'Thelivaina Voter' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 03/11/2023
'తెలివైన ఓటరు' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఒరేయ్ సత్తిగా! నేను ఉదయం వెళ్లి సాయంత్రం వస్తాను..ఓవర్ టైం కుడా చేస్తాను..ఇన్ని సంవత్సరాలైనా..సొంత ఇల్లు కుడా కట్టు కోలేదు. నువ్వేమో చదువుకోలేదు..నువ్వు పట్టుమని ఎక్కువ పని చెయ్యడం.. నేను ఎప్పుడూ చూడలేదు...కానీ నువ్వు ఇంత మంచి సొంత ఇంట్లో ఉంటున్నావు. నాకన్నా దర్జాగా బతుకుతున్నావు.. నువ్వే చాలా బెటర్ రా!"
"చివరకు ఒప్పుకున్నావు కదా శంకర్! అది చాలా పెద్ద రహస్యం. అయినా అదంత దర్జాగా ఉండదు లేరా.."
"చెప్పరా! పర్వాలేదు. లేకపోతే చెల్లెమ్మ ను అడిగేస్తాను మరి!"
"అడుగు! ఏమిటి చెబుతుందో నేనూ వినాలనే అనుకుంటున్నాను"
"చెల్లెమ్మా! మీ ఆయన ఇంత గొప్పగా.. టెన్షన్ లేకుండా ఎలా ఉంటున్నాడు నువ్వైనా చెప్తావా?"
"నాకు తెలియాదు అన్నయ్యా! ఎప్పుడైనా ఎన్నికలు వస్తే, నన్ను మా ఆయన తీసుకుని వెళ్లి చెప్పిన వాళ్ళకి ఓటు వెయ్యమంటారు అంతే! మిగిలిన విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు!"
"ఓటు వేస్తే సరిపోతుందా? సత్తి! ఇది నిజమేనా! "
"కొంత నిజమే రా శంకర్!"
"పూర్తిగా చెప్పరా బాబు..టెన్షన్ ఇక్కడ.."
"మనకి ఎన్నికలు ఐదేళ్ళకి ఒక సారి వస్తాయి కదా! మరి ఓటు వెయ్యాలి కదా! నేను ఎప్పుడూ మిస్ కాకుండా ఓటు వేస్తాను"
"మేము ఓటు వెయ్యడానికి తప్పక వెళ్తాను..ఓటు మంచి వ్యక్తి కే వేస్తాను సుమీ! మన కోసం ఆలోచించే పార్టీ కి, మంచి పధకాలు పెట్టి..వాటిని ఖచ్చితంగా అమలు చేసే పార్టీ కే మా ఓటు"
"పధకాలు ఉంటే సరిపోతుందా?"
"ఎంత మాట అన్నావు! పధకాలు మనకోసమే కదా! ఉద్యోగం లేకపోతే ఒక పధకం..ఇంటి పని చేసుకునే ఆడవారికి ఒక పధకం.. రేషన్ లో చవుక ధరలకే సరుకులు.. పిల్లలకి ప్రభుత్వ స్కూల్ లో ఫ్రీ ఎడ్యుకేషన్.. ఫ్రీ భోజనం.. స్కూల్ కు పంపిస్తే, మాకు డబ్బులు.. వాళ్ళకి గొప్ప చదువులు. పొలం ఉంటే..రుణ మాఫీలు..పక్క రాష్ట్రం లో అయితే టీవీ లు, ల్యాప్‌టాప్ లు, గడియారాలు..ఇంకా ఎన్నో.."
"మరి జబ్బు చేసి హాస్పిటల్ కు వెళ్తే, ఇల్లు గుల్లే కదరా! ఈ రోజుల్లో.."
"అన్నీ ఫ్రీ యే కదరా! మాకు రోగం వచ్చినా చింత లేదు. మనిషికి కావలసినవి ఏమిటో చెప్పరా!"
"తిండి, నిద్ర, ఉండడానికి ఇల్లు…” అని టక్కున చెప్పేసాడు శంకర్.
“ప్రభుత్వం మంచి ఇల్లు కట్టించి మరీ ఇస్తుంటే, మాకు ఇల్లు బాధ లేదు..రేషన్ లో తక్కువకే అన్నీ ఇస్తుంటే తిండి కి లోటు లేదు. అన్ని వుంటే, కంటి నిండా నిద్ర పడుతుంది కదా...లెక్క సరిపోయిందా శంకర్! అన్నీ ఉచితంగా వస్తుంటే, డబ్బులు అవసరం ఎక్కువ ఎందుకు ఉంటుంది చెప్పు! నేను చెడు వ్యసనాల జోలికి పోను.. అప్పుడప్పుడు చేసే కూలి పనైనా, వచ్చిన డబ్బులు అవసరాలకు వాడుకుంటాం… ఇవికాక, మధ్యలో అప్పుడు అప్పుడు వచ్చే ఎన్నికల పండుగ మాకు బోనస్ లాంటిది”.
"నిన్ను చూసి...చాలా నేర్చుకోవాలి సత్తి!"
"లేదురా శంకర్! నాకు చదువు లేదు..పేదరికం చేత తప్పక ఇలాగ చేస్తున్నాను..అందరూ.. బాగా చదువుకుని గౌరవంగా, గొప్పగా బతకాలి రా!.."
****
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Kommentare