ఉన్నదే సరిపోతుంది

Unnade Saripothundi - Telugu Moral Story | Rallabandi Sangam Naidu
ఉన్నదే సరిపోతుంది - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 27/08/2026
“ఉన్నదే సరిపోతుంది” రాళ్లబండి సంగం నాయుడు రచించిన చక్కని తెలుగు నీతి కథ. అడవిలోని జంతువులతో స్నేహంగా ఉంటూ, అందరికీ సహాయం చేసే మంచి మనసున్న కోతి చంటి తనలోని లోపాల గురించి అనవసరంగా ఆలోచిస్తూ ఆత్మన్యూన్యతకు గురవుతుంది. తోటి జంతువులు ఎన్నిసార్లు ధైర్యం చెప్పినా ఆ భావన నుంచి పూర్తిగా బయటపడలేకపోతుంది.
చివరికి ఏమైందో ఈ కథలో తెలుసుకోండి.
పూర్వం బొప్పడాం అగ్రహారం పరిసర ప్రాంతంలో డట్టమైన అడవులుండేవి. ఆ అడవుల్లో ఎన్నో జంతువులు మరెన్నో పక్షులు జీవిస్తూ ఉండేవి. ఆ జంతువుల్లో చంటి అను పేరు గల కోతి ఒకటి ఉండేది . చంటి చాలా మంచిది. మంచి మనసు కలది. ఇతరులకు సహాయం చేసేది. పరుల మంచి చెడుల్లో, కష్ట సుఖాల్లో పాలు పంచుకునేది. చంటితో స్నేహం చేసిన జంతువుల్లో మంచి లక్షణాలు పెరుగుతుండేవి. ఇన్ని మంచి లక్షణాలున్న చంటిలో ఆత్మన్యూన్యత భావం ఉండేది. తను ఇతర జంతువుల కంటే తక్కువని, తనలో ఏదో లోపం ఉందని భావించేది. లోలోపల భయపడేది.
చంటి ఆత్మన్యూన్యతను మిగిలిన జంతువులు పసికట్టి ఎన్నో మంచి విషయాలు చెప్పాయి. చంటిలో ఉన్న గొప్ప విషయాలు తరచూ గుర్తు చేసేవి. చంటి కొమ్మ మీద నుండి కొమ్మ మీదకు అలవోకగా దూకగలదని, ఇతరులకు చెడు తలపెట్టక ఎల్లప్పుడూ మంచే చేసే మంచి మనసు ఇతరులకు ఉండదని మిగిలిన జంతువులు చెప్పాయి. చంటి తన ఆహారం తానే సంపాదించుకుంటుందని, తన పిల్లలను చక్కగా సాకుతుందని చెప్పాయి. చంటికీ మానవులంతా కోతి నుండి పుట్టామని గొప్పగా చెప్పుకుంటారు. ఈ అదృష్టం మన అడవిలో మిగిలిన జీవులకు లేదని గుర్తు చేశాయి. మానవులు కోతితో రకరకాల విన్యాసాలు చేయించి నవ్వుకుని దైనందిన జీవితంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటారని చెప్పాయి. ఆ మాటకొస్తే అడవుల్లో మమ్మల్ని కూడా చంటి హాయిగా నవ్వించగలవని చెప్పాయి. కొంతమంది మానవులకు మీ కోతి విన్యాసాలతోనే బతుకు తెరువు దొరుకుతుందని చెప్పాయి. మన అడవిలో నీలాగ చెట్టు నుండి చెట్టుకు దూకుతూ వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకునే జంతువులు లేవని చెప్పాయి. ఈ హితబోధ చంటికి ఎన్నో సార్లు చేశాయి. చంటి మిగిలిన జంతువుల మంచి మాటలు విని ఆత్మవిశ్వాసం పొందేది. జంతువులు చెప్పిన మంచి మాటలు, ఆ ఆత్మవిశ్వాసం ఒక రోజే పనిచేసేది. తరువాత రోజు షరా మామూలే. ఇలా ఎన్నో సార్లు జరిగింది.
ఒకసారి చంటి కొన్ని రోజుల పాటు తీవ్ర ఆత్మన్యూన్యతకు లోనైంది. తినడం మానేసింది. అందరితో కలివిడిగా ఉండడం మానేసింది. మానసిక ఆరోగ్యం పాడైంది. మనిషి చిక్కి శల్యమైంది. అడవిలోని తోటి జంతువులు చంటిని మృగరాజు సింహం దగ్గరకు తీసుకెళ్లాయి. చంటిని వెంటబెట్టుకొచ్చిన జంతువులతో విషయం ఏమిటంది. చంటి నేస్తాలైన తోటి జంతువులు చంటి ఆత్మన్యూన్యతను గురించి చెప్పాయి. చంటికి ఉన్న గొప్పతనం గురించి కూడా చెప్పాయి. ఒక్క మాటలో జంతువులన్నీ "అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని" అని తేల్చేశాయి. అన్నీ విన్న సింహం తరువాత రోజు సాయంకాలం చంటిని తీసుకుని రమ్మంది. జంతువులన్నీ సరేనంటూ ఇళ్లకు బయలుదేరాయి.
తరువాత రోజు తన దగ్గరకు వచ్చిన జంతువులను సింహం తిన్నగా నెమలి ఉన్న చోటికి తీసుకువెళ్ళింది. వీరు వెళ్లే సమయానికి నెమలి ఒళ్ళు మరచి పురివిప్పి నాట్యం చేస్తోంది తన్మయత్వంతో. సింహం చెప్పింది. నెమలికి అందంచందాలున్నాయి. మంచి నీలం రంగు ఉంది. కాళ్లున్నాయి. కళ్ళున్నాయి. మెడ దగ్గర అందమైన నల్లని రంగుంది. భయంకరమైన విషసర్పాలను చంపగలదు. రెక్కలున్నాయి. కానీ... నీలా ఎగరలేదు. ఇన్ని మంచి గుణాలు ఇచ్చిన దేవుడు నెమలికి ఒక లోపం... ఎగరలేకపోవడమనే లోపం పెట్టాడు. దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు. ఉన్న దానితోనే సరిపెట్టుకోవాలి. తృప్తిగా జీవించాలి. తన్మయత్వంతో బతుకు నడపాలి. దేవుడిచ్చిన వరం లాంటి జీవితాన్ని లేనిపోని భయాలు, అపోహలతో సమయం వృధా చేసుకోకూడదు. జీవితకాలం చాలా చిన్నది. జీవితాన్ని జీవించాలి. తప్ప గడపకూడదు. రోజులు దొర్లించరాదు.
సింహం చెప్పిన మాటలు కోతికి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాయి. కోతి వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పొచ్చింది. కోతిలో ఆత్మన్యూన్యత పోయి ఆత్మవిశ్వాసం వచ్చింది. కోతి సంతోషంగా జీవించడం నేర్చుకుంది. కోతిలోని శాశ్వత మార్పుకు అడవిలోని జంతువులన్నీ ఆనందించాయి.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం







Comments