.. ఆ అమ్మాయి పని చేస్తున్న ఆఫీస్ లో ఎంక్వయిరీ మొదలెట్టాడు. అమ్మాయి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాడు. తన తండ్రి ఒక కంపెనీ హెడ్ నాయక్. నాయక్ ఫోన్ కి ఎన్ని సార్లు ట్రై చేసినా ఫలితం లేదు. అడ్రస్ పట్టుకుని బయల్దేరాడు. అక్కడ బెల్ రింగ్ చెయ్యగానే, పని వాడు డోర్ ఓపెన్ చేసాడు. 


"ఇక్కడ నాయక్ గారు ఉన్నారా?"


"అవునా అయ్యగారే.. కానీ చాలా రోజుల నుంచి ఇంటికి రాలేదు. పని మీద మేడం తో కలిసి కేరళ వెళ్లారు. "


"ఎప్పుడు వస్తారు?"


"తెలియదు.. "


"అక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా.. ఇంకో నెంబర్ ఏమైనా.. ?"


"ఇది మేడం గారి నెంబర్, ఇది ఎవరికీ ఇవ్వరు.. మీరు పోలీస్ అంటున్నారు కాబట్టి.. ఇస్తున్నాను"


రామ్ ఈ కేసు క్రెడిట్ అంతా.. తనకే రావాలని ఈ కేసు కోసం తనే కేరళ వెళ్ళాలని బయల్దేరాడు. దారిలో పనివాడు ఇచ్చిన నెంబర్ కు కాల్ చేసాడు.. కాని స్విచ్ ఆఫ్ వస్తోంది. 


మొత్తం మీద కేరళ చేరుకున్న.. రామ్ కు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.. 


=====================================================================

ఇంకా వుంది.. 

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ






78 views0 comments

Comments


bottom of page