ఉదార హృదయం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- 4 days ago
- 3 min read
#UdaraHrudayam, #ఉదారహృదయం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Udara Hrudayam - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 04/07/2025
ఉదార హృదయం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
కట్టెలు కొట్టుకుని ఊళ్లో అమ్మి బతికే చిన్నయ్యకు ఎక్కడో చూసిన పెరుగు గారెలు తినాలన్న కోరిక పుట్టింది. తన మనసులోని కోరిక పెళ్లాం అప్పికి చెబితే, "ఎల్లవయ్యా, ఎవురయినా యింటే గొల్లుమంటారు. ఒల్లకుండు" అని కసురుకుంది.
చిన్నయ్య మనసులోని కోరిక తాత్కాలికంగా వాయిదా వేసుకున్నా మనసు ఊరుకోడం లేదు.
ఒకసారి కట్టెల మోపు తీసుకుని బ్రాహ్మణ వీధి కెళ్లినప్పుడు పంతులు గారు కనబడితే "బాబుగారు, పెరుగు గారెలు తినాలని మనసైనాది. అమ్మగారితో సెప్పి పెట్టించరా" అని దీనంగా అడిగాడు.
"ఏరా, గంజి మెతుకులు తినేవాడివి. ఏదైనా మేము పెడితే తినాలి కాని మాకే ఆర్డర్ వేస్తావా? ఫో! " తిట్టిపోసారు పంతులు గారు.
చిన్నయ్య మొహం చిన్నబుచ్చుకుని వచ్చేసాడు. ఐనా, మనసులోని కోరిక విడవ లేకపోతున్నాడు.
ఇంకొక సారి కోమటి వీధిలో కిష్టయ్య శెట్టి మిఠాయి దుకాణం కనబడితే "శేట్ గారూ, దరమ పెబువులు తమరు. కుసింత మనసు చేసుకుని నాకు పెరుగు గారెలుంటే ఇప్పించరా ! " అని జాలిగా అడిగాడు.
చిన్నయ్య మాటలు విన్న కిష్టయ్య శెట్టి పకపకా నవ్వుతు "ఎదడికి ఎవరో మింగ మెతుకులు లేవు, మీసాలకు సంపెంగి నూనె రాయమన్నాడట నీ బోటాడే, పెరుగు గారెలు కావాలిరా, తొత్తు కొడకా!" అని మండి పడ్డాడు.
చిన్నయ్య మారు మాటాడకుండ అక్కడి నుంచి వచ్చేసాడు. ఎవరెన్ని మాటలన్నా పెరుగు గారెలు తినాలన్న కోరిక మరిచి లేక పోతున్నాడు చిన్నయ్య.
రాములోరి గుడి గట్టు మీద ఆలోచనతో కూర్చున్న చిన్నయ్యని అటుగా వెల్తున్న బిచ్చగాడు సైదులు చూసి దగ్గర కొచ్చి " ఏంటి, చిన్నయ్యా సానా రోజుల నుంచి సూస్తున్నాను. ఎందుకో దిగులుగా కానొస్తున్నావు. ఏదయినా బాదలో ఉన్నావా ఏంటి? సెప్పు" అనునయంగా అడిగాడు.
తన మనసులోని కోరిక ఎవురికి సెప్పినా ఎగతాళి సేస్తున్నారని ఏమీ లేదన్నాడు చిన్నయ్య.
"లేదు, నువ్వు నా కాడ ఏదో దాపరికం సేస్తున్నావు, నా వల్లయితే సేసి పెడతా, సెప్పు" ధైర్యం చెప్పేడు సైదులు.
సైదులు ఎక్కువ వత్తిడి చెయ్యడంతో పెరుగు గారెలు తినాలన్న తన మనసులోని కోరిక చెప్పాడు చిన్నయ్య.
చిన్నయ్య కోరిక విన్న బిచ్చగాడు సైదులు " ఓస్, ఇంతేనా ! నీ కోరిక నాను తీరుస్తా. బెగులు పడక. దగ్గరలోనె సంకురాతిరి పండగ రోజులొత్తున్నాయి. ఊల్లోని పెద్దోల్ల ఇల్లకు కొత్త అల్లుల్లూ, బందువులు వత్తారు. అప్పుడు బోలెడు రకాల పిండి వంటకాలు సేసుకుంటారు. నేను ఆల్ల గుమ్మాల కాడికి ముస్టి కెల్లినప్పుడు మిటాయిలు, పులివోర, పాయసం, గారిలు దండిగా ఎడతారు. దరమ పెబువులు. ఈ పాలి పెరుగు గారిలు ఎడితే నీ కోసం దాచి ఉంచుతాలే " నమ్మకం కలిగించాడు.
సంక్రాంతి పండగ రోజు లొచ్చాయి. ఊళ్లోకి చుట్టాల రాక మొదలైంది. భోగి, సంక్రాంతి పండగ రోజుల్లో రకరకాల పిండి వంటకాలు బిచ్చగాడు సైదులుకి దొరుకు తున్నాయి కాని రంగయ్య అడిగిన పెరుగు వడలు ఎవరూ వండలేదు.
సైదులు ఆలోచనలో పడ్డాడు. మూడవ రోజు కనుమ పండగ వచ్చింది. దివాణం గారింట్లో కొత్త అల్లుడి కోసం మినప పెరుగు వడలు ప్రత్యేకంగా వండించారు.
రోజూ మాదిరి ముస్టికొచ్చిన సైదులు గిన్నెలో మూడు పెరుగు వడలు వేసారు. సైదులు ఆనందానికి అంతు లేకపోయింది. వాటిని దాచి ఆప్యాయంగా చిన్నయ్యను పిలిచి ఇచ్చాడు.
చిన్నయ్య మనస్సు సంతోషంతో నిండిపోయింది. పెద్దోళ్లు అందరూ లేదు పొమ్మన్నా ఏమీలేని పెద్ద మనసున్న బిచ్చగాడు సైదులు తన చిరకాల కోరిక తీర్చినందుకు ఆనంద పడ్డాడు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments