top of page

వందనం - అభివందనం!

#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #వందనంఅభివందనం, #VandanamAbhivandanam, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Vandanam Abhivandanam - New Telugu Poem Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 01/05/2025

వందనం-అభివందనం!తెలుగు కవిత

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


ఓ కార్మికసోదరా వందనం అభివందనం

నీ స్వేదంలో తడిపిన పునాదితో నిర్మిస్తావు ఆకాశ హర్మ్యాలు

అణువణువునా నీ శ్రమ ఫలితమే కనిపిస్తుంది అందాల  భవనాలాలో

ఆకర్షణీయమైన రంగులతో మయసభను తలపింప నైపుణ్యం నీస్వన్తం  

ఎదురులేదు బెదురులేదు  ఆకాశానికి  నిచ్చెనవేసి  మేడలు మిద్దెలు  తీర్చిదిద్దేవు  

కన్నులవిందుచేయు  ఆకారాలతో అబ్బురపరిచే  పనితనం నీది  

పేదలు మధ్యతరగతి ప్రజలు ధనవంతులు  అనే  అరమరికలులేవు అందరికి  ఆప్తుడవు

నీవులేనిదే  మాకు  తలదాచుకునే  నీడలేదు  ఇది నిజము

పనికోసం  ఎక్కడికైనా వెడతావు నీకు  ఎల్లలులేవు  భాషాబేధములేదు

గడ్డకట్టే  చలికి  వెఱపులేదు  కఠినమైన  కొండలు  యిట్టె పిండిచేస్తావు

పాలరాతి మందిరాలు నిర్మించి అందమైన   రాచబాటలు   వేస్తావు  

చెట్లుకొట్టి కలపతో  అందమైన   ఆకృతులకు రూపమిస్తావు  

రోడ్డు రైలు  మార్గాలకు   రూపకల్పనచేసే  సృష్టికర్తవు  

జిలుగువెలుగుల  విద్యుత్ దీపాల అమరికలో నీ చాతుర్యం అసమానం  

అందమైనకట్టడాలు  విహార  వినోద ప్రపంచాన్ని    సృష్టించగల   విశ్వకర్మవు  

నీపనితనం లో తాజ్మహల్  నిర్మాణం ప్రపంచ  ఖ్యాతికి  దర్పణం  

నీశ్రమతో  కొత్త లోకాన్ని సృష్టించి    శాశ్వత  కీర్తి  దక్కించుకుని  చరిత్రలోనే  నిలిచిపోయావు  

ధన్యుడవు సోదరా ! నీకు సాటిలేరు వేరెవరు నీకు వందనం అభివందనం!


******************* 

-ఏ. అన్నపూర్ణ



Comments


bottom of page