'The Killer Episode 4' - New Telugu Web Series Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 25/01/2024
'ది కిల్లర్ ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కాంతం అండ్ సుబ్బారావు.. ఇద్దరిది చాలా అన్యోన్యమైన జంట. పెళ్ళి తర్వాత కలిసి వచ్చి.. మంచి ఇల్లు కట్టుకుని, దానికి 'అంకితా నిలయం' అని కూతురి పేరు పెట్టుకున్నాడు. రత్నాల్లాంటి పిల్లలు.. అంకిత, ఆనంద్ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాడు.
వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఇన్స్పెక్టర్ రామ్ హత్యల గురించి చెబుతాడు. మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగుళూరు లో హత్య చేస్తారు. సీసీ టీవీ లో రికార్డు అవుతుంది. రామ్ ఈ కేసు ని ఇంకా సీరియస్ గా తీసుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ కోసం, వెళ్తున్న రామ్ ను ముసుగు మనిషి షూట్ చెయ్యడానికి చూస్తాడు. నాయక్ ఇంటికి వెళ్ళి.. అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని.. కేరళ వెళ్ళారని తెలిసి.. నాయక్ ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్..
సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది.
కేరళ చేరిన రామ్ కు తన ప్రియురాలు రాణి, తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి. ట్రిప్ కి బయల్దేరిన తల్లి దండ్రుల తో సహా రాణి ఆక్సిడెంట్ గురి అయ్యి చనిపోతుంది. రాణి కోరుకున్నట్టే పోలీస్ అవుతాడు రామ్.
ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 4 చదవండి..
రామ్ కు గతం గుర్తుకొచ్చి.. ఆగని కన్నీటిని తుడుచుకుని.. ముందుకు సాగాడు.
రామ్ కేరళ లో నాయక్ ను కలవడానికి హాస్పిటల్ కు వెళ్ళాడు. అది ఒక ఫేమస్ మల్టీ స్పెషాలిటి హాస్పిటల్. రామ్ కు కేరళ అంతా కొట్టిన పిండి కావడం చేత అడ్రస్ దొరకడం పెద్ద కష్టం కాలేదు.
నాయక్ ఉన్న హాస్పిటల్ కు వెళ్లి.. అక్కడ రిసెప్షన్ లో ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అక్కడకు వెళ్ళాడు. దాని కన్నా ముందు డాక్టర్ ను కలుద్దామని అనుకుని, అక్కడ డాక్టర్ ఛాంబర్ లోకి వెళ్ళాడు.
"హలో డాక్టర్! నమస్తే! ఐ యాం ఇన్స్పెక్టర్ రామ్.. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. మీకు తెలిసే ఉంటుంది.. సీరియల్ హత్యల గురించి.. "
"'ఎస్'.. తెలుసు.. "
"ఆ విషయమై నాయక్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలి. అయన ఇక్కడే ఈ హాస్పిటల్ లోనే, ఉన్నారని తెలిసింది. ఇప్పుడు ఆయనకు ఎలా ఉంది డాక్టర్?.. "
"నాయక్ గారు మా హాస్పిటల్ లోనే, చాలా రోజులుగా ఉన్నారు. నిన్ననే కోమా లోంచి బయటకు వచ్చారు.. "
"ఇంతకీ ఆయనకు ఏమైంది డాక్టర్?"
"నాకు డీటెయిల్స్ అంతగా తెలియవు. తెలిసింది చెబుతాను. నాయక్.. అతని భార్య సీమా చాలా రోజులు కిందట కేరళ లో ఒక బిజినెస్ పని మీద వచ్చారు. మాములుగానే, ఆయన చాలా బిజీ మనిషి. ఒక రోజు.. వాళ్ళ కార్ ఒక వ్యాన్ ని ఓవర్ టేక్ చెయ్యబోయి.. ఆక్సిడెంట్ కి గురైంది. ఎదురుగా ఉన్న చెట్టుకు బలంగా గుద్దడం వల్ల.. తీవ్రంగా గాయపడ్డ నాయక్.. అతని భార్య ని హాస్పిటల్ కు తీసుక్కొచ్చారు.
వచ్చినప్పుడు ఇద్దరికీ తలకు గాయాలతో.. బాగా రక్తం పోయింది.. మేము చాలా ప్రయత్నించాము.. కానీ ఇద్దరు కోమా లోకి వెళ్లారు. అలా, చాలా రోజులు కోమా లో ఉన్న ఇద్దరు.. నిన్న రాత్రి సీమా గారు కోమా లోంచి బయటకు వచ్చారు.. "
"వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా?.. "
"ఇప్పటివరకు.. ఎవరు రాలేదు. ఆఫీస్ నుంచి గాని, ఇంటి నుంచి గాని, ఎటువంటి రెస్పాన్స్ లేదు. నాయక్ భార్య సీమ గారిని అడిగి చూడండి.. ఆవిడ కు స్పృహ రెండు రోజుల కిందటే వచ్చింది. ఆవిడ ఇప్పుడు బెటర్ గానే ఉన్నారు.. "
“ఓకే డాక్టర్ ఆమె ను కలుస్తాను..”
"హలో ఇన్స్పెక్టర్! నన్ను కలవాలి అని వచ్చారంట.. లోపలికి రండి.. "
"'ఎస్' మేడం.. సారీ టు సే.. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం అడిగి తెలుసుకుందామని వచ్చాను. మీ అమ్మాయి ని హత్య చేసారు.. "
"వాట్! మా అమ్మాయి హత్య.. ఏమిటి మాట్లాడుతున్నారు? నిన్న నేను కోమా లోంచి వచ్చిన తర్వాత.. మా అమ్మాయితో మాట్లాడాను.. "
"మీకు ఎంత మంది పిల్లలు మేడం.. తెలుసుకోవచ్చా?"
"మాకు ఒకే అమ్మాయి.. కోల్‌కాతా లో చదువుకుంటుంది.. హ్యాపీ గానే ఉంది. ఏమైనా ప్రాబ్లమా ఇన్స్పెక్టర్?"
రామ్ కు ఏమి అర్ధం కాలేదు.. వెంటనే.. హత్య చేయపడ్డ అమ్మాయి.. ఫోటో ను చూపించాడు..
"ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నాయక్ కి నాకు పెళ్ళైన తర్వాత.. చాలా సంవత్సరాల తర్వాత మాకు పాప పుట్టింది. అ తర్వాత, పిల్లలు కంటే, నాకు ప్రాబ్లం అంటే, ఇంక వద్దనుకున్నాము"
"హత్య అంటున్నారు? ఏమిటో తెలుసుకోవచ్చా?"
"ఇప్పుడెందుకు మేడం.. మీరు హాస్పిటల్ లో ఉన్నారు కదా.. రెస్ట్ తీసుకోండి.. "
"పర్వాలేదు.. చెప్పండి.. "
"ఒక సీరియల్ కిల్లర్ కోసం గాలిస్తున్నాము. ఇప్పటి వరకు.. చాలా హత్యలు చేసాడు. అందరిని చాలా దారుణంగా చంపాడు. ఇప్పటివరకు అందరూ అమ్మాయిలే చంపబడ్డారు. ఆఖరు చనిపోయిన అమ్మాయి మీకేమైనా తెలుసేమో నని అడిగాను.. "
"ఇట్స్ ఓకే.. "
"ఓకే మేడం.. నేను నాయక్ గారిని కలవాలి.. "
"ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు.. నిన్న కోమా లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నారు.. రేపు కలవొచ్చు.. "
"ఓకే మేడం.. రేపు కలుస్తాను.. "
ఈలోపు హైదరాబాద్ నుంచి ముసుగు మనిషి స్కెచ్ వచ్చింది.. దానిని చాలా నిశితంగా పరిశీలించగా.. ఒక యువకుని స్కెచ్ అది. ఒక పాతిక సంవత్సరాలు ఉంటాయి. ఇంత చిన్న వయసులో.. ఇలా సీరియల్ కిల్లర్ అవడానికి గల కారణము ఏమిటో? అనుకున్నాడు రామ్.. ఈ స్కెచ్ ని అన్నీ పోలీస్ స్టేషన్ లకు పంపించి అన్ని చోట్ల గాలించడం మొదలు పెట్టారు.
***
ఇక్కడ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కు.. కంగారుపడుతూ సుబ్బారావు వచ్చాడు..
"సర్! మా అమ్మాయి నిన్న అనగా కాలేజీ కు వెళ్ళింది.. ఇప్పటివరకు ఇంటికి రాలేదు.. "
"పేరు ఏమిటి?"
"అంకిత.. "
"వయసు.. డీటెయిల్స్ చెప్పండి.. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా?"
"లేదు సర్! ఒక నల్లటి వ్యాన్ లో ఆఖరుగా వెళ్లిందని అక్కడ చూసిన వారు చెప్పారు.. కంగారుగా ఉంది సర్.. అసలే రోజులు బాగోలేవు"
"కంగారు పడకండి సర్! ఏమీ జరగదు.. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి"
ఇంటికొచ్చిన సుబ్బారావు ని చూసి.. భార్య కాంతం ఆత్రంగా "ఏమండీ! అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా?"
“పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. కాలేజీ అంతా అడిగి చూసాను. ఫ్రెండ్స్ అంతా తెలియదని చెబుతున్నారు. నల్లటి వ్యాన్ లో కాలేజీ కు వెళ్లిందని ఎవరో చెప్పారు”.
"ఇదంతా ఆ మావయ్య పనే నాన్నా!.. ఎప్పుడు మనల్ని ఎలా దెబ్బ తియ్యాలో చూస్తూ ఉంటాడు.. "
"అల్లా మాట్లాడుకు రా.. మా తమ్ముడు అలాంటివాడు కాదు.. "
"నీ తమ్ముడంటే, నీకు ప్రేమే గానీ.. అక్కడ అంత లేదు అమ్మా!.. రెండు తగిలిస్తే.. చెబుతాడు.. " అని కోపంతో ఊగిపోయాడు ఆనంద్
"అమ్మాయి లేక ఇల్లంతా సందడి లేదండి.. ఎక్కడుందో.. ఏం చేస్తుందో?.. "
"ఏం చెయ్యమంటావు కాంతం.. ఆ రోజు నేను కాలేజీ కి వెళ్లుంటే, ఈ సమస్య వచ్చేదే కాదు.. "
"బాధపడకండి.. మీకు అసలే వొంట్లో బాగోలేదు.. ఏదైనా తినండి. టీవీ లో ఎప్పుడు ఏ బ్రేకింగ్ న్యూస్ వస్తుందో అని భయపడితే ఎలా? చెప్పండి.. అమ్మాయి ఎక్కడున్నా, బాగానే ఉంటుంది లెండి.. దానికి ఏమీ కాదు.. "
=====================================================================
ఇంకా వుంది..
=====================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments