ఉపయోగమెంతో!
- Gadwala Somanna
- Aug 2
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Upayogamentho, #ఉపయోగమెంతో, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 103
Upayogamentho - Somanna Gari Kavithalu Part 103 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 02/08/2025
ఉపయోగమెంతో! - సోమన్న గారి కవితలు పార్ట్ 103 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
ఉపయోగమెంతో!
----------------------------------------
నవ్వుల వెన్నెల్లో
పువ్వుల తావుల్లో
ఉపయోగమెంతో!
దివ్వెల వెలుగుల్లో
పిల్లల కళ్ళల్లో
మల్లెల వన్నెల్లో
కొల్లలు పవిత్రతే!
చల్లని మనసుల్లో
చుక్కల రాత్రుల్లో
చక్కని మొక్కల్లో
ఉపయోగమెంతో!
చిక్కని పాలల్లో
మువ్వల రవళల్లో
రవ్వల హారాల్లో
ఉపయోగమెంతో!
జవ్వని పలుకుల్లో

జమిందార్ పాఠాలు
------------------------
మొక్కలా జీవితాన
వినయంతో ఒదిగిపో
శ్రమించే తత్వంతో
ఉన్నతంగా ఎదిగిపో
అజ్ఞానం వదలుకొని
చుక్కలా వెలిగిపో
గుండె ధైర్యం పెంచుకొని
గెలుపు బాట సాగిపో
సాహసాన్ని నింపుకొని
చరిత్ర సృష్టించుకో
పౌరుషాన్ని తెచ్చుకొని
దేశకీర్తి నిలుపుకో
బద్ధకాన్ని తరుముకొని
జగతి ప్రగతి కోరుకో
భగవంతుని నమ్ముకొని
మంచి పనులు పూనుకో
అక్షరాలు నేర్చుకొని
తలరాతలు మార్చుకో
మహాత్ములను తలచుకొని
దీవెనలను పొందుకో
ఘన లక్ష్యం పెట్టుకొని
సఫళీకృతం చేసుకో
పుస్తకాల్ని పట్టుకొని
విజ్ఞానం జుర్రుకో

చిన్నారులు-చిరు దివ్వెలు
---------------------------------------
పసి పిల్లల ముఖములు
రవిచంద్రుల వెలుగులు
వెన్నెల వన్నెల్లా
విరజిమ్మును సొగసులు
చిన్నారుల పలుకులు
జుంటితేనె ధారలు
అలతి అలతి పదములు
దోచుకొనును మనసులు
శుద్ధమైన తలపులు
భగవంతుని రూపులు
ముద్దులొలుకు పిల్లలు
ముద్దబంతి పూవులు
భారతమ్మ పుత్రులు
ప్రేమిస్తే మిత్రులు
అందరికీ ఇష్టులు
గుణంలోన శ్రేష్టులు
వెలుగులీను దివ్వెలు
విహరించే గువ్వలు
పూలలాంటి బాలలు
పరిమళించు మాలలు
మింటిలోన తారలు
ఇంటిలోన పిల్లలు
బహు అందము నవ్వులు
స్వచ్ఛమైన ప్రేమలు

పునరావృతం కాకూడదు
--------------------------------------
గతంలోని తప్పిదాలు
పునరావృతం అయితే
వర్ధిల్లవు జీవితాలు
వృద్ధికవి అవరోదాలు
అతి సహజం పొరపాట్లు
దిద్దుకుంటే లాభము
లేక ముసురు చీకట్లు
తెచ్చిపెట్టు ఇక్కట్లు
చేయరాదు పదేపదే
హానికరమే తప్పులు
శృతిమించిన అధోగతే
జీవితాల్లో నిప్పులు
జాగ్రత్త అవసరమే!
నియంత్రణ అతిముఖ్యమే
చిన్ని చిన్ని పొరపాట్లు
పెరిగితే వృక్షాలే!
-గద్వాల సోమన్న
Comments