top of page

ఉండాలోయ్!

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Undaloy, #ఉండాలోయ్, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

ree

సోమన్న గారి కవితలు పార్ట్ 100


Undaloy - Somanna Gari Kavithalu Part 100 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 29/07/2025

ఉండాలోయ్! - సోమన్న గారి కవితలు పార్ట్ 100 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ఉండాలోయ్!

----------------------------------------

కొండ మీద కోటలా

పరిమళించే తోటలా

ఉండాలోయ్! జీవితము

జీవజలపు ఊటలా


పసి పిల్లల మాటలా

జుంటెతేనె ధారలా

ఉండాలోయ్! జగతిలో

ముందంజతో ప్రగతిలో


కన్నవారి మనసులా

వెన్నెలమ్మ సొగసులా

ఉండాలోయ్! మనమంతా

వెన్నముద్ద గుణంలా


హైయినిచ్చు పాటలా

పదిమందికి బాటలా

ఉండాలోయ్! గొప్పగా

మమకారపు మూటలా


ree














టీచర్ హితోక్తులు

------------------------

మితిమీరిన బద్ధకము

చేస్తుందోయ్ నాశనము

ఆదిలోన త్రుంచితే

తప్పుతుంది ప్రమాదము


నిప్పులాంటిది కోపము

కలుగజేయు అనర్ధము

క్రమేణా తరిమికొట్టు

ప్రపంచమే జైకొట్టు


చేయరాదు దౌర్జన్యము

ఆవరించు దౌర్భాగ్యము

చేతనైతే సాయము

చేసిపెట్టు నిరంతరము


దుర్గుణమే యమపాశము

చెల్లించాలోయ్ మూల్యము

మానుకుంటే మంచిది

బాగుపడును జీవితము

ree





















పరిష్కారం

---------------------------------------

సమస్యకు దొరుకుతుంది

వెతికితే పరిష్కారము

వహిస్తే నిర్లక్ష్యము

పరిస్థితులు దుర్బరము


ప్రతి దానికి పరిష్కారము

తప్పకుండా ఉంటుంది

ఒక్కక్షణం యోచిస్తే

ప్రత్యక్షం అవుతుంది


మేధస్సుకు పదునుపెట్టు

పరిష్కారం చూపెట్టు

నిబ్బరమైన మనసుతో

ఏదైనా చేసిపెట్టు


జాగ్రత్త లేకుంటే

బ్రతుకులు అతలాకుతలము

పరిష్కారం దిశలోన

సాగిపోతే విజయము


ree













గుండెపై కుంపట్లు కలతలు

--------------------------------------

గుండెలోని కలతలు

ఖాళీ చేసుకొనుము

కొంతైనా భారము

తొలగుతుంది దూరము


చింతించుట మానుము

అది కీడుకు కారణము

దోచును ఆరోగ్యము

ఉండదు ఆనందము


కలతలతో మనసులు

క్రుంగికృశించకూడదు

వాటితోడ బ్రతుకులు

వ్యర్థమైనపోరాదు


ఆదిలో త్రుంచుకో

అధికమైన కలతలు

అత్యంత కష్టమే

కాకూడదు మ్రానులు


ఎక్కువైతే కలతలు

గుండెపై కుంపట్లు

మోదానికవి తూట్లు

తెచ్చిపెట్టు పలు పాట్లు

ree














దేవునితో ఆటలు ముప్పు

--------------------------------------

అగ్గితో చెలగాటము

దేవునితో విరోధము

పెట్టుకుంటే నష్టము

మిగులుతుంది భస్మము


దైవదూషణ చేయొద్దు

తెచ్చుకోకు ప్రమాదము

వెకిలి వేషాలు వేయొద్దు

నాశనమగు జీవితము


కీడు వితండవాదము

ఆదిలోనే త్రుంచుము

ఇష్టమైతే దైవాన్ని

మనసారా!నమ్ముము


మంచి పనులే చేయుము

అల్పబుద్ధులు వీడుము

దైవమే సంతసించు

రెట్టింపుగా దీవించు

-గద్వాల సోమన్న

コメント


bottom of page