top of page

ఊడలమర్రి

Updated: Jun 2

#Udalamarri, #ఊడలమర్రి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguChildrenStories

Udalamarri - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 01/06/2025

ఊడలమర్రి - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


తిమ్మాపురంలో రంగయ్య పేదరైతు. కొద్ది పాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కొడుకు నారాయణను పక్క ఊరి పాఠశాలలో చదివిస్తున్నాడు. 


వర్షాలు సరిగ్గా కురవక పంటలు ఎండి రాబడి లేకపోయినా కొడుకును క్రమం తప్పకుండా రోజూ పాఠశాలకు పంపుతున్నాడు. గ్రామంలోని మిగతా రైతులు వారి పిల్లల్ని తమ వెంట వ్యవసాయ పనులకు తీసుకెల్తూంటారు. 


నారాయణ చురుకైన తెలివైన అబ్బాయి. భూతదయ ఎక్కువ. పక్షులకు, జంతువులకు రోజూ ఆహారం వేసి తన ఉదారగుణాన్ని చూపుతాడు. ఉదయాన్నే పుస్తకాల సంచిని

భుజానికి తగిలించుకుని పక్క ఊరి పాఠశాలకు బయలుదేరుతాడు. 


పుస్తకాల సంచిలో పిల్లనగ్రోవి, కాల్చిన మొక్కజొన్న కంకులు, తేగలు, చిలగడ దుంపలు పెట్టుకుని ఊరి బయట ఉన్న పెద్ద ఊడలమర్రి చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు పిల్లనగ్రోవితో చక్కటి పాటలు పాడి వెంట తెచ్చుకున్న మొక్కజొన్న కంకులు, తేగలు, దుంపలు తిని మిగిలినవి పక్కన పొదలలో పడేసి పాఠశాలకు వెళ్లేవాడు. 


పొదల దగ్గర బొరియలో ఒక కుందేలు నివాసం ఉంటోంది. అది రోజూ నారాయణ విసిరేసిన మొక్కజొన్న కంకుల నుంచి మిగిలిన గింజలు తిని కడుపు నింపుకునేది. 


ఆ ఊడలమర్రి చెట్టు మీద ఒక భూతం కూడా నివసిస్తోంది. అది రోజు నారాయణ పిల్లనగ్రోవితో వినిపించే సంగీతం విని ఆనందించేది. 


కుందేలు, భూతం ప్రతి దినం ఉదయం నారాయణ రాక కోసం ఎదురు చూసేవి. పాఠశాల శలవు రోజున మరే కారణం వల్లనైన అతను ఊడలమర్రి చెట్టు దగ్గరకు రాకపోతే వాటికి తోచేది కాదు. 


రోజులు గడుస్తున్నాయి చెట్టు మీదున్న భూతం, బొరియలోని కుందేలు నారాయణకు మేలు చెయ్యాలనుకున్నాయి. 


ఊరి షాహుకారు కూతురు ఇంట్లో స్నానం చేస్తు మెడలోని బంగారునగ స్నానాలగది గోడ మీద ఉంచింది. అటుగా వచ్చిన కాకి తినే వస్తువనుకుని నగను నోటితో కరుచుకుని ఎగిరిపోయింది. విషయం తెల్సిన షావుకారు మనుషుల్ని పెట్టి వెతికించినా కాకి జాడ కన్పించ లేదు. 


కాకి తిన్నగా ఎగురుకుంటూ పోయి ఊడలమర్రి చెట్టు కొమ్మ మీద వాలి బంగారు నగను తిందామనుకుంటే సాధ్యం కాక కింద పడేసింది. బంగారు నగ జారి తిన్నగా కుందేలు

నివాసమున్న బొరియ వద్ద పడింది. 


కుందేలు ఆ నగను నారాయణకు కానుకగా ఇవ్వాలనుకుని ఊడలమర్రి చెట్టు మొదట్లో పెట్టింది. 


రోజూలాగ వచ్చిన నారాయణ బంగారు నగను చూసి ఎవరో పారవేసుకున్నారనుకుని తలిచి తీసుకెళ్లి తండ్రి రంగయ్య కిచ్చాడు. 


నిజాయతీ పరుడైన రంగయ్య ఎవరో బంగారునగ పోగొట్టుకున్నారని గ్రామాధికారికి అప్పగించాడు. 


పోగొట్టుకున్న బంగారునగ గ్రామాధికారి వద్ద ఉందని తెలిసి, షావుకారు వచ్చి ఆ నగ తన కూతురు స్నానం చేస్తూండగా కాకి ఎత్తుకుపోయినట్టు వివరాలు చెప్పగా గ్రామాధికారి బంగారునగను ఇచ్చేసాడు. 

 

షావుకారు రైతు రంగయ్య నిజాయితీకి మెచ్చి సాగుకి కావల్సిన ఎరువులు, విత్తనాలు ఉచితంగా అందచేసాడు. వాటితో రంగయ్యకు పంటలో దిగుబడులు పెరిగి మంచి ఫలసాయం దక్కింది. 


రోజూ వేణువుతో ఇంపైన సంగీతం వినిపిస్తున్న నారాయణకు భూతం కూడా ఎలా సాయపడాలని ఆలోచిస్తోంది. 


ఒకరోజు రాత్రి కొంతమంది దారి దొంగలు బంగారునగల మూటతో ఊడలమర్రి కింద చేరి నగలు పంచుకునే విషయంలో ఘర్షణ పడసాగేరు. 


దొంగల సవ్వడి విన్న భూతం వచ్చి వారిని భయపెట్టి చెదరగొట్టి నగలమూటను తెచ్చి నారాయణ కోసం ఊడలమర్రిచెట్టు మొదట్లో ఉంచింది. 


దొంగలు పక్క ఊరి నగల వ్యాపారిని దారి దోపిడీ జరపగా, ఆ వ్యాపారి పోలీసు ఠాణాకెళ్లి తన బంగారునగలు దారి దోపిడీ జరిగినట్టు ఫిర్యాదు చేసాడు. 


ఎప్పటిలా పాఠశాల కెల్తూ మర్రిచెట్టు మొదట్లో కూర్చున్న నారాయణకు నగలమూట కనబడింది. దాన్ని విప్పి చూసి ఎవరో బాటసారి నగలు మర్చిపోయారనుకుని భద్రంగా తెచ్చి తండ్రికిచ్చాడు. 


రైతు రంగయ్య నగలమూటను జాగ్రత్తగా తెచ్చి గ్రామాధికారికి అప్పగించాడు. 

 

ఊరి గ్రామాధికారి పోలీసు ఠాణాకు కబురు పంపగా, నగలు దారి దోపిడీ జరిగినట్టు ఫిర్యాదు అందినందున నగల వ్యాపారిని రప్పించి గ్రామాధికారి వద్దకు వచ్చారు. 


నగలను గుర్తించిన వ్యాపారి గ్రామాధికారి భద్రంగా తన వస్తువులను అప్పగించినందుకు అభినందనలు తెలిపాడు. 


అభినందనలు తనకు కాదనీ నిజాయతీ పరుడైన ఊరి రైతు రంగయ్యకు చెప్పమని గ్రామాధికారి అనగా సంతసించి వ్యాపారి నగదు బహుమతితో సత్కరించాడు. ఊరిలో అందరు రంగయ్య నీతినిజాయితీలను అభినందించారు. 

 

ఊడల మర్రిచెట్టు మీదున్న భూతం, బొరియలో ఉండే కుందేలు తమవల్ల నారాయణ కుటుంబానికి మేలు జరిగినందుకు ఆనంద పడ్డాయి. 


 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page