పొట్టి ప్రేమ
- Penumaka Vasantha

- 2 hours ago
- 3 min read

Potti Prema - Telugu Love Story | Penumaka Vasantha
పొట్టి ప్రేమ - తెలుగు ప్రేమ కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 27/08/2026
మనిషి అందం అతని రూపంలో ఉంటుందా? లేక అతని మంచి మనసులో ఉంటుందా? సమాజం సాధారణంగా ఎత్తు, అందం, డబ్బు వంటి విషయాలతో మనుషులను అంచనా వేస్తుంటుంది. కానీ నిజమైన ప్రేమ మాత్రం అలాంటి కొలమానాలను పట్టించుకోదు.
“పొట్టి ప్రేమ” కథలో సృజన, వామనరావుల పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. వామనరావు శారీరకంగా చాలా పొట్టివాడైనా, అతని మంచితనం, ఆప్యాయత, సహాయం చేసే స్వభావం సృజన మనసును గెలుచుకుంటాయి. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు రూపం కంటే మంచి మనసే ముఖ్యమని ఈ కథ హృద్యంగా చెబుతుంది.
ప్రేమకు ఎత్తు, రంగు, డబ్బు, కులం వంటి భేదాలు అవసరం లేదని, ఇద్దరి మనసులు నిజాయితీగా కలిస్తే అదే నిజమైన ప్రేమ అని చెప్పే ఈ కథ కుటుంబ విలువలు, మానవత్వం మరియు ప్రేమను అందంగా ప్రతిబింబిస్తుంది.
బ్యాంకుకు వచ్చి కౌంటర్లో కూర్చుంది సృజన. అప్పుడే ఒక మూడు అడుగుల వ్యక్తి బ్యాంకులోకి వచ్చాడు. ఇంతలో మేనేజర్ వచ్చి, "మన ఆఫీసుకు కొత్తగా వచ్చిన క్లర్క్ ఇతను. ఇతని పేరు వామనరావు..!" అంటూ అందరికీ పరిచయం చేశాడు. చాలా అందంగా ఉన్నాడు. ఒక్కటే లోపం, అదేమంటే... మూడు అడుగులు మాత్రమే ఉన్నాడు.
అందరూ అతన్ని చూసి, 'ఇంత పొట్టి ఏంటిరా బాబు..! ఇతనికి సరిపోయిన పేరు భలే పెట్టారు' అని మనసులో అనుకుని పైకి "హాయ్..!" అన్నారు. అతను అందరినీ "హాయ్..!" అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. అందరికీ స్వీట్లు పంచి, టీ తెప్పించి ఇచ్చాడు.
సృజన పక్క సీటు వామనరావుది. మేనేజర్ ఏదైనా డౌట్ ఉంటే సృజనను అడగమని చెప్పాడు. అందుకని మాటిమాటికి అడుగుతున్నాడు వామనరావు. అయినా విసుక్కోకుండా చెప్పింది.
ఈవెనింగ్ బయటకు వస్తున్నపుడు, "చాలా థాంక్స్ సృజన గారు. నేను ఎంత విసిగించినా విసుక్కోకుండా నాకు చెబుతూనే ఉన్నారు."
"పర్లేదు, స్టాఫ్ మనలో మనం హెల్ప్ చేసుకోకపోతే ఎలా?" అంది నవ్వుతూ.
ఆమెకు నడుముల దగ్గరికి వచ్చాడు. 'అబ్బా, ఆ ఒక్క పొట్టి లోపం లేకుంటే... మనిషి తెల్లగా, మంచి రింగుల జుట్టుతో బాగున్నాడు' అనుకుంది మనసులో.
రోజూ ఏదైనా డౌట్స్ ఉంటే సృజనను అడుగుతున్నాడు వామనరావు. ఆ రోజు సృజనకు పెళ్లి చూపులు ఉండటం వల్ల బ్యాంకుకు రాలేదు. పెళ్లి కొడుకు వాళ్లకు అమ్మాయి నచ్చింది; కానీ కట్నం వద్దు, ఘనంగా లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేయాలి అన్నారు వాళ్ళు.
సృజన, "నాకు పెళ్లి వద్దు. లాంఛనాలు అంటే చాలా అవుతుంది. అక్క పెళ్లికి ఇలాగే గ్రాండుగా చేశాం. ఇప్పటికీ ఇంకా ఏవో పెట్టమని అడుగుతున్నారు. నేను పెళ్లి చేసుకుని వెళితే... ఈ అప్పులు ఎవరు తీరుస్తారు?" అంటూ సంబంధం రిజెక్ట్ చేసింది.
మరుసటి రోజు బ్యాంకుకు వచ్చింది. వామనరావు అడిగాడు, "మీకు పెళ్లి చూపులా?" నవ్వుతూ అడిగాడు వామనరావు.
"మీకు ఎలా తెలుసు?" నవ్వుతూ అంది సృజన.
"మీ వయసులో ఉండే ఆడపిల్లలు లీవ్ అడిగితే అదే కారణం అని తెలుస్తుందిలే..! మరి కాయా? పండా?" అన్నాడు వామనరావు.
"పిచ్చి అండి, వాళ్లకు తగినట్లుగా మేము లాంఛనాలు ఇచ్చి చేయలేము. మా అమ్మవాళ్లు చేసుకోమంటున్నారు, నాకు ఇష్టం లేదు" అంది సృజన.
"మిమ్మల్ని కట్నం లేకుండా ఊరికే చేసుకోవచ్చు. వాళ్లు మిమ్మల్ని పోగొట్టుకోవడం వాళ్ల బ్యాడ్ లక్!" అన్నాడు వామనరావు.
వామనరావు వచ్చిన కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు బ్యాంకులో. ఒక్క పొట్టి అనే లోపం తప్ప, చాలా మంచివాడని అందరూ అనుకున్నారు.
ఒకరోజు వాళ్ల అక్క వాళ్ల అబ్బాయి బర్త్ డే అని అందరినీ ఇంటికి పిలిచాడు. సృజన కూడా వెళ్ళింది. వాళ్ళ అమ్మ, నాన్న మంచి హైట్ తో బాగున్నారు. అందరికీ మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. వాళ్లింట్లో అందరూ ఎంతో మంచివాళ్ళుగా కనిపించారు.
అప్పుడప్పుడూ ఏవో సినిమాల గురించి మాట్లాడుకునేవారు సృజన, వామనరావు. ఇద్దరి భావాలు దాదాపు కలిసిపోయాయి. ఒకరోజు సృజన తల్లికి బాగాలేకపోతే... హాస్పిటల్ కు వచ్చి చూశాడు వామనరావు.
ఏమైనా మనీ కావాలంటే అడగమని చెప్పాడు.
"పర్లేదు, ఇన్సూరెన్స్ డబ్బుతో మేనేజ్ చేశాను" అంది సృజన.
హాస్పిటల్ నుండి డిశ్చార్జి రోజున తన కారు తెచ్చి సృజన వాళ్లమ్మను ఎక్కించుకుని ఇంట్లో దింపాడు. ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నాడు సృజనను వామనరావు.
ఒకరోజు సృజన అమ్మ వామనరావుకు కాల్ చేసేసింది. "మా అమ్మాయికి చెప్పు బాబు. ఒక సంబంధం వాళ్ళు చేసుకుంటామన్నారు. ఇది వద్దంటోంది. నువ్వు చెప్తే వింటుందని నా ఆశ" అంది.
సృజనతో మాట్లాడాడు వామనరావు. "పెళ్లి చేసుకోవచ్చుగా?" అన్నాడు.
"నాకు పెళ్ళి చేసుకోవాలని లేదండి."
"మీ పేరెంట్స్ కోసమైనా మీరు చేసుకోవాలి. పోనీ మీకు ఎలాంటి వ్యక్తి కావాలో వాళ్ళను నేను వెతుకుతాను" అన్నాడు వామనరావు.
"మీలాంటి వ్యక్తి చాలు. ఇంకా చెప్పాలంటే... మీకు ఇష్టమైతే... మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను" అంది సృజన.
"నన్నా... ఇంత పొట్టివాడిని చేసుకుని మీరు సుఖ పడలేరు. ఎప్పుడో నా మీద మీకు హేట్ రావచ్చు. ఇంత పొట్టి వాడిని చేసుకున్నానని మీరు ఎపుడూ బాధపడకూడదు."
"పొడుగు పొట్టి కాదండి, మీ మంచి మనసు నాకు నచ్చింది. మీరు చేసుకుంటే నా అదృష్టం. లేదా ఈ జన్మకు పెళ్లి చేసుకోను" అంది సృజన.
"మరి నీ అమ్మవాళ్లు ఒప్పుకుంటారో... లేదో..!" అన్నాడు.
"ముందు మీకు నచ్చానా లేదా అది చెప్పండి!" సిగ్గుపడుతూ అంది సృజన.
"నేను ఎప్పుడో మీ మీద మనసు పారేసుకున్నా. కానీ ఇప్పటి అమ్మాయిలకు ప్రభాస్ లాగా ఆరడుగులు ఉండాలి. ఈ మూడు అడుగుల వాడిని ఎవరు ఇష్టపడతారని నేను మీ మీద ఆశలు పెంచుకోలేదు. కానీ దేవత వరం ఇస్తే ఎందుకు వద్దంటాను?" అంటూ సృజన చేయి ముద్దాడుతూ అన్నాడు వామనరావు.
సృజన వామనరావుల ప్రేమ సఫలమైంది. ప్రేమకు పొట్టి పొడుగు, తెలుపు నలుపు, డబ్బు, కులం ఇవి కాదండి ముఖ్యం. ఇద్దరికీ ప్రేమించే మనసు ఉంటే చాలు!
సమాప్తం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.











Comments