top of page
Original.png

ఉత్తమ గురువులు-జగతికి వెలుగులు

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #UtthamaGuruvuluJagathikiVelugulu, #ఉత్తమగురువులుజగతికివెలుగులు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 115


Utthama Guruvulu Jagathiki Velugulu - Somanna Gari Kavithalu Part 115 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 05/09/2025

ఉత్తమ గురువులు - జగతికి వెలుగులు - సోమన్న గారి కవితలు పార్ట్ 115 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ఉత్తమ గురువులు-జగతికి వెలుగులు

---------------------------

ఉత్తమ పౌరులుగా

ఉన్నత వ్యక్తులుగా

చేయు వారు గురువులు

వృత్తిలోన జ్ఞానులు


విద్యార్థుల భవితను

వారి జీవితాలను

దిద్దు వారు గురువులు

వెలుగులీను ప్రమిదలు


నేర్పుతారు బుద్ధులు

పెంచుతారు విలువలు

సమాజాన గురువులు

భువిని జ్ఞాన తరువులు


లేక పోతే గురువులు

అజ్ఞానం తొలగదు

వారు ప్రగతి బాటలు

జ్ఞానానికి కోటలు


గౌరవించు గురువులను

అభించును దీవెనలు

ఆర్జించు జ్ఞానమును

బాగుపడును బ్రతుకులు


జ్ఞాన దాతలు గురువులు

వేస్తారు పునాదులు

పంచెదరు మెండుగా

నిలిచెదరు అండగా
















ఉదయించే సూర్యుడు ఉపాధ్యాయుడు

---------------------------------------

కాంతులీను సూర్యుడు

చల్లనైన చంద్రుడు

భువిలో ఉపాధ్యాయుడు

సదా పూజనీయుడు


పంచును విజ్ఞానము

త్రుంచును అజ్ఞానము

బ్రతుకులను వెలిగించు

మనసార దీవించు


చూపు మంచి మార్గము

విద్యార్థుల దుర్గము

జగతిలోన గురువులు

నీడనిచ్చు తరువులు


గురువు వేయు పునాది

జీవితాన ఉగాది

వారితో సంక్రాతి

దొరుకును మనశ్శాంతి


ఉపాధ్యాయ వృత్తిలో

కడు ఆదర్శమూర్తి

అందరి హృదయాల్లో

అతడు నింపు స్ఫూర్తి


చూడ ఉపాధ్యాయుడు

బహు గౌరవనీయుడు

ఈ సభ్య సమాజాన

స్మరించుకో హృదయాన

















విశ్వాసం కీలకం

--------------------------------------

ఆశ్రయిస్తే దేవుడు

అవును ఆపద్బాంధవుడు

భయభక్తులు చూపిస్తే

కనురెప్పలా ఉంటాడు


విశ్వాసం కీలకము

భగవంతుని చేరుటకు

అర్పించాలి హృదయము

దీవెనలను పొందుటకు


ఆ దేవుని మందిరము

పరికింప హృదయ కమలము

పవిత్రం అయ్యేందుకు

స్మరించుము దైవ నామము


లేకుండా నమ్మకము

ఉండలేం దైవానికి

మిగుల ప్రీతిపాత్రులము

చేరలేం మోక్షానికి


-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page