top of page

ది కిల్లర్ - ఎపిసోడ్ 1

తాత మోహనకృష్ణ గారి కొత్త ధారావాహిక ప్రారంభం


'The Killer Episode 1'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 04/01/2024

'ది కిల్లర్ ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే.. సుబ్బారావు కు టీవీ పెట్టడం అలవాటు.. ఆ రోజు టీవీ పెట్టగానే, వెంటనే బ్రేకింగ్ న్యూస్.. 


"ఊరి చివర ఒక అమ్మాయి దారుణ హత్య!.. " అని న్యూస్ వస్తోంది.. 


"టీవీ పెడితే చాలు ఇలాంటి వార్తలే.. మళ్ళీ క్రైమ్ న్యూస్ అని ఒక కాలమ్ ఒకటీ.. ! అయినా హత్యలు బ్రేకింగ్ న్యూస్ ఏమిటో.. ?" మెల్లగా అన్నాడు సుబ్బారావు.

 

"ఏమిటండీ! ఏదో అంటున్నారు?"


"లోకం లో జరుగుతున్నవి చూస్తుంటే.. మతి పోతున్నాదనుకో కాంతం !"


"ఇప్పుడు ఏమైందండీ.. ?"


"టీవీ చూడమంటే చూడవు! అంత పెద్ద టీవీ కొని గోడకు తగిలించింది ఎందుకు మరి!"


"నాకు ఇంట్లో చాలా పని ఉంది.. మీరు ఉన్నారు కదా.. చూసి చెప్పడానికి.. "


"సరే లే కాంతం.. అయితే విను.. ఎవరో ఒక అమ్మాయిని ఊరి చివర.. దారుణంగా హత్య చేసారు.. అమ్మాయికి నిండా పాతిక సంవత్సరాలు కూడా లేవు.. శవం గుర్తుపట్టడానికి లేకుండా హత్య చేసారంటా.. అమ్మాయంటే గుర్తొచ్చింది.. మన అమ్మాయి అంకిత ఎక్కడ?" అడిగాడు సుబ్బారావు.


"ఇంకా నిద్ర లేవలేదు.. టైం ఎంత ఇప్పుడు?"


"ఏడు కావొస్తుంది.. కాంతం.. "


"మీ అమ్మాయి లేచేది తొమ్మిదికి కదా!"


"మన అబ్బాయి ఆనంద్ నిద్ర లేచాడా?"


"వాడు ఎప్పుడో లేచి.. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళిపోయాడు"


"అందుకే అన్నారేమో.. మగాడు తిరగక చెడ్డాడు.. ఆడది తిరిగి చెడుతుందని.. "


"సామెతలు తర్వాత గాని.. ముందు స్నానం కానివ్వండి.. ఆ టీవీ లో న్యూస్ ఎప్పుడు అలా వస్తూనే వుంటుంది.. ఆ హత్య ని అలా రోజంతా చూపిస్తూనే ఉంటాడు.. "


కాంతం అండ్ సుబ్బారావు లది చాలా అన్యోన్యమైన జంట.. పెళ్లై, ఇన్ని సంవత్సరాలైనా, ఎప్పుడు గొడవ పడింది లేదు.. పుట్టింటి వారు లేని లోటు ఎరుగదు కాంతం.. వారిది ప్రేమ వివాహం.. అప్పట్లో పెళ్ళికి కాంతం అమ్మ, నాన్న, అన్నయ ఎవరు ఒప్పుకోలేదు.. పెళ్ళి తర్వాత నుంచి వాళ్ళకు మాటలు లేవు.. సుబ్బారావుకు ఉన్న ఒక్క బావమరిది తేజ కు చాలా కోపం.. లేని వ్యసనం అంటూ లేదు.. సుబ్బారావు ఫ్యామిలీ పైన ఎప్పుడు చాలా కోపంగా ఉండేవాడు.. అక్క ప్రేమ పెళ్ళి చేసుకుందని ఎప్పుడూ కోపమే.. 


సుబ్బారావు చాలా హుషారు గా ఉంటాడు.. పెళ్ళైన కొత్తలో, పెళ్ళాన్ని తీసుకుని, రోజుకొక సినిమా.. వారానికి ఒక టూర్ తో ఎప్పుడూ సందడిగా, సరదాగా సాగేది వారి జీవితం.. చేసేది ఒక ప్రైవేటు ఉద్యోగమే ఐనా.. చాలా సిన్సియర్ గా, టైం కు ఎప్పుడు ఆఫీస్ కు వెళ్ళేవాడు.. ఆఫీస్ లో ఒక్క బ్యాడ్ రిమార్క్ కుడా లేదు.. ఎప్పటి వర్క్ అప్పుడే కంప్లీట్ చేసేవాడు.. 


కాంతం.. తన జీవితం లోకి వచ్చిన తర్వాత.. చాలా కలిసి వచ్చిందని, ఎప్పుడు అనేవాడు సుబ్బారావు.. ప్రమోషన్ వచ్చింది.. మంచి ఇల్లు దగ్గరుండి కట్టించుకున్నాడు.. రెండు అంతస్తుల భవనం అది.. దానికి 'అంకితా నిలయం' అని కూతురి పేరు పెట్టుకున్నాడు.. రత్నాల్లాంటి పిల్లలు.. అంకిత, ఆనంద్ అని అందరికీ గర్వంగా చెప్పుకునేవాడు.. 


అంకిత కాలేజీ లో బుద్దిగా చదువుకునే తెలివైన అమ్మాయి.. చదువునే కాదు, లైఫ్ ని కుడా ఈజీ గా తీసుకునే మనస్తత్వం.. ఆడపిల్ల అంటే ఏ తండ్రి కైనా ఎక్కువ ప్రేమే ఉంటుంది.. అలాగే సుబ్బారావు కు అంకిత అంటే ప్రేమ ఎక్కువే.. బయటకు ఎలా ఉన్నా, లోపల ఎప్పుడు కూతురిని సపోర్ట్ చేస్తునే వుంటాడు.. కొడుకు ఆనంద్ కాలేజీ లో చదువుతూ.. ఫ్రెండ్స్ తో తిరిగే మాములు స్టూడెంట్.. కొంచం ధైర్యం ఎక్కువ.. 



కాంతం ఇంటి పని చెయ్యడంలో అందె వేసిన చెయ్యి.. ఏ పనైనా చెయ్యడంలో చాలా ఫాస్ట్.. వంటైతే, ఇక చెప్పక్కర్లేదు.. ఎప్పుడు ఇంటి నిండా ఎవరో చుట్టాలే.. అందరికి వండి వార్చడం లో ఎప్పుడు బాధ పడలేదు కాంతం.. 


***


సుబ్బారావు ఆఫీస్ లో పనిచేసిన తీరు చూసి అతని బాస్ చాలా ఇంప్రెస్ అయ్యాడు.. వేరే బ్రాంచ్ లో వర్క్ చాలా పెండింగ్ ఉందని కంప్లైంట్స్ రావడం తో సుబ్బారావు ను పిలిచి అడిగాడు బాస్.. 


"మన వేరే బ్రాంచ్ లో పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి.. అక్కడ వారికి నీలాంటి స్టాఫ్ హెల్ప్ కావాలని అక్కడ మేనేజర్ నన్ను రిక్వెస్ట్ చేసారు.. నువ్వు కంపెనీ కోసం ఈ హెల్ప్ చెయ్యాలి.. నీకూ ఇంక్రిమెంట్ వస్తుంది.. ప్రమోషన్ కోసం కుడా సిఫార్సు చేస్తాను.. ప్రమోషన్ కోసం నీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది సుబ్బారావు.. నీ లైఫ్ కి ఇది మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో.. "


"మీరు ఇంతలాగ చెప్పాలా సర్!ఆర్డర్ వెయ్యండి.. పని కంప్లీట్ చేస్తాను.. "


"నాకు తెలుసు నువ్వు నా మాట కాదనవని.. అందుకే ఆల్రెడీ నీ పేరు పంపించేసాను.. నెక్స్ట్ వీక్ నువ్వు అక్కడికి వెళ్ళాలి.. నీ మొత్తం క్యాంపు అక్కడ ఒక నెల రోజులు.. అక్కడ పని కంప్లీట్ చేసుకుని మన కంపెనీ కి మంచి పేరు తీసుకురావాలి సుబ్బారావు"


"అలాగే సర్"


మర్నాడు సుబ్బారావు క్యాంపు పనిమీద వేరే ఊరికి ఒక నెల రోజులు కోసం బయల్దేరాడు.. ఒక పూట బస్సు ప్రయాణం చెయ్యాలి.. బస్సు లో ఉంటుండగా, సుబ్బారావు కు మంచి కల వచ్చింది.. తనకు అక్కడ ఒక అమ్మాయి పరిచయమైనట్టు.. ఆమె తో ప్రేమ, పెళ్ళి అన్నీ కనిపించాయి.. బస్సు మెల్లగా ఊరు దాటుకుంటూ.. చేరాల్సిన చోటుకి చేరింది.. 


అక్కడ ఆఫీస్ లో ఛార్జ్ తీసుకున్నాడు సుబ్బారావు.. అక్కడ ఆఫీస్ లో విషయాలు అన్నీ తెలుసుకున్నాడు.. అక్కడ ఉన్న పెండింగ్ వర్క్స్ తెలుసుకుని.. మొదటి వారమంతా బిజీ గా గడిచింది.. ఒక రోజు సండే, కాంతాన్ని అక్కడ మార్కెట్ లో చూసాడు సుబ్బారావు.. మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు.. నెల రోజుల క్యాంపు ముగిసే లోపు ఎలాగైనా 'ఐ లవ్ యు' చెప్పాలని అనుకున్నాడు మన హీరో.. దానికోసం, చెయ్యని ప్రయత్నం లేదు.. సినిమా లో హీరో పడిన అన్ని కష్టాలు పడ్డాడు.. ఎంతో డబ్బు ఖర్చు చేసాడు.. చివరకు సాధించాడు.. కాంతం తండ్రి.. చాలా స్ట్రిక్ట్.. ప్రేమ పెళ్ళి మీద అంత నమ్మకం లేదు.. తండ్రి జాడ లోనే ఫ్యామిలీ అంతా కుడా ఉండేవారు.. 


ప్రతిరోజూ సాయంత్రం సుబ్బారావు పార్క్ లో కాంతాన్ని కలిసేవాడు.. ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగి, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు.. ఒక సారి, సుబ్బారావు ను పార్క్ లో కలిసిన కాంతం.. 


"సుబ్బు! మా ఇంట్లో మన పెళ్ళి కి ఒప్పుకోరు.. అసలే మా నాన్న కు ప్రేమ పెళ్ళంటే ఇష్టం లేదు.. దీనికి నువ్వు ఏదైనా చెయ్యి.. నేను నువ్వు లేకుండా ఉండలేను.. ! నీతో నా జీవితం చాలా గొప్పగా ఉహించుకున్నాను.. తొందరలో నాకు పెళ్ళి చెయ్యాలని ఇంట్లో అనుకుంటున్నారు.. "


"ఏం చెయ్యమంటావు చెప్పు! మీ నాన్న ను ఒప్పించి నిన్ను పెళ్ళి చేసుకునే అవకాశం లేదు.. నువ్వు నాతో వచ్చెయ్.. నిన్ను బాగా చూసుకుంటాను.. నా మీద నమ్మకం ఉంటే, రేపు సాయంత్రం నేను క్యాంపు ముగించుకుని వెళ్ళిపోతున్నాను.. బాగా ఆలోచించుకుని, రేపు ప్రిపేర్ అయ్యి బస్సు స్టేషన్ కి వస్తే, అక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంటాను.. "


కాంతం వస్తుందా? లేదా? అని మనసులో చాలా టెన్షన్ పడ్డాడు సుబ్బారావు.. బస్సు ఇంకో ఐదు నిమిషాలలో బయల్దేరుతుందనగా.. పరిగెత్తుకుంటూ వచ్చింది కాంతం.. కాంతాన్ని బస్సు లో కి ఆహ్వానించి.. తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి, కాంతాన్ని తన జీవితం లోకి ఆహ్వానించాడు సుబ్బారావు.. 


***


"అమ్మా! కాఫీ!" అని గదిలోంచి కళ్ళు నులుపుకుంటూ హాల్ లోకి వచ్చింది అమ్మాయి అంకిత.. 


"చూడండి! మీ గారాబం వల్లే.. ఇది ఇలా తయారైంది.. సెలవోస్తే చాలు, లేట్ గా నిద్ర లేవడం.. ఇంట్లో ఒక పని సాయం చెయ్యడం లేదు.. ఎప్పుడు.. ఆ ఫోన్.. సినిమాలే లోకం.. ఆ డిగ్రీ కాస్తా అయిపోతే.. పెళ్ళి చేసేయండి.. అప్పుడైనా బాధ్యత తెలుస్తుంది"


"జనరేషన్ అలాంటిదే మరి.. రాత్రి వరకు.. సినిమాలు చూడడం.. లేట్ గా లేవడం.. ఏం చేస్తాం చెప్పు?”


"మీరు వెనుకేసుకు రాకండి.. !"


"ఊరుకో కాంతం! నువ్వు అలా కోపంగా ఉంటే, అసలు బాగుండదు.. కొంచం నవ్వరాదే.. !"


"ఈ సరసానికి ఏమి తక్కువ లేదు.. అయ్యగారికి.. అంటూ మూతి విరిచింది కాంతం"


"అమ్మా! నాకు టిఫిన్ పెట్టవే.. " అడిగాడు ఆనంద్.

"ఇదిగోండి.. వచ్చాడు మీ వంశోద్ధారకుడు!.. ఫ్రెండ్స్ తో ఊరంతా తిరగడం.. తర్వాత టిఫిన్, భోజనం అంటూ ఇలా ఇంటికి రావడం.. " అంది కాంతం.


"ఇంకెంత చెప్పు.. ! ఆ ఉద్యోగం వచ్చిందనుకో.. నువ్వు ఉండమన్నా.. ఇక్కడ ఉండడు వాడు.. ఎంజాయ్ చెయ్యని.. ఇప్పుడైనా.. " అన్నాడు సుబ్బారావు.


=====================================================================

ఇంకా వుంది.. 

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

97 views0 comments

Comments


bottom of page