top of page

వైదర్భి వివాహము -3


'Vaidarbhi Vivaham - 3/3' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 16/10/2023

'వైదర్భి వివాహము - 3/3' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి



{33} కుందనపు కాంతులన్ జిందుచున్ వెలుగొందెడి

రాజనందన ముకుందుని కడకుంజేర

నా ఇందీవరనేత్రి మాందారగాత్రి చందన లేపనంబున అందము

పూర్ణేందుని బోలమంద గమనన్ జూచిరి జనులందరు

సందడి నొందన్


{34} ఓఅషధీశుని మోము నోలలాడెడి అంబరీషుజేరి యా

శేషశయనుని జూచె వివాహ వేషధారి సకల

భూషణ భూషిత వికల చిత్త ఓరచూపునంగనె

పీయూష పంపకాంగన వేష ధారిన్ హరిన్ పరితోషమరయన్.


{35} లేత గులాబి అరచేతుల కూతమిచ్చి

శ్వేతవాహను మోమగు రుక్మిణిన్ చేరదీసి వల

మూతిదాల్పు యరదమెక్కించె అపరంజిబొమ్మనపుడు

చేతలుడుగంగ నటు జూడ చైద్యపక్షచరులు


{36} లలనంగొనిపోవుచుండగ నచేతనంబుగ జూడన్ నేటికియా

లీలల్ వినోదమె మీకున్ చలనంబేటికి రాదు మీ

వలనన్ గల్గెయీ దుర్గతి యా లయకారిన్

కులహీనునిన్ బలహీన బర్చి బాలన్

గొనితేవకున్న మీ బలమేటికిన్.


{37} శంకన్వీడుమో చైత్యనాథ నీ

వింకన్వీడధైర్య లక్షణం బీ క్షణంబె

గృంకుంగాక ప్రొద్దు ప్రాచ్యదిశన్

జంకన్నేల అనిన్ జయంబు మన వంకన్ నిల్వన్.


{38} పసులకాపరి లయకారి పసిదాన్ని రుక్మిణిన్

పొసగు పనిమాని వశపర్చుకొన వగచుటేల

పసివాడవు గావు ఓ శిశుపాల నీవు

కసి దీర్చుకొనుమింక యసలార కదనంబునన్.


{39} పాలు మీగడ వెన్న లవలీలగా దోచు గో

పాలుడా విడువుము మా బాల నిపుడు

చాలు చాలింక నీ చాతుర్య లక్షణంబు

మేలునూహించి వెనుదిరుగు మా బాల

నొదిలి.


{40} అన్నెము పున్నెంబెరుగని గోకుల కన్నెలు జేసిన

విన్నపమెరుగక కోకలు గైకొని పొన్న కొమ్మన చేరిన

ఘనుడా వెన్నుడ విడువుము మా కన్నెను దడయక

కేరడమరయక ఎన్నని తీరుకు మిన్నక కుంతము

లేసెద నీవంతంబొందన్.


{41} విన్నప మొక్కటి వినదగ గోరెద యో అనాథనాథ

మా యన్నను నీయెడ మహాపరాధము ఎన్నిన వానిన్

రుక్మిన్ మన్నన సేయుము మరి గావుము నీ మది

నింకాతని కీడెన్నక మా తలిదండ్రుల పున్నెమెరింగి

యో పన్నగ శయనా.


{42} బాసలు చేసిన బావగు రుక్మి

రోసము ణణుచన్ హరి పరిహాస

హాసము తోడన్ గొరిగె ఏకదిశాతని

మీసము తలపై కేశములట్లున్.


{43} అరిరాజులన్ గెల్చి హరి

పరివారము మెచ్చన్ దెచ్చెన్ దా నచ్చిన

విరిబోణిన్ రుక్మిణిన్

పరిణయ మాడన్నింక బరవసమొందన్


{44} దశదిశల్ యశమాడన్ శౌరి బెండ్లాడె తేజో

రాశిన్ పూర్ణేందు బింబాననన్ రాగరంజిత గుణమణిన్

నీకాశ యశస్సంపన్న సంశోభిత సన్నుతాంగిన్

కౌశేయాంబర ధారిణిన్ కాంతామణిన్ రుక్మిణిన్


{45} హితమున్ గోరుచు కృష్ణుని

హితుల్ సన్నిహితుల్ సామంతుల్ స

హితము దెచ్చిరి ఇచ్చిరి ని

హితము కానుకల్ హరికిన్ హరిమధ్యకున్.


{46} మనసుల్లాసంబొందన్ గూడిరి

జనుల్ మరి ప్రీతిన్ గాంచిరి భీతిన్ వీడుచున్

చనువున రుక్మిణి హరి తోడన్

జినువున్ సకితోడ నాడు సరస సల్లాపంబుల్.

=================================================================================

సమాప్తం

========================================================================

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


13 views0 comments
bottom of page