top of page

ఉండాలి దూరంగా

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #UndaliDuramga, #ఉండాలిదూరంగా, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 105


Undali Duramga - Somanna Gari Kavithalu Part 105 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 08/08/2025

ఉండాలి దూరంగా - సోమన్న గారి కవితలు పార్ట్ 105 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ఉండాలి దూరంగా

----------------------------------------

హాని చేసే వాటికి

చిక్కులు తెచ్చు నోటికి

ఉండాలి దూరంగా

నిలకడ లేని మనిషికి


దుర్మార్గుల స్నేహానికి

మేలు చేయని బంధానికి

ఉండాలి దూరంగా

ఇల కుహనా సంస్కృతికి


సంఘ విద్రోహ శక్తులకు

మేక వన్నె పులులకు

ఉండాలి దూరంగా

మాయదారి మనుషులకు


వెన్నుపోటు దారులకు

క్రమం లేని చేతలకు

ఉండాలి దూరంగా

దుష్ట ఆలోచనలకు


ree













తల్లి మంచి మాటలు

------------------------

సెలయేరుల పరుగుల్లా

పాల కడలి తరగల్లా

ఉండాలోయ్! బ్రతుకులో

మేలు చేయు తరువుల్లా


మల్లెపూల తావుల్లా

పల్లె సీమ సొగసుల్లా

ఉండాలోయ్! జగతిలో

తొలి స్థానం ప్రగతిలో


కాంతులీను దివ్వెలా

రవళించే మువ్వలా

ఉండాలోయ్! స్ఫూర్తిగా

కన్నోళ్లకు కీర్తిగా


దారి చూపు గురువుగా

నడిపించే నేతగా

ఉండాలోయ్! మనమంతా

సుగుణంలో కొండంత


ree











ఖగం సందేశం

---------------------------------------

ప్రేమను చూసి బంధాలు

కలిసేవి ఆనాడు

డబ్బును చూసి బంధాలు

కలుస్తాయి ఈనాడు


పరస్పర సహకారం

దొరికేది అమితంగా

పేదోళ్లకు ఉపకారం

పండేది ఉచితంగా


ఎటుచూసినా త్యాగమే

తొణికిసలాడేది నాడు

అడుగడుగునా స్వార్ధమే

నాట్యమాడుతుంది నేడు


చూడు చూడు కలికాలం

స్వచ్ఛత ఎండమావులు

దాపురించే పోగాలం

పెరిగెను విపరీత బుద్ధులు


ree
















పెద్దయ్య పలుకులు

--------------------------------------

బ్రతుకులోన అపజయాలు

గెలుపుకు సోపానాలు

నేర్పునోయి పాఠాలు

సరిచేయు జీవితాలు


తొందరపాటు నిర్ణయాలు

తెచ్చిపెట్టు కష్టాలు

అంతులేని నష్టాలు

ప్రగతికవి అవరోధాలు


పలకవద్దు ప్రగల్భాలు

పెట్టవద్దు ప్రలోభాలు

రెండూ అపాయకరము

ఉండాలోయ్! బహు దూరము


కష్టపడితే సత్ఫలితాలు

ఖచ్చితంగా ఉంటాయి

మహనీయుల సలహాలు

ఎదిగేందుకు మార్గాలు


ree










మంచిగా యోచించూ...

--------------------------------------

చెడు ఆలోచన చెరుపు

బాధపెట్టే కురుపు

వదిలిపెడితే మాత్రము

భవిత ఇక బంగారము


చెదలలాంటి తలపులు

హరిస్తాయి బ్రతుకులు

జాగ్రత్త లేకుంటే

ఓటమి నీ వెంటే


తలపులను దిద్దుకో

ప్రవర్తన మార్చుకో

చక్కగా యోచించి

పరివర్తన తెచ్చుకో


అన్నింటికీ మూలము

ఆలోచన సరళి

సరిచేసుకొనుమిక

మదిని ఆనంద రవళి


-గద్వాల సోమన్న

Comments


bottom of page