top of page

వరదక్షిణ

Writer: Sudarsana Rao PochampalliSudarsana Rao Pochampalli

'Varadakshina - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'వరదక్షిణ' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


ఈ వరదక్షిణ కు పర్యాయ పదాలు-- అరణము, ఉడుగర, దాయము, వరదక్షిణ, వీడు, శుల్కము, సుదాయము, మున్నగునవి వివాహ సందర్భమున వరున కిచ్చే కానుకలు.


అట్లనె కన్యకు కూడా అభిహరణము, ఆధివేదనికము, ఆభ్యాదాయికము, ఉంకువ, ఉంకువము, ఓలి, పైడి, శుల్కము, సంకు, సంకుడు మున్నగు పేర్లతో వెనుకటికి కన్యా శుల్కము ఇచ్చెడి వారు. ఈ కన్యా శుల్కము మరుగు పడి వరదక్షిణ అనబడె దుష్ట సంప్రదాయము అంటు వ్యాధిలా వ్యాపించి ఇంకా కొనసాగుచు ఎందరో వివాహితల ప్రాణాలు బలిచేయడము కాని అధిక పీడనకు వారే ఆత్మ హత్యలు చేసుకోవడము కాని రోజూ వింటున్న వార్తలు.


రామయ్య, రంగయ్య ఇంటి పక్క పక్కనే ఉంటారు- ఇద్దరూ విశ్రాంత ఉద్యోగులే- చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలు కలిగినవారు. పక్క పక్కనే ఉండడము చేత ఇద్దరికి స్నేహితము ఏర్పడుతుంది-


ప్రొద్దున్నే లేచి చాయ త్రాగి ఇంటి అరుగు మీద కూర్చొని దిన పత్రిక తిర్గేయడము వారి దినచర్య. రామయ్య దినపత్రిక చూసి ప్ల్చ్ అనుకుంటూ పెదవి విరుస్తాడు. అది చూసిన రంగయ్య ఏమిటి రామయ్య ఎందుకో నిస్పృహ గా వున్నావు అని అడుగుతాడు- తలెత్తి ఈ రోజు పత్రిక చూడలేదా అన్నీ చావు కబుర్లే వాటికి తోడు వరదక్షిణ దాష్టీకాలే- ఇదేమిటి స్త్రీ జాతి చేసుకున్న పాపము ?అంటాడు రామయ్య. అవును రామయ్యా అటువంటి వార్తలు చూసి చూసిహృదయము చలించి పోతుంది- నువ్వ పత్రిక పక్కకు బెట్టి ఆడ పిల్లలకు సందేశంగా ఒక కవిత వ్రాశాను విను అంటూ లోనికి పోయి తను వ్రాసిన కవిత తెచ్చి వినిపిస్తుంటాడు రంగయ్య.


పెళ్ళీడొచ్చిన పిల్లల్లారా

ఆడ పిల్లల్లారా

కళ్ళు కాస్త తెరువండి

మగవాళ్ళతొ కాళ్ళ బేరం మానండి


చదువులు సందెలు నేర్చినందున

చదివిన పాఠాలు మరువక మీరు

అదుపు లేని కోరికలతో

అంతు లేని జాబితాలతొ

అల్లుని రూపున వచ్చే ఆ జామాతని

అప్రయోజకుడని ఎంచండి

అతనితొ కాపురము

నిష్ప్రయోజనమని గుర్తించండి


లక్షలు మించిన ఆస్తులు ఉన్నా

లక్షణంగా చదువులు ఉన్నా

లక్షలు లక్షలు దక్షిణ అడిగే

అవలక్షణ పరులను లక్ష్య పెట్టక

ఆదర్శంగా నిలువండి

స్త్రీ జాతి గౌరవము నిలుపండి


అంగడి బొమ్మలు మీరని తలచే

ఆ మగవారే అంగడి పశువులు

అమ్ముడు బోయే ఆంబోతుల

పొగరు అణుచగ పోరాడండి.

పెళ్ళీడొచ్చిన పిల్లల్లారా

ఆడ పిల్లల్లార—


ఈ కవిత విని భేష్ అంటాడు రామయ్య.


అయినా దున్నపోతు మీద పడ్డ వాన-- అంటాడు రామయ్య.


కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఉల్లేఖించిన దేమిటంటె.


ఆడిన మాటను తప్పిన

గాడిద కొడుకా యని దిట్టగ అయ్యో

వీడా నా కొడుకని

గాడిద యేడ్చెన్ గదన్న ఘన సంపన్నా


అదివిని "ఒక్క అబద్ధపు మాటకే గాడిదకు పౌరుషము వస్తె ప్రాణాలను హరించే ఈ నీచుల నేమనాలె" అంటాడు రామయ్య.


"అవును రామయ్యా! ఈ పద్యము విను. వరదక్షిణ ఈయడ మంటె ఎలాంటిదో" అని పద్యము వినిపిస్తాడు రంగయ్య.


వరునకు దక్షిణ అనగను

గురువుగ తండ్రియె సుతునకు గుణమును నేర్పన్

ధరణిన అడ్డుయు లేకను

మరణపు దారయె మగువకు మహిలో జూడన్


"బాగుంది గాని మనము ఎంత మొత్తుకున్నా అరణ్య రోదన అయితున్నది. పాపము అభం శుభం ఎరుగని ఆడ పిల్లలు బలైతున్నరు" అం టాడు రామయ్య.


"ఈ కట్ణ పిశాచి గురించి ఒక కవిత వ్రాశాను విను రామయ్యా "అంటూ కవిత వినిపించసాగాడు రంగయ్య.


దాత దక్షిణ ఈయవద్దని- వరుడు డబ్బులు కోరవద్దని

విప్రుడా మంత్రం చదువ వద్దని

చట్టాలెన్నో వ్రాసిపెట్టిరి కాగితాలలో

కట్టిపెట్టిరి వాటినన్నిటిని బట్ట మూటలో


పుట్టుక తోనే ఆడ పిల్లలు కట్టుబాటులో పెరుగుచుందురు

ఈడువచ్చి రాగానే చేతురు వారు

తల్లికి తోడుగ ఇంటి పనులు- వంట పనులు

ఆడపిల్లకు జోడు కొరకై జాడలెన్నో తీసి తండ్రి

తనకు అల్లుడు తగిన వాడని చదువు సందెలు నేర్చినాడని

కులం మతం కుదిరిందని- జాతకాలు కలిశాయని

పట్టలేని ఆనందంతో పట్టికి కలిగిన అదృష్టానికి

పెట్టించును పెద్దలతో పెళ్ళి ముహుర్తం.


అప్పుడే----


కట్ణ పశాచి కళ్ళు తెరుచును

వరుని తండ్రిని ఆవహించును

దాక్షిణ్యం దారి తెలువక

దక్షిణ తెమ్మని దబాయించుచు

కనికర భావం కలుగబోదను

వియ్యంకునితో సదా నెయ్యం గోరుచు

ఉన్నదంతా ఊడ్చి పెట్టినా

వరుడు మాత్రం మరువ డెప్పుడు

మామను కోరుట మామూళ్ళు

తనుగూడ తండ్రినగుదునని

అల్లునికెప్పుడొ మామనగుదునని

ఆలోచించడు అవివేకం వదులడు

పరాన్న భుక్కై శరాన్ని దలువడు


అని ముగిస్తాడు రంగయ్య.


"ఆహా ఎంత చక్కని కవిత.. అయిన ఈ దుష్ట భావాల సమాజానికి జ్ఞానోదయం ఎప్పుడు కలుగాలి ప్ల్చ్" అనుకుంటూ నిట్టూరుస్తాడు రామయ్య.


రామయ్య ఇక లోనికి పోతూ ఒక మాట అంటాడు-- "రాముడు లక్ష్మణుడు దారెంట పోతుండగా లక్ష్మణుడంటాడు-- 'అన్నా పూర్తిగా వికసించి పరిమళించే పుష్పాన్ని- ముగ్ధ మనోహరమైన కన్యకా మణిని చూచి ఏ పురుషునకు మనసు చెలించదు' అని-


దానికి రాముని సమాధాన మేమిటంటె "తల్లి దండ్రుల పెంపకము సరిగా ఉంటే ఏ దుష్పరిమాణము జరుగదు" అంటాడు. ఇదీ అంతే. తల్లి దండ్రులే ప్రొత్సహించి కొడుకుకు కొండంత బలమిస్తుంటే జరిగే పరిణామమే ఇది" అని వెళ్ళి పోతాడు రామయ్య-


అక్షరాలా వాస్తవమే అనుకుంటూ తాను లోపలికి పోతాడు రంగయ్య.


సమాప్తం.


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.




 
 
 

Kommentare


bottom of page