top of page

వైదర్భి వివాహము -2


'Vaidarbhi Vivaham - 2/3' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 15/10/2023

'వైదర్భి వివాహము - 2/3' తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి

{17} అనవిని యశోద తనయుడు

తనమనసుకు దోచిన కన్యగు రుక్మిణిన్ దడయకచే

కొన వచ్చెద విదర్భ పురమున్ జొచ్చెద తెచ్చెదనా

ననబోడిన్ అది నచ్చని రిపులడ్డు వచ్చినన్ రెచ్చినన్.


{18} పన్నగశయనుని బరిణయమాడన్మది నే

నెన్నితి వనమాలికిన్ వినయంబుగ నది

విన్నవించ వినమ్రచిత్తనై బంబితి జన్నికట్టును నా

విన్నపమెరుంగ వెన్నుడు మన్నన జేసెనొ సేయకున్నడో


{19} అచ్చెరువాయె నింక ననున్

మెచ్చెనో మెచ్చకున్నడో అచ్యుతుడు

చెచ్చెర జని వచత్నువు వా

కృచ్చెనో హరికిన్ నే నచ్చిన జాడ్యమెచ్చటో.


{20} నమ్మితి నా మనోహరుని హరిని ఆతని

సమ్మతి గైకొని వేగంబున నిటు

రమ్మని బంపితి బాపని దడసె నేలకో

నమ్మక మెట్లగు నే నిమ్మళమొందన్.


{21} అక్షరు లక్షణంబెరుగన్ మది వి

లక్షణ చిత్తయై యా తరలేక్షణ తదేక

దీక్ష తోడుత వీక్షించు నగ్నిద్యోతుని జాడన్

రక్షకుడై క్షితిధరధరుని రాకన్ దెలియన్.


{22} ముట్టదు అన్నంబు ముదితకు బెట్టంగ

కట్టదు మేల్పట్టు బట్టలు జూపంగ

పెట్టదు విరులు కురులన్ దట్టబోదు

నెట్టదు ముంగురులు నిట్టిడ నేరమి తోడన్.


{23} రాయంచ దరి జేరరానీయదాయింతి

సయ్యటలాడంగ సకియల రానీదు

ఉయ్యాలలూగ నొయ్యారి గదులదు

గయ్యాళి తనమింక కనిపించబోదు.


{24} ముగుద కన్నుల నీరు ముత్యాల వరుస బోలు

నిగుడు చన్నులదాక నిబిడమై రాలు

మొగము చాటుగ జేసి యొగయు మగువ

మిగుల దుఃఖించు దిగులింక నోపబోక


{25} చెప్పదు తల్లికిన్ జెలులకున్

జెప్పదు జైత్యుని చేకొన మ

సొప్పని తీరున్ దా మది నిం

కొప్పిన కప్పు వేల్పు కథనం బొప్పన్.


{26} హరి చరితము వినినంతనె

హరుసించుచు హరు గొలిచెను

హరిచందన వదనాంగన ముర

హరి కరమందగ ముచ్చట నొందన్


{27} హర్యక్షుని రాక నెంచుచు

హర్యేక్షణ వీక్షించు వీడని దీక్షన్

అనిర్లక్ష్య చిత్తయై నిక్షిప్త వ్యథన్

నిరీక్షించు ఉపేంద్రుని జాడను ఉద్వేగంబున్


{28} శుభమున్ గల్గుగాక యో శుభ్రాంశు వదన నీకున్

అభయంబొసగె అభ్రగపతి వాహనుండు ఇంకన్

విభవంబొసంగె విభుండీ విప్రునకున్ నినున్

రభసంగొనిపోవ నేతెంచె రాక్షస వివాహమునన్.


{29} కరముల్ మోడ్చి మ్రొక్కెద యో

గురువర నీచరణంబుల్ చేదాకెదనింకన్

మరువన్ జాల నీ మేలు యో మహీసురనీ

కరుణన్ నిల్చితి శౌరి శరణంబొందన్


{30} మెచ్చిరి విదర్భ పుర జనుల్

సచ్చరితుని అచ్యుతునికిన్ దా

మెచ్చిన నెచ్చెలి రుక్మిణిన్

ఇచ్చుట మేలిక మచ్చిక నొందన్.


{31} దాక్షిణ్యంబును జూపన్వేడదనో దాక్షాయనీ దేవి

అక్షింతల్ జల్లుమమ్మ అక్షరుంబతిగన్ గూర్చుమమ్మ

నక్షత్రేశు దాల్పునకున్ నీకున్ లోక రక్షణ

లక్షణం బెరిగితిన్ కరుణన్ వీక్షించి రక్షించుమా.


{32} ఆనవాయితి దీర్చ అంబనుగొలువ

మీన లోచన గదిలె గదిని మదిని నిల్పి

హీన చరితుని చైద్యుని గాన నొల్లక నా

మానవతి జేరె మురళి గాన లోలు కడకు.

=================================================================================

ఇంకా ఉంది..

========================================================================

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


11 views0 comments

Commentaires


bottom of page