వసంత వనం
- Penumaka Vasantha

- 9 minutes ago
- 3 min read

Vasantha Vanam - Telugu Inspirational Story | Penumaka Vasantha
వసంత వనం - తెలుగు ప్రేరణాత్మక కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 04/08/2026
వసంత వనం ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునే అందమైన తెలుగు కథ. చిన్ననాటి నుంచి మొక్కలు, చెట్లపై ఉన్న ప్రేమతో ఒక మహిళ తన కలలను ఎలా సాకారం చేసుకుందో, ఒక చిన్న స్థలాన్ని పక్షులు, జంతువులు, పూలు, చెట్లతో కళకళలాడే పచ్చని వనంగా ఎలా తీర్చిదిద్దిందో ఈ కథ హృద్యంగా వివరిస్తుంది. ప్రకృతి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, జీవ వైవిధ్యం వంటి విలువలను స్ఫూర్తిదాయకంగా తెలియజేసే ఈ కథ ప్రతి ప్రకృతి ప్రేమికుడు తప్పక చదవాల్సినది.
చిన్నప్పటినుండి నాకు పచ్చదనం, ప్రకృతి అంటే.. ఎంతో ఇష్టం. బహుశా ఈ గుణం నాకు అమ్మ నుండి అబ్బింది ఏమో. అమ్మ ఇంటిముందు, ఇంటి వెనుక చెట్లను పెంచేది. ఇంటి వెనుక మునగ చెట్టు నిండా మునగకాయలు. అందరికీ అవి ఇస్తూ ఉండేది. గనుపు చిక్కుడు వేసి డాబా పైకి అల్లించేది. మా ఊరు పల్లెటూరు అవటం వల్ల ఒక పక్కగా దిబ్బ పోసే వాళ్ళం. ఆ దిబ్బ మీద బూడిద గుమ్మడి, సొర పాదులు పెట్టేది. ఇలా ఇంట్లో కూరలు ఎపుడో తప్ప కొనేవాళ్ళం కాము.
అలా అమ్మతో నా ప్రకృతి ప్రయాణం మొదలైంది. తర్వాత నాకు ఈ చెట్ల పిచ్చి వల్ల బాటనీలో ఎమెస్సీ చేసాను. నాకు పెళ్ళయి పట్నంలో ఒక కాలేజీలో లెక్చరర్‌గా స్థిరపడ్డాను. నేను అపార్ట్‌మెంట్ వద్దని ఇండివిడ్యువల్ ఇళ్లలో ఉండేదాన్ని. తర్వాత మా వారికి చెప్పి ఊరు చివర స్థలం కొనిపించాను. దానికి 'వసంత వనం' అని పేరు పెట్టాను. అక్కడ నాకు ఇష్టమైన చెట్లు పెంచాను. నెలకు రెండు రోజులు అక్కడ చెట్లను చూసుకుంటాను. పక్కనున్న రైతుకు నా చెట్లకు నీళ్లు పోయమని చెప్పాను.
అక్కడ చిన్న కొలను ఏర్పాటు చేసాను. దానిలో తామర ఆకులు, మధ్య తామర పూలను చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ మధ్య ఒక కొంగ ఆ కొలనులో చేపల కోసం వస్తుంది. దాన్ని నా ఫోన్లో బంధించాను. వసంత వనం చుట్టూతా వేప చెట్లను నాటాను. ఎవరైనా అటువైపు వెళుతూ వేపచెట్టు కింద కాసేపు కూర్చోవడం చూసి రెండు సిమెంట్ బెంచీలు వేయించాను.
అమ్మ నా దగ్గరికి వచ్చినపుడు వసంత వనం దగ్గరికి తెస్తాను. అమ్మ ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడే చిన్న గుడిసె లాంటిది వేసాను. గుడిసె పైకి సొర, గుమ్మడి తీగ అల్లించాను. వెళ్ళినపుడు అక్కడ ఉంటే.. ఎంతో చల్లగా ఉంటుంది. సమ్మర్ నాకు కాలేజీకి సెలవులు, పిల్లలకు స్కూల్ సెలవులు ఇచ్చినపుడు నేను అక్కడే మకాం. నా స్టూడెంట్సు ను తీసుకుని వచ్చి చెట్ల గురించి చెబుతూ ఉంటాను. నా ఇంటి పక్క వాళ్ళకి, నాతో పనిచేసే లెక్చరర్స్ కు కూరగాయలు ఇస్తూ ఉంటాను.
నేను పెంచే చెట్ల పైన ఎన్నో రకాల పక్షులు నివాసము ఉంటున్నాయి. అందులో ఒకటి వడ్రంగి పిట్ట, అది చాలా ముద్దుగా ఉంటుంది. దాన్ని ఫోటో తీసి పెడితే.. దానికి నాకు ప్రైజ్ వచ్చింది. కోతి ఒకటి ఈ మధ్య మా స్థలంలో కనిపిస్తుంది. అరటి గెల వేస్తే.. దాని చుట్టూ తిరగటం చూసి ముచ్చటేసింది. దానికి అరటిపండు పెడితే తిని వెళ్ళిపోయింది. ఈవిధంగా పక్షులతో, జంతువులతో వసంత వనం మమేకం అయింది.
మా వసంత వనం దాటితే.. పెద్ద అడవి ఉంది. ఈ మధ్య ఒక మృగరాజు తిరుగుతుందని మా వారు అక్కడికి నన్ను, పిల్లలని వెళ్లనీయటం లేదు. నేను అటవీ శాఖ వాళ్ళకి మృగరాజును పట్టుకోమని లెటర్ పెట్టాను. వాళ్ళు ఎలాగో కదిలి అడవి గాలించి మృగరాజును పట్టుకుని జూకు తరలించారు. తర్వాత నా వసంత వనం వరకు బస్ వెళ్తుంది. నా వసంత వనం పేరు బస్ మీద ఉంటుంది. అదే లాస్ట్ స్టాప్ కాబట్టి, ఆ పేరు చూస్తే... నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇపుడు వసంత వనం ఊరి మధ్యకు వచ్చింది. నేను రిటైర్ అయితే... అక్కడ గడపటానికి ఇప్పటినుండే ప్లాన్ చేస్తున్నాను. మీరు మీకున్న స్థలంలో చెట్లను పెంచండి. మనసుకు పచ్చదనాన్ని ఇవ్వండి.
సమాప్తం
పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.










Comments