top of page
Original.png

ఉపాధ్యాయుడు

#KolluruPadmajaSankar, #కొల్లూరుపద్మజాశంకర్, #Upadhyayudu, #ఉపాధ్యాయుడు,  #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

ree

గుండె నిండిన దైవానికి జోత

Upadhyayudu - New Telugu Poem Written By  - Kolluru Padmaja Sankar Published in manatelugukathalu.com on 16/12/2025 

ఉపాధ్యాయుడు - తెలుగు కవిత

రచన: కొల్లూరు పద్మజా శంకర్

    

ఉంగా-లు చెబుతూ- ఊ కొడుతూ- కబుర్లు చెప్పే నన్ను-

అమ్మ ఒళ్ళోనుంచి ఒక్కసారిగా నాన్న ..బళ్ళో చేర్చగానే..

చిన్న నవ్వుతో పలకరిస్తూ నా చేయినందుకొని-

నా లేలేత వ్రేళ్ళతో బలపం పట్టించి సుతారంగా అక్షరాలు దిద్దించిన నీ ఓర్పు...

 పాలబుగ్గలపై జారిన చారికల్ని తుడిచి లాలించిన నీ అనురాగం-

అమ్మనాన్నల్ని మరిపించేలా నాపై కురిపించిన నీ ప్రేమ-

భుజంచుట్టూ చెయ్యేసి భయం పోగొట్టిన నీ దగ్గరితనం-

జయాపజయాలకు అతీతంగా ప్రయత్నించిన ప్రతీసారీ వెన్నుతట్టిన నీ ప్రోత్సాహం-

నా విజయాన్ని నీదిగా మలచుకొని మురిసిపోయిన నీ ఆనందం-

 దుఃఖంలో ఉన్నప్పుడు మాటల మెట్లు వేసి పైకి లాగిన నీ ఓదార్పు-

తప్పొప్పుల్ని ఖండించి దండించి సక్రమ మార్గంలో నడిపించిన నీ క్రమశిక్షణ-

సందేహాలకు సంశయాలకు చిట్టి కథలతో చిట్కాలు చెప్పి వివేకమందించిన నీ నేర్పరితనం-

విలువలు పెంపొందించి బ్రతుకు తీరు నేర్పించి-

రేపటి తరాన్ని ముందుచూపుతో తీర్చిదిద్దిన నీ మార్గదర్శనం-

నిరంతరం విజ్ఞానకాంతులు వెదజల్లే వెండి సూర్యుడై-

నీవు నిశ్చలంగా ఉంటూ నన్ను ఉన్నతస్థాయిలో నిలబెట్టిన ఓ త్యాగమూర్తీ!

నేను గుండెనిండా గుడి కట్టి నిత్యంఆరాధించే నా గురుదైవమా!🙏

నా జ్ఞాపకాల దొంతరలో మూడు కాలాల ప్రతినిధి నీవు! 

నా జీవన పరమార్థమై పరిమళించిన సుగంధం నీవు!

 అక్షరలక్షలతో నేనభిషేకించి

అందించే అమృత జోతకు ఆలంబన నీవు!


***


కొల్లూరు పద్మజా శంకర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: కొల్లూరు పద్మజా శంకర్

నా గురించి:

కొల్లూరు పద్మజా శంకర్

వృత్తి: ఉపాధ్యాయిని

ప్రవృత్తి: కవయిత్రి, గాయని, బాలసాహిత్య వేత్త.

పనిచేస్తున్న పాఠశాల: ఎం పి పి పాఠశాల, పెదమజ్జిపాలెం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page